Mahamantri Timmarusu (1962)

Mahamantri Timmarusu (1962)

చిత్రం:  మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం:  పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం:  పింగళి నాగేంద్రరావు
గానం:  యస్.వరలక్ష్మి
నటీనటులు: యన్.టి.రామారావు, శోభన్ బాబు, యస్.వరలక్ష్మి, దేవిక
దర్శకత్వం: కమలాకర్ కామేశ్వరరావు
నిర్మాత: అట్లూరి పుండరీ కాక్షయ్య
విడుదల తేది: 26.07.1962

పల్లవి:
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా…
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా

చరణం: 1
వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో
వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో
అలకయేమో యని దరి రాకుండిన జాలిగ చూచే వేణు…
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా

చరణం: 2
నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో
నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో
మైమరచిన చెలి మాటే లేదని….
ఆ ..ఆ..ఆ ..ఆ ..ఆ..ఆ..ఆ
మైమరచిన చెలి మాటే లేదని.. ఓరగ చూచే వేణు…

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియను గా…

*********  *********  *********

చిత్రం:  మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం:  పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం:  పింగళి నాగేంద్రరావు
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
మోహన రాగమహా మూర్తిమంతమాయె
మోహన రాగమహా మూర్తిమంతమాయె…
నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే
మోహన రాగమహా.. మూర్తిమంతమాయె..

చరణం: 1
చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ…ఆ…
చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా..
మోహన రాగమహా… మూర్తిమంతమాయె

చరణం: 2
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ…ఆ..
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా…
మోహన రాగమహా… మూర్తిమంతమాయె

*********  *********  *********

చిత్రం:  మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం:  పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం:  పింగళి నాగేంద్రరావు
గానం:  యస్.వరలక్ష్మి సుశీల

పల్లవి:
తిరుమల తిరుపతి వెంకటేశ్వర… కూరిమి వరముల కురియుమయ
ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర… కూరిమి వరముల కురియుమయ
చెలిమిని విరిసే అలమేల్మంగమ… చెలువములే ప్రియ సేవలయ
తిరుమల తిరుపతి వెంకటేశ్వర… కూరిమి వరముల కురియుమయ

చరణం: 1
నయగారాలను నవమల్లికలా… మమకారాలను మందారములా
నయగారాలను నవమల్లికలా… మమకారాలను మందారములా…
మంజుల వలపుల… మలయానిలముల…
మంజుల వలపుల మలయానిలముల.. వింజామరమున వీతుమయా…

తిరుమల తిరుపతి వెంకటేశ్వర… కూరిమి వరముల కురియుమయ

చరణం: 2
ఆశారాగమే ఆలాపనగా…
ఆ..హ…ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆశారాగమే ఆలాపనగా… సరసరీతుల స్వరమేళనలా…
నిసరినిదపదమగరిగరిస మగరిస మపమగరిస
గరిగపమగరిస…
మపనిసరి మగ మ రి గ సరినిసరి ని ద మ
మపద మ గ రి పమరి నినిప ససని నినిస
మగరిగ నిసరి నదమపనిస
నిసరి నిదమపదప
దపదమగరిగనిస…

ఆశారాగమే ఆలాపనగా… సరసరీతుల స్వరమేళనలా…
అభినయ నటనలే ఆరాధనగా…
అభినయ నటనలే ఆరాధనగా… ప్రభునలరించి తరింతుమయా….

తిరుమల తిరుపతి వెంకటేశ్వర… కూరిమి వరముల కురియుమయ
ఆ…ఆ…అ…అ…ఆ…ఆ…ఆ..
ఆ…ఆ..ఆ…ఆ…ఆ…
తిరుమల తిరుపతి వెంకటేశ్వర… ఆ…ఆ..ఆ..
తిరుమల తిరుపతి వెంకటేశ్వర…. కూరిమి వరముల కురియుమయ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top