చిత్రం: మహారధి (2007)
సంగీతం: గురు కిరణ్ ( R R – మణిశర్మ)
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: విజయ్ యేసుదాసు
నటీనటులు: బాలకృష్ణ , స్నేహ, మీరా జాస్మిన్, జయప్రద
దర్శకత్వం: పి.వాసు
నిర్మాత: వాకాడ అప్పారావు
విడుదల తేది: 01.02.2007
వీచె గాలులలో వినబడు రాగమూ
కదిలె ఆకులలొ కలదొక తాళమూ
జగమె పాట కచేరీ మనసానంద విహారి
జగమె పాట కచేరీ మనసానంద విహారి
గల గల గల జల జల జల
సెలయేరులలొ వింటే సంగీతమే లేదా
టప టప టప చిట పట చిట
తొలి చినుకులలొ వానే స్వర ధారలె
మడి సొరగులలొ పని సమయము లొ
మాటే పాట గా జాన పదమాయెరా
పని లొ పాట కచేరి మనసానంద విహారి
గణ గణ గణ ఝుణ ఝుణ ఝుణ
గుడి గంటలొ లేద ఒంకారమై వేదం
ఢక ఢక ఢక దక దక దక మను
గుండెలలొ లేదా ఓ నాదమే
చిరు నగవులతో పసి పాపలకై
పాడే తల్లికీ సరిగమ తెలియునా
జోజో లాలి కచేరీ మనసానంద విహారీ