చిత్రం: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (2015)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సాహితి
గానం: కార్తీక్, చిన్మయి
నటీనటులు: శర్వానంద్, నిత్యామీనన్
దర్శకత్వం: క్రాంతి మాధవ్
నిర్మాతలు: కె.ఎ.వల్లభ
విడుదల తేది: 06.02.2015
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై మెరిసెలే
మబ్బుల్లోనే జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే
గుండెలు ప్రాణంగా నీవే నిండంగా
మండే ఎండల్లో వీచే చలి చలి
ప్రేమ రాగాల ప్రళయ కలహాలు నాకు నీవే నీవే
వేవేళ ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను
పూచేటి పూలన్ని నీ హొయలే
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై మెరిసెలే
మబ్బుల్లోనే జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే
నీకోసమే ఎదనే గుడిలా ఇలా మాలిచే నా మనసే
నీ కానుకై నిలిచే తనువే…
నవరసమే నీవంట పరవశమై జన్మంత
పరిచయమే పండాలంటా ప్రేమ ఇంకా ఇంకా
మరి మరి నీ కవ్వింత విరియగ నా ఒళ్ళంతా
కలిగెనులే ఓ పులకింతా ఎంతో వింత
నువ్వూగిన జగమున నిలుతునా ప్రియతమా
వేవేళ ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను
పూచేటి పూలన్ని నీ హొయలే
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై మెరిసెలే
మబ్బుల్లోనే జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే
గుండెలు ప్రాణంగా నీవే నిండంగా
మండే ఎండల్లో వీచే చలి ప్రేమ
రాగాల ప్రళయ కలహాలు నాకు నీవే నీవే
వేవేళ ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను
పూచేటి పూలన్ని నీ హొయలే
********* ********* *********
చిత్రం: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (2015)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ప్రియ హమేష్
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ఉసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా
కొనసాగలేని దారిలో శిలై వెళుతున్నా
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ఎడారి వేడి వేసవే నిట్టూర్పుగా
తడారిపోని తలపులే ఓదార్పుగా
నిషిలో నిషినై నిలిచా కాలమే జవాబుగా
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ఉసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా
కొనసాగలేని దారిలో శిలై వెళుతున్నా
sathyam nelone prema nithyam song lyrics