Magadheera (2009)

చిత్రం: మగధీర (2009)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనూజ్ గురువార, రీటా
నటీనటులు: రాంచరణ్, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాతలు: అల్లు అరవింద్, బి.వి.యస్. యన్. ప్రసాద్
విడుదల తేది: 31.07.2009

పంచదారా బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా
మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఎమవుతానమ్మా

నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా
నువు అందకపోతే వృధా ఈ జన్మా
నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా
నువు అందకపోతే వృధా ఈ జన్మా…

పువ్వుపైన చెయ్యెస్తే కసిరి నన్ను తిట్టిందే
పసిడి పువ్వు నువ్వనిపంపిందే
నువ్వు రాకు నా వెంటా ఈ పువ్వు చుట్టూ ముల్లంటా
అంటుకుంటే మంటే ఒళ్ళంతా

తీగ పైన చెయ్యెస్తే తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందే
మెరుపువెంట ఉరుమంటా ఉరుము వెంట వరదంటా
నే వరదలాగ మారితే ముప్పంటా

వరదైనా వరమని వరిస్తానమ్మా అ అ అ
మునకైనా సుకమని వడేస్తానమ్మా అ అ అ
నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా
నువు అందకపోతే వృధా ఈ జన్మా…

గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా
గాలి ఉపిరైయ్యిందీ నేల నన్ను నడిపిందీ
ఎవిటంట నీలో అది గొప్ప
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది పక్షపాతమెందుకు నా పైనా…
వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది
వాటితోటి పోలిక నీకేలా
అవి బతికున్నప్పుడే తోడుంటాయమ్మా
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా

నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా
నువు అందకపోతే వృధా ఈ జన్మా…

*********   *********   ********

చిత్రం: మగధీర (2009)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణిి , నికిత నిగమ్

ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొర
అసమాన సాహసాలు చూడ రాదునిద్దుర
నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొర
సఖి సా… సఖి

ఆఆ ఆఆఆఆఆ ఆఆ ఆఆఆఆఆఆఆ

సమరములో దూకగా చాకచక్యం నీదేరా
సరసములో కొద్దిగా చూపరా
అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా
అధిపతినై అదికాస్తా దోచేదా – మ్ మ్ మ్ మ్

పోరుకైన ప్రేమైకైనను దారి ఒకటేరా
చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా
ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్ర పుత్ర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొర

సువెరాహియా… హో  సువెరాహియా… హో (2)

శశి ముఖితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో ఖడ్గమే ఆడదా
మగసిరితో అందమే అంతు తడితే అంతేగా
అణువనువూ స్వర్గమే ఐపోదా
శాసనాలు ఆపజాలని తాపముందిగా
చెరశాలలోని ఖైదు కాని కాంక్షవుందిగ
శతజన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నను చేరుకుందిరా
గుండెలో నగార ఇక మోగుతోందిరా
నవ సోయగాలు చూడ చూడ రాదునిద్దుర
ప్రియ పూజలేవో చేసుకోన చేతులారా సేదతీర

ధీర ధీర ధీర మనసాగలేదురా
ధీర ధీర ధీర మనసాగలేదురా

*********   **********   ********

చిత్రం: మగధీర (2009)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: దలేర్ మెహందీ ,  గీతామాధురి

పైట నలిగితే మాయమ్మ ఒప్పుకుంటదేటి
బొట్టుకరిగితే మా బామ్మా ఊరుకుంటదేటి

అదే జరిగితే…ఒలమ్మో
అదే జరిగితే అత్తమ్మ తట్టుకుంటదేటి
ఏటిచెప్పను నానేటి చెప్పను నానేటి చెప్పను

చెప్పానే చెప్పొద్దు చెప్పానే చెప్పొద్దు
చెప్పానే చెప్పొద్దు వంకా తిప్పనే తిప్పొద్దు డొంకా
చేతుల్లో చిక్కకుండా జారిపోకే జింకా
పారిపోతే ఇంకా మొగుతాది ఢంకా

చెప్పానే చెప్పొద్దు వంకా ఇవ్వనే ఇవ్వొద్దు ఢంకా
ఏనాడో పడ్డదంట నీకు నాకు లింకా
నువ్వునేను సింకా వోసి కుర్రకుంకా
ఎక్కడ నువ్వెలితే అక్కడ నేనుంటా
ఎప్పుడు నీ వెనకే… ఏఏఏఏఏఏ

జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే
బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే
జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే
బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే
జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే
బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే

ఈ యాల మంగలవారం మంచిది కాదు మానేసెయ్ సే సే సే

సీ సహా… సీ సహా… (2)

నీ వెంట పడతా బొంగరమై నీ చుట్టు ముడతా పంజరమై
నీ సిగ్గుకోస్తా కొడవలినై నవ్వోలికిస్తా కవ్వాన్నై
హ షభా అరె షభా అరె షభా  షభా షభా షభా షభా

నీ వెంట పడతా బొంగరమై నీ చుట్టు ముడతా పంజరమై
నీ సిగ్గుకోస్తా కొడవలినై నవ్వోలికిస్తా కవ్వాన్నై

నిప్పుల ఉప్పెనలే ముంచుకువస్తున్నా
నిలువను క్షణమైనా… ఏఏఏఏఏఏ

జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే
బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే
జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే
బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే

అలవాటు లేనే లేదు అయ్యెదాక ఆగేసేయ్ సె సె సె
ఎ పిల్లడు ఎ ఎ పిల్లడు ఒయ్ పిల్లడు ఒయ్ ఒయ్ పిల్లడూ
చల్లెక్కుతున్న వేళ చిమ్మ చెట్టు నీడలోకి
చురుక్కుమన్న వేళ పాడు బడ్డ మేడలోకి
వాగులోకి వంకలోకి సందులోకి చాటులోకి
నారుమల్లతోటలోకి నాయుడోల్ల పేటలోకి
బుల్లిచేను పక్కనున్న రెళ్లుగడ్డి పాకలోకి
పిల్లడో ఏం పిల్లడో

ఏం పిల్లడో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్డా మొస్తవా

వస్తా బాణాన్నై రాస్తా బలపాన్నై
మొస్తా పల్లకినై ఉంటా పండగనై
నీ దారి కోస్తా బాణాన్నై నీ పేరు రాస్తా బలపాన్నై
నా ఈడు మొస్తా పల్లకినై నీ తోడు ఉంటా పండగనై
పిడుగుల సుడిలోనా ప్రాణం తడబడినా
పయనం ఆగేనా యె యె ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్

జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే
బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే
జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే
బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే
జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే
బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే
జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే
బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే

*********   *********   ********

చిత్రం: మగధీర (2009)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: జెస్సి గిఫ్ట్

అనగనగనగనగ అనగనగ
అనగనగనగనగనగనగ అనగనగనగనగ
అనగనగనగనగనగనగనగనగనగ…
హే అనగనగనగనగనగ రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టలో ఒకటే ఎందుకు ఎండలేదురా…
అది ఒకటే ఎందుకు ఎండలేదురా…
అది ఎండేలోగ వానొచ్చిందిరా పాయింటే…
ఆ వానల్లోన వరదొచ్చిందిరా
చేప ఎండేలోగ వానొచ్చిందిరా
ఆ వానల్లోన వరదొచ్చిందిరా

ధీరా…ధీరా…ధీరా…

మగువలు వలచిన మగధీరా
మనసులు దోచిన మగధీరా
జనమెగబడి మెచ్చిన ధీరా
జగమెరిగిన మగ మగధీరా… ధీరా ధీరా ధీరా ధీరా

గెట్ అన్ ది ఫీల్ నౌ ఇస్ మూవ్ ఇట్ అన్ ది స్వీట్
సే వి వాన్నా సే సంతింగ్
బెట్టర్ యు వాస్ వాట్ ద తింక్
నౌ రాక్ ఎవ్రీ వన్ వి వేర్ అన్ ది రన్
నౌ కీప్ ద ఫ్లోర్ మూవ్ మూవ్ ఎవ్రీ వన్
గెట్ ద గ్రోన్ నౌ డాన్స్ ఎవ్రి వన్
రాక్ సో నౌ కాచ్ ఎవ్రీ వన్ హె హ హ హ

హే చలపతి కాలి ధూలపాక పక్కన ఉన్న సందు ఎనక
ఇరగాపండిన తోటలోన నిగ నిగ మంటున్న
నిమ్మా పండూ…పండూ పండూ పండూ
అది మీసం మీద నిల బెట్టాలి రా
నిమ్మా పండూ మీసం మీద నిల బెట్టాలి రా
కొండలు పిండీ కొట్టేయ్యలిరా
అహా ధిక్కుల్నైనా దున్నేయ్యాలి రా
అహా కొండలు పిండీ కొట్టేయ్యలిరా
అహా ధిక్కుల్నైనా దున్నేయ్యాలి రా
ధీరా…ధీరా…ధీరా…

వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా  మగధీరా
వాన్నా ఎ రాక్ ఆన్  మూవ్ నా మగధీరా
వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా  మగధీరా
వాన్నా ఎ రాక్ ఆన్  మూవ్ నా మగధీరా

హే ఇరుగూ దిష్టీ పొరుగూ దిష్టి ఇంటా బయట తగిలిన దిష్టి
నీది దిష్టీ నానా దిష్టీ దిష్టీ… దిష్టి…
దెబ్బకు వదిలి దొబ్బేయ్యాలి రా
ఈ దెబ్బకు వదిలి దొబ్బేయ్యాలి రా
గుమ్మడికాయ కొట్టేయ్యాలిరా
మంగళహారతి పట్టేయ్యాలిరా
గుమ్మడికాయ కొట్టేయ్యాలిరా
మంగళహారతి పట్టేయ్యాలిరా
ధీరా…ధీరా..ధీరా…

వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా  మగధీరా
వాన్నా ఎ రాక్ ఆన్  మూవ్ నా మగధీరా
వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా  మగధీరా
వాన్నా ఎ రాక్ ఆన్  మూవ్ నా మగధీరా
వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా  మగధీరా
వాన్నా ఎ రాక్ ఆన్  మూవ్ నా మగధీరా
వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా  మగధీరా
వాన్నా ఎ రాక్ ఆన్  మూవ్ నా మగధీరా
ధీరా…ధీరా…ధీరా…

*********   *********   ********

చిత్రం: మగధీర (2009)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: దీపు ,  గీతామాధురి

బబ్బ బబ్బబ్బబాగుంది బబబ్బబ్బ బాగుంది
బబ్బ బబ్బబాగుంది ఇస్… బాగుంది

నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది

నాకోసం నువ్వు గోడ దూకేడం బాగుంది
నే కనపడక గోళ్ళు కొరికెయడం బాగుంది

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్

నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది

కే వీ ఆర్ పార్కులో జాగింగుకి వెళ్ళావంటూ
విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్
స్విస్ వీధుల మంచులో మాట్లాడుతు ఫ్రెంచ్ లో
బర్గర్ తింటున్నావంటు ఇంటిమేషన్
పాల కడలి అట్టడుగుళ్ళో పూల పరుపు మెత్తటి దిల్లో
పైన పడుకునుండుంటావని కాల్కులేషన్
ఘన గోపుర భవంతిలో జన జీవన స్రవంతిలో
నా వెనకే ఉంటూ దాగుడుమూతలు
ఆడడమనుకుంటా నీ ఇంటెన్షన్

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్

హే ఇందూ హా  ఓ ఓ సారీ సారీ
ఇడియట్… కాన్ట్ యు సీన్
ఎవరో ఒక వనితా మనిని నువ్వేమోననుకుని పిలిచి
కాదని తెలిసాకా వగచీ సర్లే అని విడిచీ
వెనకడుగేయొద్దుర కన్నా వెనకే ఉందేమో మైనా
ఎదురెదురై పోతారేమో ఇహలో ఎపుడైనా
అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ
దొరికీ దొరకని దొరసానీ దరికొచ్చేదెపుడంటున్నా
అంటున్నా అంటున్నా

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్

*********   *********   ********

చిత్రం: మగధీర (2009)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: రంజిత్ , శివాని

ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు(2)

అప్ అప్ హండ్స్ అప్ పాప హండ్స్ అప్ హా హా
బంగారు కోడిపెట్ట వచ్చెనండీ, హే పాప హే పాప హే పాప
బంగారు కోడిపెట్ట వచ్చెనండీ, హే పాప హే పాప హే పాప
చంగావి చీర గుట్టు చూసుకోండి  హే పాప హే పాప హే పాప
అప్ అప్ హండ్స్ అప్ జక్ జక్ నీ లక్
ధిక్ ధిక్ ఢోలక్కుతో
చేస్తా జిప్ జిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్
స్టెప్ స్టెప్ మ్యుజిక్కుతో

బంగారు కోడి బంగారు కోడి
బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాప హే పాప హే పాప
చంగావి చీర గుట్టు చూసుకోండి  హే పాప హే పాప హే పాప

స ప మ ప ద ప ప ద ప ప ద ప
స ప మ ప ద ప స ప మ ప ద ప
స ప మ ప ద ప హండ్స్ అప్ పాప
స ప మ ప ద ప ర ప ప ప ప పా

ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు
అంతంత ఉన్నాయెత్తులు బొలో బొలో
నీ కన్ను పడ్డాక ఓరయ్యొ
పొంగెస్తున్నాయి సొత్తులు చలో చలో
సిగ్గు లేని రైక టెక్కు చూస్తా డోలమాలు కోకపొంగులో
కావలిస్తే మళ్ళీ వస్తానయ్యో కొంగుపట్టీ కొల్లగొట్టకు
హే హే అప్ అప్ హండ్స్ అప్ జక్ జక్ నీ లక్
ధిక్ ధిక్ ఢోలక్కుతో
రైక జిప్ జిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్
స్టెప్ స్టెప్ మ్యుజిక్కుతో

ఎంటమ్మా ఎంటమ్మా అందులో
అందాల చిట్టి గంపల్లో బోలో బోలో
నా ఈడు నక్కింది బావయ్యొ
చెయ్యెసినాకా మత్తుల్లో చలో చలో
చేత చిక్కినావే గిన్నెకోడి
దాచుకున్న గుట్టు తియ్యనా తియ్యనా
కాక మీద ఉన్నదాన్నిరయ్యో దాకమీద కోపమెందుకు
హే హే అప్ అప్ హండ్స్ అప్ జక్ జక్ నీ లక్
ధిక్ ధిక్ ఢోలక్కుతో
ఒకే జిప్ జిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్
స్టెప్ స్టెప్ మ్యుజిక్కుతో

బంగారు కోడి బంగారు కోడి
బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాప హే పాప హే పాప
చంగావి చీర గుట్టు చూసుకోండి  హే పాప హే పాప హే పాప

error: Content is protected !!