నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం… లిరిక్స్
చిత్రం: మాధవయ్యగారి మనవడు (1992)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, కె. ఎస్. చిత్ర
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, హరీష్, సుజాత, నందిని
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాణం: వి. దొరస్వామి రాజు
విడుదల తేది: 16.04.1992
Nee Choopu Suprabhatham Song Lyrics
ఆ హా.. ఆ హా.. ఆ హా..హా..హా..
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
ఆత్రేయ ప్రేమగీతం అందానికే వసంతం
నీ పాటపాడినే.. పల్లవైతి నీ పదము తప్ప ఏ పదములు దొరకక
నేనేమొ నీలిమేఘం నీవేమొ వాయువేగం
నేనేమొ నీలిమేఘం నీవేమొ వాయువేగం
ఆ ఘంటసాల రాగం ఆడిందిలే సరాగం
నీ జంటకోరి నే కీర్తనైతి నీ స్వరము తప్ప ఏ వరములు అడగక
లలల లలలా.. లలల లలలా.. లలల లలలా..
లలలలలా.. లలలలలా.. లలలలలా..
లలలలలా.. లలలలలా..
పూతల్లో పురివిడిచిన పులకింతా..
చేతల్లో మునుపెరగని చెమరింతా..
ఉలికిపడిన నీ నలక నడుములో..
మెలిక పడితినే వీణలో తీగనై..
తగిలింది తాళం.. రగిలింది రాగం..
చినుకల్లే నా వొణుకే తీరా.. తడికోరేటి తాపాలలో..
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
నేనేమొ నీలిమేఘం నీవేమొ వాయువేగం…
కోకేలే ముద్దెరుగని సాయంత్రం
చీపోలే సిగ్గడిగిన తాంబూళం
కథలు తెలిసెలే.. ఎదల కనులలో..
పురుడు కడిగిపో.. పువ్వకే తేనెతో..
నులిపెట్టే దీపం శిలలోనే శిల్పం
వలపల్లె ఆ వయసే తీరా జతలూగేటి జంపాలలో..
నేనేమొ నీలిమేఘం నీవేమొ వాయువేగం
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
ఆ ఘంటసాల రాగం ఆడిందిలే సరాగం
నీ పాటపాడినే.. పల్లవైతి నీ పదము తప్ప ఏ పదములు దొరకక
నేనేమొ నీలిమేఘం నీవేమొ వాయువేగం
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
Madhavayya Gari Manavadu Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
????????????????