చెలివో.. చెలిమివో… లిరిక్స్
చిత్రం: మహారాజు (1985)
నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలు
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాణం : ఎం. నరసింహారావు
విడుదల తేది: 20.06.1985
చెలివో.. చెలిమివో..
సతివో.. రతివో.. సమ్మతివో..
ఓహో… రమణీ.. సహధర్మచారినీ..
సహవాసినీ..
నీ.. నయనాంఛల చంఛల వీక్షణలో..
నీ.. నయగారన యాగర జల సంతోృక్షణలో..
నీ.. నిత్యనూత్న ధరహాస శిరశ్ఛంద్రికలో..
నీ.. కర కంకణ గలం గలలలో..
నీ.. పదనూపుర జనం జలలలో..
కన్నాను ఎన్నెన్ని రూపాలను
ఉన్నాను ఎన్నెన్ని నానాళ్ళనో..
నాధాలనో.. మేడాలనో..
ఓహో… రమణీ.. సహధర్మచారినీ..
సహవాసినీ..
నీ.. హృదయం శ్రమ తీర్చే ఆశ్రమమై
నీ.. వదనం ప్రతి ఉదయం నా సూర్యోదయమై
నా ఇహపరాలు కలబోయు కలావాహినివై
నే చవిచూసిన సుధా మాధురిలో..
ఏ కవి కానని ప్రణయ సాధనలో..
చూచాను ఎన్నెన్ని స్వర్గాలనో..
దోచాను ఎన్నెన్ని భోగాలనో..
భోగాలనో.. భాగ్యాలనో..
ఓహో… రమణీ.. సహధర్మచారినీ..
సహవాసినీ..
రాజువయ్యా.. మహారాజువయ్యా… లిరిక్స్
చిత్రం: మహారాజు (1985)
నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాణం : ఎం. నరసింహారావు
విడుదల తేది: 20.06.1985
కైలాస శిఖరాన కొలువైన స్వామీ..
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ..
మనసున్న మంచోల్లే మారాజులూ..
మమతన్టూ లేనోళ్ళే నిరుపేదలూ..
ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం
ఎవరేమీ అనుకుంటే నీకేమి లే..
రాజువయ్యా.. మహారాజువయ్యా…
రాజువయ్యా.. మహారాజువయ్యా…
కన్నీటా తడిసినా కాలాలు మారవు
మనసారా నవ్వుకో పసిపాపల్లే..
ప్రేమకన్నా నిధులు లేవు
నీ కన్న ఎవరయ్యా మారాజులూ..
నిన్నెవరూ ఏమన్నా నీ దాసూలూ..
జరిగినవి జరిగేవి కలలే అనుకో..
జరిగినవి జరిగేవి కలలే అనుకో..
రాజువయ్యా.. మహారాజువయ్యా…
రాజువయ్యా.. మహారాజువయ్యా…
త్యాగాల జీవితం తనవారికన్కితమ్
మిగిలింది నీ నేను నా నువ్వెలే..
దేవుడు వంటీ భర్త ఉంటే
నాకన్నా ఎవరయ్యా మారాణులు
మనకున్న బంధాలే మాగాణులు
ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
రాజువయ్యా.. మహారాజువయ్యా…
రాజువయ్యా.. మహారాజువయ్యా…
కైలాస శిఖరాన కొలువైన స్వామీ..
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ..
మనసున్న మంచోల్లే మారాజులూ..
మమతన్టూ లేనోళ్ళే నిరుపేదలూ..
ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం
ఎవరేమీ అనుకుంటే నీకేమి లే..
రాజువయ్యా.. మహారాజువయ్యా…
రాజువయ్యా.. మహారాజువయ్యా…