Maa Alludu Very Good (2003)

maa alludu very good 2003

చిత్రం: మా అల్లుడు వెరీ గుడ్ (2003)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి.బి. చరణ్ , చిత్ర (హమ్మింగ్)
నటీనటులు: అల్లరి నరేష్ , రాజేంద్రప్రసాద్ , మోనిక , రమ్యకృష్ణ
మాటలు (డైలాగ్స్): జనార్దన్ మహర్షి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఈ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: యమ్. రామలింగ రాజు
సినిమాటోగ్రఫీ: వి.శ్రీనివాస రెడ్డి
ఎడిటర్: గౌతమ్ రాజు
బ్యానర్: రోజా మూవీస్
విడుదల తేది: 06.12.2003

ముత్యాల పల్లకిలో నా కలల రాణి అదిగో
ఆకాశ వీధులలో నా కనుల వెలుగు అదిగో
పేరే స్వప్నబాల ఊరే మేఘమాల
చేరువయ్యేన ఒకనాడు
తలపులు చినుకులు కురిసిన తొలకరిలో

ముత్యాల పల్లకిలో నా కలల రాణి అదిగో

నేను చూసిన నయనాలు ఉషస్సులో కిరణాలు
నవ్వు తరగని అధరాలు తేనె కొలనులు
లేత చిగురుల చెక్కిళ్ళు ఉగాదిలో మావిళ్లు
లేచి నడిచిన పాదాలు పూల మణుగులు
మెరిసిన ముంగురులు మనసుకు లంగరులు
సొగసుల భంగిమలు
నా వయసుకు గింగిరులు
నేనో బ్రహ్మచారి తానో రాకుమారి
ఏకమయ్యేన ఒకనాడు
మనసున కురిసిన మన్మధ నగరంలో

ముత్యాల పల్లకిలో నా కలల రాణి అదిగో
ఆకాశ వీధులలో నా కనుల వెలుగు అదిగో

దోచుకున్నది దొరసాని సరాసరి హృదయాన్ని
గుచ్చుతున్నది గురిచూసి మల్లె బాకుని
కన్నెసొంపుల సంకెలతో ఎకాఎకి అల్లుకొని
నన్ను చివరకి చేసింది జన్మ ఖైదుని
నామది సీమలలో ప్రేమకు ఆమనివే
నారీ లోకంలో చోర శిఖామణివే…
నేనే నీకు బందీ నీతో రాసివుంది
వేచి ఉంటాను వెయ్యేళ్ళు
కమ్మని ఊహల కారాగారంలో

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top