Maharshi (1988)

చిత్రం: మహర్షి (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: రాఘవ , నిశాంతి (శాంతి ప్రియ)
దర్శకత్వం: వంశీ
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 1988

తననాననాన తననాననాన

సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం
భానోదయాన చంద్రోదయాలు!!
సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

హ హా… ఆ ఆ హ హ హ హా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

వేణువ వీణియ ఏవిటి నాదము??
వేణువ వీణియ ఏవిటి నాదము??
అచంచలం సుఖం మధుర మధురం
మయం హృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు
ఈ వేళ నాలో రాగోల్లసాలు
కాదు మనసా… ఆ ఆ ప్రేమ మహిమా… నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు!!

సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
హా తార రతార రతారా తార రతార రతార
హా ఆ ఆ ఆ

రంగులే రంగులు అంబరాలంతట
రంగులే రంగులు అంబరాలంతట!!
సగం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆ వేగమేదీ నాలోన లేదు
ఆ వేగమేదీ నాలోన లేదు
ప్రేమమయమూ… ఆ ఆ ప్రేమమయమూ నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు!!

సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం
భానోదయాన చంద్రోదయాలు!!
సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

********   *********   *********

చిత్రం: మహర్షి
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగగుండె రాగమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది

చరణం: 1
ముత్యాల పాటల్లో కోయిలమ్మా
ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా
దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాల ప్రేమావేశం
ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం
నీకేలా ఇంత పంతం
నింగి నేలా కూడే వేళ నీకు నాకు దూరాలేలా
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది

మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది

చరణం: 2
చైత్రాన కూసేను కోయిలమ్మా
గ్రీష్మానికా పాట ఎందుకమ్మా
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా
నీరెండకా నవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణా నాదం
కోరింది ప్రణయ వేదం
వేసారు గుండెల్లో రేగే గాయం
పాడింది మధుర గేయం
ఆకాశాన తారా తీరం అంతే లేని ఎంతో దూరం
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
దూరమిది జత కూడనిది
చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది

మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది

********   *********   *********

చిత్రం: మహర్షి
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పల్లవి:
కోనలో సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తేరులో అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో శ్రీకారమై హో
కస్తూరి తాంబూలమీవే
కోరుకో సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ
పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి

చరణం: 1
మేని సోయగాలు ప్రేమ బంధనాలు
మౌన స్వాగతాలు రాగ రంజితాలు
సరసములో సమరములు సరసులకు సహజములు
ప్రాభావాలలోన నవ శోభనాలు జాణ
రాగదే రాగమై రాధవై

కోరుకో సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ
పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి
రాగాలనే హోయ్ బోయిలతో హోయ్ మేఘాల మేనల్లో రానా
కోనలో సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తేరులో అనురాగవల్లి రాగవల్లి

చరణం: 2
కోయిలమ్మ రాగం కొండవాగు వేగం
పారిజాత సారం ఏకమైన రూపం
అధరముపై అరుణిమలు మధురిమకై మధనములు
నందనాలలోన రసమందిరాలలోన
హాయిగా సాగగ చేరగా

కోనలో సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తేరులో అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో శ్రీకారమై హో
కస్తూరి తాంబూలమీవే
కోరుకో సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ
పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి

********   *********   *********

చిత్రం: మహర్షి
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం
శాశనం దాటడం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతి ఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా
సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా

నిశ్చయం నిశ్చలం నిర్బయం నా హయాం హా

చరణం: 1
కానిదేముంది నే కోరుకుంటే బూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యను
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను
ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట
నే మనసు పడితే ఏ కళలనైనా
ఈ చిటిక కొడుతూ నే పిలవనా

సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా

అదరనీ బెదరనీ ప్రవుత్తి ఒదగనీ మదగజమే మహర్షి

చరణం: 2
వేడితే లేడి ఒడి చేరుతుందా..వేట సాగాలి కాదా
ఓడితే జాలి చూపేన కాలం..కాలరాసేసి పోదా
అంతము సొంతము పంతమే వీడను
మందలో పందిలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోనూ..రేయి ఒళ్ళో దూరిపోను
నే మొదలుపెడితే ఏ సమరమైనా నా కెదురుపడునా ఏ అపజయం

సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం
శాశనం దాటడం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతి ఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా
సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Chikkadu Dorakadu (1988)
error: Content is protected !!