చిత్రం: మళ్లీ పెళ్లి (1970)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల, ఎస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ , కృష్ణంరాజు, విజయనిర్మల, హేమలత
దర్శకత్వం: సి.ఎస్.రావు
నిర్మాత: టి.సూర్యనారాయణ
విడుదల తేది: 14.02.1970
ఆగమంటే ఆగలేను
జగుచేస్తే ఊరుకోను
అడిగింది ఇవ్వకుంటే
అరగడియ ఓపలేను
ముట్టుకుంటే కందిపోతా
పట్టబోతే పారిపోతా
పందిట్లో తాళి కడితే
తొందర్లో సొంతమౌతా
నాకోసము పూసిన పువ్వా
పొద మాటున దాచకు నువ్వు
పూచిన పుష్పాలు తోటకు అందాలు
పొరబడి తుంచకు నువ్వు
నీ ఘుమ ఘుమలు నా తహతహలు
ఇంక కువ కువలు కావాలి నేడు
నీ ఆశలు నాకూ ఉన్నా
నను సిగ్గుల సంకెళ్లు కలవు
సంకెళ్లు తెంచాలి ఉవ్విళ్లు పెంచాలి
కౌగిళ్ల కరగాలి మనము
ఈ సిగ్గులనే విరిమొగ్గలను
నీకు కానుక యిస్తాను రేపు