చిత్రం: మా దైవం (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు
నటీనటులు: యన్.టి.ఆర్, జయచిత్ర
స్క్రీన్ ప్లే: డి.వి.నారా రాజు
దర్శకత్వం: ఎస్. ఎస్.బాలన్
నిర్మాత: మణియన్ విద్యాస్ లక్ష్మణ్
విడుదల తేది: 17.09.1976
పల్లవి:
కాలాత్మా సర్వభూతాత్మా!
వేదాత్మా విశ్వతో ముఖ: !!
దీనబంధూ దయాసింధో !
దివ్యాత్మా నమో నమ: !!
ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడే
అందులకే అతనికి తలవంచాలి.. అనుదినమూ ఆ దేవుని పూజించాలి
ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడే
అందులకే అతనికి తలవంచాలి.. అనుదినమూ ఆ దేవుని పూజించాలి
ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడే
చరణం: 1
భగవంతుని ప్రతిరూపం కరుణయందురు.. ఆ కరుణతో భగవంతుని చూడమందురు
భగవంతుని ప్రతిరూపం కరుణయందురు.. ఆ కరుణతో భగవంతుని చూడమందురు
కరుణయే మనిషికి దేవుని వరము..
అది పరులయెడల చూపినపుడే బ్రతుకు ధన్యము
ఒకే కులం… ఒకే మతం…. అందరు ఒకటే
చరణం: 2
పాపాలకు వేనవేలు దారులున్నవి.. ధర్మగోపురాని కొక్కటే ద్వారమున్నది
పాపాలకు వేనవేలు దారులున్నవి.. ధర్మగోపురాని కొక్కటే ద్వారమున్నది
నీతియే ఊపిరిగా నిలపాలి.. న్యాయమే బాటగా సాగాలి
ఒకే కులం… ఒకే మతం… అందరు ఒకటే
చరణం: 3
చెడుపనులు చేయకు.. చెడును చూడకు.. చెడుమాటలు.. నీ నోటను మాటలాడకు
చెడుపనులు చేయకు.. చెడును చూడకు.. చెడుమాటలు.. నీ నోటను మాటలాడకు
పగయే నీ శత్రువనే నిజము తెలుసుకో..
ప్రేమతో పగను గెలిచి బ్రతుకు దిద్దుకో… మన బాపూజీ మాట నిలుపుకో
ఒకే కులం.. ఒకే మతం.. అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడే
అందులకే అతనికి తలవంచాలి.. అనుదినమూ ఆ దేవుని పూజించాలి