చిత్రం: మావారి మంచితనం (1979)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు , జగ్గయ్య, వాణిశ్రీ, పుష్పలత, ఛాయాదేవి, బేబీ రోహిణి
దర్శకత్వం: బి.ఏ.సుబ్బారావు
నిర్మాత: ఏ. పుండరీకాక్షయ్య
విడుదల తేది: 09.03.1979
ఎంతకైనా తగిన వాడవేరా
మురళీధర రాగల దొర
నవ శ్రావణ జలథర నీలా సుందరా
ఎంతకైనా తగిన వాడవేరా
ననుమరచి యమునను మరచి
వెన్నెలకురియు ఇసుక తిన్నెలు మరచి
మధురాపురిలో వున్నావా
నీ మధురాథరనే కాదన్నావా
ఎంతకైనా తగిన వాడవేరా
ఈ సుర పొన్నలు చెబుతాయి
యెదలోని తీయని అలజడిని
ఈ ఎదురు పొదలన్నీ చెబుతాయి
నీ వేణువు చేసిన అల్లరిని
ఎంతకైనా తగిన వాడవేరా
ఎంతగా సుమశరుడు నను వేధించినా
వింతగా హిమకరుడు నను కవ్వించినా
రేలన్నీ పగబూనినా చెలి గాలి సెగలై వీచినా
నీ భావనమే నా జీవనమై
నీ కీర్తనమే నా నర్తనమై
నీ చరణమే నా శరణమై
నీ స్మరణమే భవతరణమై
నిన్ను నమ్మి ఇన్నినాళ్ళు వేచిన
ఎన్ని యుగములైన నిన్నే వలచిన రాధను రా
నీ రాధను రా
ఎంతకైనా తగిన వాడవేరా