చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ
దర్శకత్వం: రవికాంత్ నగాయిచ్
నిర్మాత: పి.మల్లికార్జున రావు
విడుదల తేది: 18.04.1969
పల్లవి:
ఓ..ఓ..విశాల గగనం లో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా…ఆ..
ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా…ఆ..
చరణం: 1
వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి
వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి
వొలికే.. మధువు ..కొసరే.. వధువూ రెండూ…నీవే…
ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా…ఆ..
చరణం: 2
చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే
నా చక్కదనం దొరలాగా ఏలుతావులే
చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే
నా చక్కదనం దొరలాగా ఏలుతావులే
తీరే.. తనివి.. మీరే.. అలవి.. ఏదో…గారడీ…
ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా…ఆ..
ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా…ఆ..