• About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
Home Movie Albums

Malliswari (2004)

A A
17
Share on FacebookShare on TwitterShare on WhatsappShare on Pinterest

MoreLyrics

Life Ante Itta Vundaala Song

Woo Aa Aha Aha Song Lyrics

Ooo Narappa Song Lyrics

Malleswari

చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
నటీనటులు: వెంకటేష్ , కత్రినా కైఫ్, పృద్విరాజ్,ఆశాషైని
కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విజయభాస్కర్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్
మర్పణ: డి. రామానాయుడు
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 18.02.2004

చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కుమార్ సాను, సునీత

నీ నవ్వులే వెన్నెలని మల్లెల నీ హరివిల్లులని
ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవీ చాలవని

నీ నవ్వులే వెన్నెలని మల్లెల నీ హరివిల్లులని
ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవీ చాలవని

బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి
మందారం మురిసిపొదా నీ సిగలో పూసి
వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాలబొమ్మనిచేసి
అణువణువు వెండి వెన్నెల పుసీ విరితేనేతోనె ప్రాణంపోసి
ఆ బ్రహ్మ నిన్ను మళ్లి మళ్ళి చూసీ తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి

ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవీ చాలవని

పగలంతా వెంటపడినా చూడవు నా వైపు
రాత్రంతా కొంటే కలవై వదలవు కాసేపూ
ప్రతిచోట నువ్వే ఎదురొస్తావు ఎటు వెళ్ళలేని వల వేస్తావు
చిరునవ్వుతోనే ఉరివేస్తావు నన్నెందుకింత ఊరిస్తావు
ఒప్పుకోవే నువ్వు చేసిందంతా చేసి తప్పు నాదంటావా నానా నిందలేసి

నీ నవ్వులే వెన్నెలని మల్లెల నీ హరివిల్లులని
ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవీ చాలవని

*********   *********   *********

చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల

నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ
అందుకే నీ కథకీ అంతులేదెప్పటికీ
తీరాలు లేవే ప్రేమా నీ దారికీ

చరణం: 1
కలతలే కోవెలై కొలువయే విలయమా
వలపులో నరకమే వరమనే విరహమా
తాపమే దీపమా వేదనే వేదమా
శాపమే దీవెనా నీకిదే న్యాయమా
కన్నీరాభిషేకమా నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా ప్రణయమా
నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో

చరణం: 2
రెప్పలే దాటదే ఎప్పుడూ ఏ కల
నింగినే తాకదే కడలిలో ఏ అల
నేలపై నిలవదే మెరుపులో మిలమిల
కాంతిలా కనబడే భ్రాంతి ఈ వెన్నెల
అరణ్యాల మార్గమా అసత్యాల గమ్యమా
నీతో పయనమే పాపమా ప్రణయమా
నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ
అందుకే నీ కథకీ అంతులేదెప్పటికీ
తీరాలు లేవే ప్రేమా నీ దారికీ

*********   *********   *********

చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర

జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం భలే వేడుక
ముందరున్నది ముద్దుల పండుగ తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక నాయకా ఒడే వేదిక
ఓమై డార్లింగ్ మొనాలిసా ఎక్కిందె ఏదో నిషా
మెచ్చేసానోయ్ మనోహరా నచ్చింది నీ తొందర

జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం భలే వేడుక

మొదటి చూపుతో మురిపించి మెల్ల మెల్లగా తెర దించి మాయమవ్వకే నను కవ్వించీ ఓ
మెత్త మెత్తగా ముద్దిచ్చి మత్తు మత్తుగా నను గిచ్చి మంట రెపకోయ్ మైమరపించీ
హఠాత్తుగా వరాలవాన వర్షించెనె ఎడారిలోన
శృతించనా సుఖాలవీణా ఓ ప్రియతమా
నన్నడగాలా నరోత్తమా నా సొగసు నీదే సుమా

ముందరున్నది ముద్దుల పండుగ తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక నాయకా ఒడే వేదిక

ఎంత వింతదీ గిలిగింత అణువు అణువునా పులకింత
తనివి తీర్చవా ఎంతో కొంత
తేనె పెదవిలో తొణికింత తీగ నడుములో ఒణికింత
తడిమి చూడనా నీ తనువంతా
అదేకదా వివాహ బంధం అనుక్షణం అదో సుగంధం
అందించనా ప్రియా యుగాంతం ప్రేమామృతం
ఓ మై డార్లింగ్ మొనాలిసా అయ్యానే నీ బానిస

జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం భలే వేడుక
ముందరున్నది ముద్దుల పండుగ తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక నాయకా ఒడే వేదిక

జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం భలే వేడుక

*********   *********   *********

చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: చిత్ర , శంకర్ మహాదేవన్

చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
నీ వల్లే కదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు

కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు

అన్నానంటే అన్నానంటావ్ అంతేగాని ఆలోచించవ్
నేనే కాదా నీకుండే దిక్కు
నాకోసం నువు పుట్టానంటావ్ నేనంటే పడి చస్తానంటావ్
నీకేంటంత నాపై ఈ హక్కు
ఇమ్మంటే ప్రాణం ఇస్తా  నమ్మవెందుకు
పొమ్మంటూ దురం చేస్తావెందుకూ
చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు నన్నిట్లా నానాహింసపెట్టి చంపకు

చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు

దగ్గరకొస్తే భగ్గంటున్నవ్ పక్కకుపోతే భయపడుతున్నవ్
ఇట్టాగైతే ఎట్టాగేమరి
ఆవైపంటే ఈ వైపంటావ్ నే లెప్ట్ అంటే నువు రైట్ అంటావ్
నీతో అన్నీ పేచీలేమరి
ఆ పాదం కందెలాగా పరుగులెందుకే
నీ భారం నాకే ఇవ్వకా
మాటల్తో మంత్రం వేస్తూ తియ్యగా
మైకంలో ముంచేస్తావు మెల్లమెల్లగా

చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
నీ వల్లే కదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు

*********   *********   *********

చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర , శంకర్ మహాదేవన్

గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల ఒళ్ళు నన్ను మాయజేయకే నెరజాణ
అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే  కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా
తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా
మరీ బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా
అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి
మతి చెదరద ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే  కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా

అగ్గిలాంటి నీ అందాలు రగిలించగానే ఈ చన్నీళ్ళు
ఆవిరావిరై పోతాయే సౌందర్యమా
సిగ్గుదాటి నీ ఆత్రాలు సొగసల్లుతుంటే సుకుమారాలు
అల్లరల్లరైపోతాయే శృంగారమా
నిందించి తప్పించుకోకమ్మా కనువిందిచ్చి కవ్వించుకోకమ్మా
నువ్వంత తెగించి రాకమ్మా పోమ్మా
అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి
మతి చెదరద ఎదురుగ కనబడితె మల్లీశ్వరీ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే  కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా

కాగడాలు అనిపించేలా నీ ఆగడాలు వెలిగించాలా
ఎక్కడెక్కడేం వున్నయో గాలించగా
స్వాగతాలు వినిపించేలా నీ సోయగాలు శృతిమించాలా
హెచ్చుతగ్గు లెన్నున్నయో వివరించగా
చురుక్కు చురుక్కు మనేలా నను కొరుక్కు కొరుక్కు తినాలా
వయస్సు సమస్య తీరెలా రామ్మా ఆహా
అతి చిలిపిగ మదనుడు వదులిన శరమీ సొగసరి
మతి చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే  కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా
తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా
మరీ బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా
అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి ఆహా
మతి చెదరద ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ

*********   *********   *********

చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

నా పేరు వరప్రసాద్
నాకబద్దం చెప్పటం రాదు
నేనోఅమ్మాయికి మనసిచ్చాను
తనకోసమే ఇక్కడికొచ్చాను
తను కాదంటే చచ్చిపోతాను

నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా
తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా
నేనంత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా
నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే
నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే

నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా
తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా
నేనంత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా
నీ కంటికి నేనొక చిన్న నలుసా

ఔను అంటె నిను చూసుకోనా మహరాణి తీరుగా
కాదు అంటె వదిలేసి పోను అది అంత తేలికా హో
లేనిపోని నఖరాలు చేస్తే మరియాద కాదుగా
ఇంతమంచి అవకాశమేది ప్రతిసారి రాదుగా
తగని వాడినా చెలీ తగవు దేనికే మరీ
మనకు ఎందుకే ఇలా అల్లరీ హా

నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా
తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా
నేనంత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా
నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే
నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే

కన్నెగానె ఉంటావా చెప్పు ఏ జంట చేరక
నన్ను మించి ఘనుడైనవాణ్ణి చూపించలేవుగా
హో మీసమున్న మగవాణ్ణి గనక అడిగాను సూటిగా
సిగ్గు అడ్డు పడుతుంటె చిన్న సైగైన చాలుగా
మనకి రాసి ఉన్నది తెలుసుకోవె అన్నది
బదులు కోరుతున్నది నామది

నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా
తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా
నేనంత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా
నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే
నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే

Tags: 2004Asha SainiD.Suresh BabuK. Vijaya BhaskarKatrina KaifKotiMalliswariPrithviraj BablooTrivikram Srinivas (As a Writer)Venkatesh
Previous Lyric

Swarnakamalam (1998)

Next Lyric

Kalisundam Raa (2000)

Next Lyric

Kalisundam Raa (2000)

Comments 17

  1. Bandarudhanum says:
    2 years ago

    super

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Fan Page👍

A To Z Telugu Lyrics is a website which provides all telugu songs lyrics as like as movie songs, private album songs, devotional, folk songs lyrics etc,.

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
No Result
View All Result
  • Movie Albums
  • Devotional
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In