నీ చిత్రం చూసి… లిరిక్స్
చిత్రం: లవ్ స్టోరీ (2021)
సంగీతం: పవన్ సిహెచ్
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: నాగచైతన్య అక్కినేని, సాయిపల్లవి
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాణం: నారాయణ దాస్ కె నారంగ్, పి.రామ్మోహనరావు
విడుదల తేది: 16.04.2021
Nee Chitram Choosi Song Telugu Lyrics
నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో… ఓ ఓ ఓఓ
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో… ఓ ఓ ఓఓ
నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో…
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో…
నా ఇంటి ముందు… రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు
నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో
ఈ దారిలోని గందరగోళాలే… మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో… మన పెళ్ళీ మంత్రాలుగా
అటు వైపు నీవు… నీ వైపు నేను
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా… ఆ ఆఆ
ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా
నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటుంది ప్రేమా
ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ
ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తానని
నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోని… ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని
ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది
మనకు ప్రేమా… ఆ ఆ ఆఆ
Love Story Movie Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
ఏయ్ పిల్లా… లిరిక్స్
చిత్రం: లవ్ స్టోరీ (2021)
సంగీతం: పవన్ సిహెచ్
సాహిత్యం: చైతన్య పింగళి
గానం: హరిచరణ్
నటీనటులు: నాగచైతన్య అక్కినేని, సాయిపల్లవి
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాణం: నారాయణ దాస్ కె నారంగ్, పి.రామ్మోహనరావు
విడుదల తేది: 16.04.2021
Ay Pilla Song Telugu Lyrics
ఏయ్ పిల్లా పరుగున పోదామా.. ఏ వైపో జంటగ ఉందామా
రా రా.. కంచె దుంకి, చక చక ఉరుకుతు
ఆ.. రంగుల విల్లుని తీసి.. ఈ వైపు వంతెన వేసి.. రావా
ఎన్నో తలపులు, ఏవో కలతలు బతుకే పొరవుతున్నా
గాల్లో పతంగిమల్లె.. ఎగిరే కలలే నావి
ఆశనిరాశల ఉయ్యాలాటలు, పొద్దుమాపుల మధ్యే
నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే
నీతో ఇలా.. ఏ బెరుకు లేకుండా
నివ్వే ఇగ.. నా బతుకు అంటున్నా
నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే తలగడగా
నీ తలను వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా మిలమిల చూడే
వచ్చే మలుపులు, రస్తా వెలుగులు.. జారే చినుకుల జల్లే
పడుగూ పేకా మల్లె.. నిన్ను నన్ను అల్లే
పొద్దే తెలియక, గల్లీ పొడుగున.. ఆడే పిల్లల హోరే
నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే..
ఏయ్ పిల్లా పరుగున పోదామా.. ఏ వైపో జంటగ ఉందామా
పారే నదై నా కలలు ఉన్నాయి చేరే దరే ఓ వెదుకుతున్నాయే
నా గుండె ఓలి చేసి, ఆచి తూచి అందించా జాతరలా
ఆ క్షణము చాతి పైన సోలి చూశా లోకం మెరుపుల జాడే
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి.. నేలన కనిపిస్తుందే
మారే నీడలు గీసే.. తేలే బొమ్మలు చూడే
పట్నం చేరిన పాలపుంతలు.. పల్లెల సంతలు బారే
నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే
Love Story Movie Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****