Maa Annayya (2000)

చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: హరిహరన్
నటీనటులు: రాజశేఖర్ , మీనా, వినీత్, బ్రహ్మాజీ, మహేశ్వరి, దీప్తి భట్నాగర్
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాతలు: బెల్లంకొండ సురేష్ , యస్.రమేష్ బాబు
విడుదల తేది: 2000

నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే

నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

దేవుడు కనబడి వరమిస్తే వేయిజన్మలు ఇమ్మంటా
ప్రతి ఒక జన్మ నాకంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా
దేవత నీవని గుడి కడతా దేవత నీవని పూజిస్తా

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

ప్రేమకు మరుపే తెలియదులే నిన్ను ఎన్నడు మరువదులే
తెరలను తీసి నను చూడు జన్మ జన్మలు నీ తోడు
వాడనిదమ్మ మన వలపు ఆగనిదమ్మా నా పిలుపు

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే

నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

error: Content is protected !!