చిత్రం: మేజర్ చంద్రకాంత్ (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: యన్.టి.రామారావు, మోహన్ బాబు, రమ్యకృష్ణ , నగ్మా
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 24.04.1993
సుఖీభవ సుమంగళి సుఖీభవా…
సుశీలవై చిరాయువై సుఖీభవా…
ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేననీ
నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మనీ
సుఖీభవ సుమంగళి సుఖీభవా…
సుశీలవై చిరాయువై సుఖీభవా…
చరణం : 1
శతమానం భవతి అని నిన్ను దీవించి
గతకాలం స్మృతిలోనే బ్రతుకు సాగించి
ఆ కుంకుమరేకుల కెంపులు పూయగా
ఆ పూసిన పువ్వుల నోములు పండగా
కదలి రావమ్మా… ఆ… ఆ…
ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేననీ
నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మనీ
సుఖీభవ సుమంగళి సుఖీభవ సుశీలవై చిరాయువై సుఖీభవ
చరణం : 2
ఆనురాగం కోవెలలో ఆది దంపతులై
కనులారా మిము చూసే జన్మధన్యమై
ఒక జీవితకాలం చాలని ప్రేమలో
సుఖశాంతులు విరిసే చల్లని తల్లిగా
నిలిచిపోవమ్మా… ఆ… ఆ…
ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేననీ
నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మనీ
సుఖీభవ సుమంగళి సుఖీభవా…
సుశీలవై చిరాయువై సుఖీభవా…
********* ********* *********
చిత్రం: మేజర్ చంద్రకాంత్
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: గురుచరణ్
గానం: మనో, చిత్ర
నీక్కావలసింది నా దగ్గర ఉంది
నీక్కావలసింది నా దగ్గర ఉంది
అందుకో చిరు కానుకా చూసుకో చలి వేడుకా
ముందే తెలిసింది నీలో పస ఉంది
ముందే తెలిసింది నీలో పస ఉంది
అయ్యహో అభిసారిక అప్పుడే చలరేగకా
చరణం: 1
ఆకు పోక చూసుకో కొరికేది ఏనాడు చెప్పుకో
సోకు సున్నం రాసుకో సొగసంతా మడిచేసి ఇచ్చుకో
సరాసరిగా రమ్మంటు నిన్నే పిలవాలి తొలిసారి
అ ఆ నరనరాలా జుమ్మంటు నేనే తగలాలి ప్రతిసారి
ధీమ్ తరికిట ధీమ్ తరికిట దీని కాలి అందెలు
తాం తరికిట తాం తరికిట తాలమేయగా
పలకాలి నీపాట పరువాల నా తోట చం చం చం
నీక్కావలసింది నా దగ్గర ఉంది
ముందే తెలిసింది నీలో పస ఉంది
అయ్యహో అభిసారిక చూసుకో చలి వేడుకా
చరణం: 2
ఆటు పోటూ గుండెలో అదిరింది కుర్రదాని వెన్నులో
చాటు ఘాటు ముద్దులో మునిగాడు కుర్రాడు మత్తులో
ఎడాపెడాగా ఈ మంచు ఇట్టా కురిసేనా తెలిసేనా
అ ఆ తడి పొడిగా తెల్లార్లు నీతో తడిసేనా తరిమేనా
ఝం జమ్మని ఝం జమ్మని జాజి పూల పూజలో
ఘమ్ ఘుమ్మని ఘమ్ ఘుమ్మని మూడు రాత్రులు
నలగాలి నీ ఈడు నాతోడు ఈ వేళ ఝం ఝం ఝం
నీక్కావలసింది నా దగ్గర ఉంది
నీక్కావలసింది నా దగ్గర ఉంది
అందుకో చిరు కానుకా చూసుకో చలి వేడుకా
ముందే తెలిసింది నీలో పస ఉంది
ముందే తెలిసింది నీలో పస ఉంది
అయ్యహో అభిసారిక అప్పుడే చలరేగకా
******** ******* ********
చిత్రం: మేజర్ చంద్రకాంత్
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు
పల్లవి :
పుణ్యభూమి నాదేశం నమోనమామి
ధన్యభూమి నాదేశం సదాస్మరామి
పుణ్యభూమి నాదేశం నమోనమామి
ధన్యభూమి నాదేశం సదాస్మరామి
నన్ను కన్న నా దేశం నమోనమామి
అన్నపూర్ణ నాదేశం సదాస్మరామి
మహా మహుల కన్నతల్లి నాదేశం
మహోజ్వలితచరితగన్న భాగ్యోదయ దేశం నాదేశం
పుణ్యభూమి నాదేశం నమోనమామి
ధన్యభూమి నాదేశం సదాస్మరామి
చరణం: 1
అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు ఝలిపిస్తే
మానవతుల మాంగల్యం మంటగలుపుతుంటే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన
మహావీరుడు… సార్వభౌముడు…
అడుగో అరి భయంకరుడు కట్టబ్రహ్మన్న
అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన
అడుగో అరి భయంకరుడు కట్టబ్రహ్మన్న
అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన
ఒరేయ్ ఎందుకు కట్టాలిరా శిస్తు
నారుపోశావా నీరుపెట్టావా కోతకోశావా కుప్పనుర్చావా
ఒరేయ్ తెల్లకుక్కా… కష్టజీవుల ముష్టిమెతుకులు
తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా
అని పెళ పెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్యపోరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు
పుణ్యభూమి నాదేశం నమోనమామి
ధన్యభూమి నాదేశం సదాస్మరామి
నన్ను కన్న నా దేశం నమోనమామి
అన్నపూర్ణ నాదేశం సదాస్మరామి
చరణం: 2
అదిగదిగో… అదిగదిగో…
ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో
మన అగ్గిపిడుగు అల్లూరి అగ్గిపిడుగు అల్లూరి…
ఎవడురా నా భరతజాతిని కప్పమడిగిన తుచ్ఛుడు
ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగె కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా
బడుగుజీవులు భగ్గుమంటె ఉడకు నెత్తురు ఉప్పెనైతే
ఆ చండ్ర నిప్పుల గండ్రగొడ్డలి పన్ను గడతది చూడరా
అన్నా ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టిముట్టి
మందిమార్బలమెట్టి మరఫిరంగులెక్కుపెట్టి
వందగుళ్ళు ఒక్కసారి పేల్చితే
వందేమాతరం… వందేమాతరం…
వందేమాతరం… వందేమాతరం…
వందేమాతరం అన్నది ఆ ఆకాశం
అజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ
అఖండ భరతజాతి కన్న మరో శివాజీ
సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వాతంత్య్ర భారతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని
హిందు ఫౌజు జైహిందని నడిపాడు
గగన శిలలకెగసి కనుమరుగైపోయాడు
జోహార్ జోహార్… సుభాష్ చంద్రబోస్
జోహార్ జోహార్… సుభాష్ చంద్రబోస్
గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం
సాధించే సమరంలో అమరజ్యోతిలై వెలిగే
ధ్రువతారల కన్నది ఈ దేశం
చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం
పుణ్యభూమి నాదేశం నమోనమామి
ధన్యభూమి నాదేశం సదాస్మరామి
నన్ను కన్న నా దేశం నమోనమామి
అన్నపూర్ణ నాదేశం సదాస్మరామి
******** ******* ********
చిత్రం: మేజర్ చంద్రకాంత్ (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: గురుచరన్
గానం: యస్.పి.బాలు, చిత్ర
లప్పం తప్పం గాళ్ళకి పిప్పరమెంటు బిళ్ళకి
లగ్గం పెట్టి వెయ్యన జంకీ టోపి
డేరింగ్ హీరో జంటగా డైమండ్ రాణి ఉండగా
రూటే మార్చి వేసుకో డుంకి టోపి
కూర్చుంటే వేస్తా కుచ్చు టోపి
బజ్జుoటే వేస్తా బొచ్చు టోపి
అచ్చరే బచ్చా మెచ్చాలేరా ఇక కొట్టాల నీ గంట
ఘనంగా వినంగ రణంగా కనంగా
లప్పం తప్పం గాళ్ళకి పిప్పరమెంటు బిళ్ళకి
లగ్గం పెట్టి వెయ్యన జంకీ టోపి
చరణం: 1
ఎర్ర టోపి తగిలిస్తే బుర్ర చిర్రు మంటుంది
పచ్చ టోపి చూపిస్తే పంబరేగిపోతుంది
బ్రౌను టోపి విసిరేస్తే చేయిను ఊడిపోతుంది
టేపు చూసి కొలిచేస్తే టాపు లేచి పోతుంది
ఎదురుగ పడి ఎదిరిస్తే కలపడి కధ కట్టిస్తా
జతకుదిరితే భరతం పట్టి సాగలయ్యో
నీ నెంబర్ చెపుతావా కలిసుందాము కలకాలము
అచ్చరే బచ్చా మెచ్చాలేరా ఇక కొట్టాల నీ గంట
ఘనంగా వినంగ రణంగా కనంగా
లప్పం తప్పం గాళ్ళకి పిప్పరమెంటు బిళ్ళకి
లగ్గం పెట్టి వెయ్యన జంకీ టోపి
డేరింగ్ హీరో జంటగా డైమండ్ రాణి ఉండగా
రూటే మార్చి వేసుకో డుంకి టోపి
కొరస్ : టోపి దొంగ టోపి
చరణం: 2
తెల్ల టోపి తగిలిస్తే బిళ్ళ మోత మోగాలా
నల్ల టోపి చూపిస్తే నట్టు ఊడిపోవాలా
కిక్కు కొట్టి కీ ఇస్తే కీచురాయీ పాడాల
స్పాట్ చూసి కొట్టేస్తే ప్లేటు పగిలిపోవాలా
కస కస మని ఎదురొస్తే బుస బుస మని పొంగాలా
తడి పొడి గది తాళం వేసి ఆడించేస్తా
నీ డిగ్రీ ఏదో చెబుతావా పని చేద్దాము జాయింటుగా
మెచ్చానే పిల్లా ఇస్తా జల్లా
ఇక వేస్తాను చలి మంట
వనక్కు తొనక్కు బెనక్కు అనక్కు