చిత్రం: మళ్ళీ రావా (2017)
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: శ్రావణ్ భరద్వాజ్
నటీనటులు: సుమంత్ , ఆకాంక్ష సింగ్
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
విడుదల తేది: 08.12.2017
ఏ కాలం ఏ దూరం దాచి ఉంచెయ్నా నిన్నే నిన్నే
ఏ గాయం ఏ మౌనం మార్చే ఆపేయన నన్నే నన్నే
మళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికీ
మళ్ళీ రావా నువు లేవన్నవి రావా చంతే వదిలి చింతే
తరిమేస్తున్నా వదిలేస్తున్నా
ఏ కోపాలలో కాల్చినా కూల్చినా
ఈ బంధాలలో ఏ మందున్నదో
ఈ ప్రేమే ఇలా ఓ ఎగసి ఎగసేనా
మళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికీ
మళ్ళీ రావా నువు లేవన్నవి రావా చంతే వదిలి చింతే
****** ****** ******
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కార్తీక్
చినుకు చినుకు రాలగా
తెగిన తార తీరుగా
నడిచి వచ్చె నేరుగా
తళుకు తళుకు దేవతా
కాలం కదిలే…
వేగం వదిలే…
నేలంత వణికే…
కాలి కిందగా !!!
రెప్పలే రెక్కలై
కన్నులే తేలెనే….!
గుండెకే చక్కిలిగింతలా
తోచేనే… హేహే
మీసమైన రాని పెదవి
మోయనంత సంతోషం
క్షణముకొక్క కొత్త జన్మ
ఎత్తుతున్న సందేహం…
మాటలసలే బయటపడని
మధురమైన ఓ భావం
వేల వేల కవితలైన
చాలనంత ఉల్లాసం….!
కోటిరంగులే ఒక్కసారిగా
నిన్నలన్ని ముంచుతున్న వెల్లువా
చల్లగాలులే ఉక్కపోతలా
ఉందిలే చూస్తే నువ్వలా
ఎంత చెప్పినా తక్కువేనుగా
చిన్ని గుండె తట్టుతున్న తూఫానిదే
చుట్టుపక్కలా ఎవ్వరొద్దనే
కొత్త కొత్త ఆశ రేపే
తొలిప్రేమిదే