చిత్రం: మావి చిగురు (1996)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
నటీనటులు: జగపతిబాబు, ఆమని, రంజిత
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: పి.ఉషారాణి
విడుదల తేది: 30.05.1996
మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి
అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి
బంగారు సీతమ్మవై పూజించుకుంటానని
కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని
మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
పాతికేళ్ళ పెనిమిటైనా పాపాయిలా చూసుకున్నా
కాలుజారుతుందో ఏమో అని కళ్ళల్లోనే దాచుకున్నా
కన్న బిడ్డకన్న మొగుడు మీదనే నా బెంగ ఎల్లప్పుడూ
పిచ్చి తల్లినో గడుసు పిల్లనో చెప్పలేనె ఇప్పుడూ
ఏనాడైనా ఒక్కమాటైనా అనలేదమ్మా వెర్రి నాయనా
అటువంటి మారాజుకీ తగు జంట అవుతాననీ
త్వరలోనె నా ఊసునీ మరపింప చేస్తాననీ
మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
ముత్తైదుగా పైకి వెళ్ళే భాగ్యాన్ని పొందాను గనకా
వస్తాను త్వరలోనె మళ్ళీ ఆ పుణ్యమే తోడురాగా
ఏమి చేసినా కన్న తండ్రిలా కాపాడు శ్రీవారి ప్రేమా
ఎంత పొందినా తనివి తీరదే కావాలి ఇంకొక్క జన్మా
ఆ చేతుల్లో చిట్టి పాపనై ఉయ్యాలలూగే తృప్తి కోసమై
వచ్చేది నేనేననీ గుర్తుంచుకుంటాననీ
ఆ కొత్త జన్మానికీ నా పేరె పెడతాననీ
మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి
అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి
బంగారు సీతమ్మవై పూజించుకుంటానని
కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని
మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
******** ******** ********
చిత్రం: మావి చిగురు (1996)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, చిత్ర
పల్లవి:
కొమ్మన కులికే కోయిల
ఓ కమ్మని పాట పాడవే
కమ్మగ నవ్వే నెచ్చెలి
నీ అందెల సవ్వడి చెయ్యవే
ఓ….మామా – ఓ….భామా
ఎదలోయల దాగిన చిత్రమా
కనుసైగలు చేసిన ఆత్రమా
ఉదయాలకు నీవే ప్రాణమా
కసి ముద్దులు రాసిన కావ్యమా
వయారాల వీణ మీటి దోచుకున్న నేస్తమా
కొమ్మన కులికే కోయిల
ఓ కమ్మని పాట పాడవే
తేనెలు మరిగిన తుమ్మెదా
కను చూపుల గారడి చేయకే
చరణం: 1
చెప్పేయ్ వా చెవిలోన ఒక మాట
పువ్వులతో తుమ్మెద చెప్పేమాట
నీ చిరునవ్వు సాక్షిగా తాజ్మహల్ నాదట
నీ పెదవంచు సాక్షిగా షాజహాను నేనట
నీ తియ్యని ప్రేమకి నా పెదవే నజరానా
నీ పైటకి నేనిక బానిసనే నెరజాణ
అనంతాల ఆర్త నీవై చేరుకున్న వెళ్లలో
కొకలు కట్టిన కోయిల ఓ కమ్మని కౌగిలియవే
తేనెలు మరిగిన తుమ్మెద కను చూపుల గారడి చేయకే
చరణం: 2
పూసింది కౌగిట్లో పులకింత
వెచ్చంగా పాకింది ఒళ్ళంతా
పదహారేళ్ళ యవ్వనం పదిలంగా దాచిన
నీ మెడలోని తాళినై నూరేళ్లు దాగన
నీ చెంతకు చేరా విరహంతో పడలేక
నును మెత్తని పరువం రాసింది శుభలేఖ
సరగాల సాగరాన స్వాతిచినుకై సోలిపో
కొమ్మన కులికే కోయిల
ఓ కమ్మని పాట పాడవే
తేనెలు మరిగిన తుమ్మెదా
నీ అల్లరి పనులిక ఆపవే
ఓ….భామ – ఓ….మామ
ఉదయాలకు నీవే ప్రాణమా
కసి ముద్దులు రాసిన కావ్యమా
ఎదలోయల దాగిన చిత్రమా
కనుసైగలు చేసిన ఆత్రమా
వయారాల వీణ నీవై దోచుకున్న అందమా
కొమ్మన కులికే కోయిల
ఓ కమ్మని పాట పాడవే
కమ్మగ నవ్వే నెచ్చెలి
నీ అందెల సవ్వడి చెయ్యవే