Mahanati Savitri (Actress)

మహానటి కొమ్మారెడ్డి సావిత్రి
(జనవరి 11, 1937 – 1981 డిసెంబర్ 26)

తెలుగుతమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటి అనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడుతుంది. పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్యదర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మలో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసిఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది.

ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. 1968లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది . అయితే అది అంత విజయం సాధించలేదు. ఆ తరువాత చిరంజీవి,మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్నుపెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు – విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981డిసెంబర్ 26 న మరణించింది.

ఇతర విశేషాలు

అభిమానులు, ప్రచారసాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబర్ 6 గా జరుపుకుంటాయి. మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు “గ్యారీ సోబర్స్”కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, బి.సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.

అపజయాలు:

మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగానూ మానసికంగానూ బాధించాయి. తెలుగులో అమోఘ విజయం సాధించిన మూగమనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో భర్తతో నటించింది. ఆ చిత్రం అపజయాన్ని ఎదుర్కొనడంతో ఆమె ఆర్థికపతనానికి దారితీసింది. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ టీ నగర్ నుండి అణ్ణానగర్‌కు నివాసం మారిన తరువాత ఆమె అంతిమ అంకం ముగిసిపోయింది.

నటిగా:

సంసారం (1950)
అగ్నిపరీక్ష (1951)
పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి
పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి
పల్లెటూరు (1952)లో సుగుణ
ప్రతిజ్ఞ (1953)
దేవదాసు (1953)లో పార్వతి
బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు
మేనరికం (1954)
చంద్రహారం (1954)లో చంచల
బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా)
పరివర్తన (1954)లో సుందరమ్మ
వదిన (1955)
మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా)
మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి
అర్ధాంగి (1955)
సంతానం (1955)లో శారద
కన్యాశుల్కం (1955)లో మధురవాణి
దొంగరాముడు (1955)లో సీత
చరణదాసి (1956)లో లక్ష్మి
భలేరాముడు (1956)
అమరదీపం (1956)లో అరుణ
వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి
తోడికోడళ్ళు (1957)లో సుశీల
ఎమ్మెల్యే (శాసన సభ్యులు.) (1957)లో నిర్మల
భలే అమ్మాయిలు (1957)
మాయాబజార్ (1957)లో శశిరేఖ
మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ
కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల
మాంగల్యబలం (1958)
అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి
భాగ్యదేవత (1959)
నమ్మినబంటు (1959)
అభిమానం (1960)
విమల (1960)
శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి
శాంతినివాసం (1960)
దీపావళి (1960)
చివరకు మిగిలేది (1960)లో పద్మ
పాపపరిహారం (1961)
పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ
పాండవవనవాసం (1961)లో ద్రౌపది
కలసివుంటే కలదుసుఖం (1961)
సిరిసంపదలు (1962)
పవిత్రప్రేమ (1962)
మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా)
మంచిమనసులు (1962)
ఆరాధన (1962)లో అనూరాధ
గుండమ్మ కథ (1962)లో లక్ష్మి
రక్తసంబంధం (1962)
ఆత్మబంధువు (1962)
నర్తనశాల (1963)లో ద్రౌపది
కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి
ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా)
చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత
రక్తతిలకం (1964)లో కమల
మూగ మనసులు (1964)లో రాధ
కర్ణ (1964) లో భానుమతి
వెలుగునీడలు (1964)లో సుగుణ
పూజాఫలం (1964)లో సీత
నవరాత్రి (1964)
కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా)
గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా)
డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవిదేవత (1964)
సుమంగళి (1965)
తిరువిలయాదల్ (1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది.
నాదీ ఆడజన్మే (1965)
మనుషులు మమతలు (1965)
నవరాత్రి (1966)
భక్తపోతన (1966)లో సరస్వతీదేవి
ప్రాణమిత్రులు (1967)
వరకట్నం (1968)
తల్లితండ్రులు (1970)లో కౌసల్య
మరోప్రపంచం (1970)
అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య
జగన్మోహిని (1978)
అందరికంటే మొనగాడు (1985)
దేవదాసు మళ్లీ పుట్టాడు
పూజ
రామాయణంలో పిడకలవేట
పునాది రాళ్లు
గోరింటాకు (చివరి సినిమా)

నిర్మాతగా:
ఏక్ చిట్టీ ప్యార్ భరీ (1985) (హిందీ సినిమా)

దర్శకురాలిగా:
చిన్నారి పాపలు (1968)
కుళందై ఉళ్ళం (1969) … తమిళ చిత్రం
మాతృదేవత (1969)
చిరంజీవి (1969)
వింత సంసారం (1971)
ప్రాప్తం (1971) … తమిళ చిత్రం

ఇతరములు:

నవరాత్రి (1966) సినిమాలో నేపథ్య గాయని

సావిత్రి గారు నటించిన సినిమాలలోని పాటల లిరిక్స్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయగలరు

సావిత్రి గారి  గురించి మరిన్ని వివరాలకోసం వికీపీడియా లో చూడడానికి ఈ లింక్ ను క్లిక్ చేయగలరు

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Vijay IPS (2008)
error: Content is protected !!