ఊహలే ఉసిగొలుపు రాతిరి… లిరిక్స్
చిత్రం: మధుమాసం (2007)
నటీనటులు : సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: పెద్దాడ మూర్తి
గానం : కె.ఎస్. చిత్ర, కార్తీక్
దర్శకత్వం : చంద్రసిద్దార్థ
నిర్మాణం : డి.రామానాయుడు
విడుదల తేది : 9.02.2007
ఊహలే ఉసిగొలుపు రాతిరి
ఊపిరే గుసగుసల లాహిరి
గాజుల్లొ మోగుతున్న రాగం..
గజ్జల్లొ గల్లుమన్న వేగం
రెప్పల్లొ తుళ్లిపడ్డ తాళం..
ఇంకాన ఎందుకంట దూరం
పిల్ల గాలుల్లోన పిప్పిపీలు
గుండెల్లో ఢుంఢుం ఢూలు
రేపొమాపొ మోగే ఢోలు
గట్టి మేళాలొచ్చె ముహుర్తాలు
భాజాలు భజంత్రీలు
తీరుస్తాయి ఆరాఠాలు
ఊహలే ఉసిగొలుపు రాతిరి
ఊపిరే గుసగుసల లాహిరి
నరనర నరమొక తీగరా..
పరువపు స్వరములు లాగరా..
తడుబడు నడుమును మీటరా..
నలిగిన క్షణమొక పాటరా..
అబలలో తహతహ తబల
అధిమితే ఖజురహ పరహా..
పెదవులే మురళికి సరిరా..
ముద్దులే సరిగమరా..
పిల్ల బుగ్గపూచే మందారాలు
అందాల హింధోలాలు సందేలల్లో సావాసాలు..
ఒళ్లొపాడే శృంగారాలు
ఎన్నెన్నో సంచారాలు ఎన్నెన్నో ఏకాంతాలు..
ఊహలే ఉసిగొలుపు రాతిరి
ఊపిరే గుసగుసల లాహిరి
పరిపరి విథముల తాకరా..
పలికిన రిథములు నీవిరా..
సొగసుల జతనే చేరరా..
ఒడుపుగా శృతినే చేయరా..
తనువులో తపనల ధరువై
పడకలో నిదురలు కరువై
కనులలో వలపొక ఎరుపై
ఎందుకో ఎద బరువై
ఒంట్లొ ఉన్నాయమ్మొ సంగీతాలు
సన్నాయి సంకేతాలు విన్నానమ్మొ సాయంత్రాలు..
నవ్వుల్లోన వయ్యారాలు
నడకల్లో మంజీరాలు రారమ్మంటే సంతోషాలు..
ఊహలే ఉసిగొలుపు రాతిరి
ఊపిరే గుసగుసల లాహిరి
********** ********** ********** **********
వసంతం వాయిదా పడైనా రాదుగా… లిరిక్స్
చిత్రం: మధుమాసం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: రంజిత్ , రీటా
నటీనటులు: సుమంత్, స్నేహ , పార్వతి మెల్టన్
దర్శకత్వం: చంద్ర సిద్దార్ధ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 09.02.2007
పల్లవి:
వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా
వసంతం వాయిదా పడైనా రాదుగా
చరణం: 1
విరజాజి పూలే విరహాన రాలే
మలిసందే వేళే తెలవారి పోయే
పొడి ఇసుక దారులలో
మన అడుగు జాడలలో
గతము తలచి కలిసి నడిచి
వలపు కలయిక కలా
నిదుట నిలచి ఎదను తెరచి
క్షణము దొరకవు కదా
వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
చరణం: 2
బస్తీల నిండా బృందావనాలే
ముస్తాబు మీద హస్తాక్షరాలే
ఎదురసలు చూడనిది
మనము అనుకోనిదిది
మనసు అలుపు మమత అలుకు
జతను కలిపెను కదా
ఎవరికెవరు ఒకరికొకరు
ఇపుడె తెలిసెను కదా
వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా
వసంతం వాయిదా పడైనా రాదుగా
Please post oohale song lyrics from madhumaasam 2007
Sure Sir.