Majnu (2016)

చిత్రం: మజ్ను  (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: నరేష్ అయ్యర్
నటీనటులు: నాని, అనుఇమాన్యుయేల్
దర్శకత్వం: విరించివర్మ
నిర్మాతలు: గీత గొల్ల, పి.కిరణ్
విడుదల తేది: 23.09.2016

కల ఇదో నిజమిదో తెలియదే మరి ఎలా
జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా
పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా
నామాట వినదు మనసు ఏంటిలా
కుదురుగ కాసేపు ఉండనీదులే ఇలా
పదే పదే ఇదే నీ వల్లనే

జోరే పెంచావె గుండె లయలలోన నువ్వే ఇలా
దారే మార్చావే ఏదో మాయ చేసేలా
వాలు కనులలోనా దాచేసినావా ఆ నింగిలోన లేదు నీలం
హాయి లోయలోనా తోసేసినావా ఇదేలే నీ ఇంద్రజాలం
జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

నాపై వర్ణాల పూల జల్లులేవో కురిసేనులే
నేనే నీ నవ్వు తలచుకున్న వేళలో
చల్లగాలిలాగ నీ వూసులేవో మెల్లిగానె నన్ను గిల్లిపోయే
నీలి మబ్బులాగ నా ఆశలేవో పైపైన నింగిలోన తేలే