Mahakavi Kshetrayya (1976)

mahakavi kshetrayya 1976

చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: వి. రామకృష్ణ
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి, మంజుల
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు, సి.ఎస్.రావు
నిర్మాత: పి.ఆదినారాయణ రావు
విడుదల తేది: 1976

పల్లవి:
ఆ.. రేపల్లె లోని గోపాలుడంట.. ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ మజా మజా కన్నుల పంట 

ఆ రేపల్లె లోని గోపాలుడంట.. ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ మజా మజా కన్నుల పంట

చరణం: 1
సుందరి జాణ బిందెలతోటి నీలాల రేవు కొచ్చిందట 
సుందరి జాణ బిందెలతోటి నీలాల రేవు కొచ్చిందట

కళ్ళు కోలాటమాడ మెచ్చిందంట
క్రిష్ణయ్య రాగా అహ కేరింతలాడ.. క్రిష్ణయ్య రాగా కేరింతలాడ

పైట జారె బిందె జారె తెల్లబోయి పిల్లా జారె
పైట జారె బిందె జారె తెల్లబోయి పిల్లా జారె       

తలచుకుంటె ఆ వైనం నవ్వులపంట
ఆ రేపల్లె లోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట

చరణం: 2
చక్కని చుక్క సందేళ గుళ్ళో.. మొక్కులు మొక్కంగ వచ్చిందంట
చక్కని చుక్క సందేళ గుళ్ళో.. మొక్కులు మొక్కంగ వచ్చిందంట

అహ.. నిక్కుతు నీల్గుతు వచ్చిందంటా
నల్లనివాడు అల్లవరగా.. నల్లనివాడు అల్లవరగా
కళ్ళు కలిపే ఒళ్ళు మరిచే.. దూరాన మొగుడు కారాలు నూరె కళ్ళు
కళ్ళు కలిపే ఒళ్ళు మరిచే.. దూరాన మొగుడు కారాలు నూరె కళ్ళు

తలచుకుంటె ఆ రగడ రవ్వలమంట
ఆ రేపల్లె లోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట

చరణం: 3
అందాలభామ చిందులు వేయ అందలమెక్కి సాగిందంట
అందాలభామ చిందులు వేయ అందలమెక్కి సాగిందంట..
తన అందాలు కాస్త దాచిందంట

పిల్లనగ్రోవి మొల్లనవింటే.. హాయ్‌ పిల్లనగ్రోవి మొల్లనవింటే
మేనుపొంగి మేనా ఆపి.. తానేమొ క్రిష్ణయ్య సన్నిధి చేరె
మేనుపొంగి మేనా ఆపి.. తానేమొ క్రిష్ణయ్య సన్నిధి చేరె

తలచుకుంటె ఆ జోడి గువ్వలజంట
ఆ రేపల్లె లోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ కన్నుల పంట

*****  *****   ******

చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరథి
గానం: వి.రామకృష్ణ, సుశీల

పల్లవి:
జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. ఓయమ్మో
నాకెంత సిగ్గాయె బావా.. బావా.. నను వీడలేవా

పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. ఓయబ్బో
నీకింత సిగ్గేల బాలా.. రావా నను చేరరావా

చరణం: 1
ఆ .. ఆ.. ఆ .. ఆ..
ఆకాశమార్గాన అందాల మేఘాలు… పెనవేసుకున్నాయి చూడూ
చిగురాకు సరదాలు.. చిరుగాలి సరసాలు.. గిలిగింతలాయేను నేడూ

అందచందాలతో .. ప్రేమ బంధాలతో ..
జీవితం హాయిగా సాగనీ ..ఈ..ఈ..
బాలా…  రావా… నను చేరరావా..

చరణం: 2
ఆ .. ఆ .. ఆ ..
ఆ కొమ్మపై ఉన్న అందాల చిలకలు.. అనురాగ గీతాలు పాడేనూ…
సిరిమల్లె ఒడిలోన చిన్నారి తుమ్మెద.. మైమరచి కలలందు కరిగేనూ…

ముద్దు మురిపాలతో .. భావరాగాలతో ..
యవ్వనం పువ్వులా నవ్వనీ..ఈ..ఈ..
బావా… బావా.. నను వీడలేవా…

చరణం: 3
ఆ .. ఆ ..
బంగారు చెక్కిళ్ళ పొంగారు పరువాలు.. కొనగోటి మీటులే కోరేనూ
నీ లేత అధరాలు ఎంతెంతొ మధురాలు .. ఈ నాడు నా సొంతమాయేనూ

దేవి దీవించెను .. స్వామి వరమిచ్చెను ..
ఇద్దరం ఏకమౌదాములే ..ఏ..ఏ..
బాలా.. రావా ..నను చేరరావా

జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. ఓయబ్బో..
నాకెంత సిగ్గాయె బావా.. బావా ..నను వీడలేవా

పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. ఓయమ్మో..
నీకింత సిగ్గేల బాలా.. రావా.. నను చేరరావా

ఆ..అహా…హ…
ఆ..ఆ…ఆ..ఆహా…
ఆ..అహ…హ..
ఆ…ఆ..ఆ..ఆ..అహా…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top