Mallepuvvu (2008)

చిత్రం: మల్లెపువ్వు (2008)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  శ్రేయా ఘోషల్
నటీనటులు: భూమిక, మురళీకృష్ణ
దర్శకత్వం: వి. సముద్ర
నిర్మాత: మోహన్ వడ్ల పట్ల
విడుదల తేది: 19.09.2008

చందమామ రావే నువ్వు మౌన సాక్షి గా
చెంత నుండి పోవే మాకు ప్రేమ రక్ష గా
వెతలుగా మా యవ్వనం చెయ్యి జారు లోపు నీవె
బతుకులో తీయాందానం చవి చూపి వెంట రావే
ఒహో
జీవితం ఒక అధ్భుతం అది అందితేనె అమృతం
శాశ్వతం ఈ అనుభవం
ఇది రాయలేని చరితం

చరణం: 1
కాలమే నిలదీసినా నీ ప్రాణమై బతికాను
దైవమే దాటెసిన నీ ధ్యానమై నిలిచాను
కరగనీ కలాలతో
కదలనా కనులలో
ఇక నీది నాది ఈ లోకం
దరి చేర రాదు శోకం
క్షణమైనా చాలులే ధాన్యం
ఇది జన్మ జన్మ భాగ్యం
శిధి లాలే నదులల్లే కదలాదే వెళా

చరణం: 2
లోకమే చేసీందిలె ఒక మాయానీ పెను గాయం
గాయమే కోసిందిలె అది హాయనే మన భావం
నిన్నటీ స్మృతులతో నడవానా నీడ గా
నిట్టూర్పు నీడలో నీకే ఓదార్పు నేను కానా
నీ గుండె గొడుకింతైనా మైమరపు ఇవ్వలెనా
ఈ రాత్రే శుభ రాత్రే మది మీటె రాత్రీ

********  ********  *******

చిత్రం: మల్లెపువ్వు (2008)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  భావతరని

సువ్వి సువ్వి సువ్వాలా పువ్వు నాలా నవ్వాలా
సువ్వి సువ్వి సువ్వాలా పువ్వు నాలా నవ్వాలా
పైరు లెంతై రావాలా పులకరిన్థై పోవలా
పువ్వుల్లాలా కువ్వల్లల్లా గువ్వాల్లాలా

ఆకాసమే తొంగి చూస్థొన్దిలా
నా పైట గా తానే మారాలనా
సువ్వి సువ్వి సువ్వాలా పువ్వు నాలా నవ్వాలా

చరణం: 1
కోయిలమ్మ ఎందుకమ్మ
కొత్తగుందీ వైనం
నా గొంతు చూసి గంతు లేసీ నేర్చినావా గానం
నెమలి గువ్వ ఏమిటమ్మ ముందు లేదే లాస్యం
నా నడక లోని హోయలు చూసి మార్చినావా నాట్యం
దూకే వాగు వంక
రాదా కన్నె వంక
ఒంపు సొంపు చూసి
కాదా చంద్ర వంక
న వయసన్థె సొగసంతే మల్లె పూల వాసంతం

********  ********  *******

చిత్రం: మల్లెపువ్వు (2008)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: టిప్పు

హీరో నేనొచ్చానే  మీకే టీ ఇస్తానే
హీరో నేనొచ్చానే మీకోసం మీకోసం
టీలెన్నో తెచ్చానే మీకోసం మీకోసం
కలిపేసే లెమన్ టీ వేడి వేడి గా లమ్సా టీ
అందించే ఇంకోటీ ఆర ఆరగా అంధ్రా టీ
ఇది పడితే కదిలే రధమే మనిషీ
తీస్కోర నా టీ ఇది అన్నింట మేటీ
లేదింక పోటీ ఆపైన భేటీ

లక్ష గాడు తాగే టీ బిక్ష గాడు మెచ్చే టీ
లక్షణం గ తాగేస్తే రక్ష నీకు ఇచ్చే టీ
అచ్చమైన అస్సాం టీ వెచ్చనైన నైజాం టీ
ఒక్క కప్పు నాకిస్తే నీ మత్తు దులుపు చక్రా టీ
కుర్ర వాళ్ళు తాగే టీ పెద్ద వాళ్ళ టీపార్టీ
ఆడవాళ్ళు పెట్టే టీ ఆడ ఈడ దొరికే టీ
సరిగ రీస ససరిసాగ దదసపాగ పపదపాగ
తధీం తకిట తధీం తకిట
తధీం తకిట తకిట తకిట థాం

అత్త మామ అడిగే టీ భర్త మార్కు భార్యా టీ
అతిధి దేవుడొస్తుంటే అర్జంటు గా పెట్టే టీ
పల్లె లోనా పారే టి పట్టణాన ఛాయే టీ
ఒక్కరైతె సింగిల్ టీ ఎక్కువైతె ఒన్ బై టీ
ఎక్కడైన దొరికేటీ ఏరువాకలయ్యే టీ
ఎంత లోడు ఉంటే ఎంటీ ఉత్సాహం గ్యారెంటీ
సరిగ రీస ససరిసాగ దదసపాగ పపదపాగ
తధీం తకిట తధీం తకిట
తధీం తకిట తకిట తకిట థాం

********  ********  *******

చిత్రం: మల్లెపువ్వు (2008)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  భావతరని

చిరుగాలీ చిరుగాలి చెలియ జాడ చూపాలీ
నాకు నీవు తోడు కావాలీ
చిరుగాలీ చిరుగాలి చెలియ జాడ చూపాలీ
నాకు నీవు తోడు కావాలీ
ఒక సారి దరి చేరి ఊసు తెలుప రావా
కడదాకా చెలితోనే చేయి కలపవా నా తోడై

కంటి పాప జంట చూపు చుక్క నీవు కావా
ఎండ మావి వెంట పడ్డ బాటసారి కానా
గూడు లేని గువ్వ పిట్ట నీడలేని దోవా
గోరువంక సాగరాన ఈదుతున్న నావ
చెప్పలేను ఈ బాధా ఎక్కడుందో నా రాధా
వేణువుండి నా చేతా వేదనాయె నా రాతా
ఎంత తీపి ప్రేమ రాలు పూల ఓలే
అంతులేని శోకం మనసా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Ami Thumi (2017)
error: Content is protected !!