చిత్రం: మానవుడు దానవుడు (1972)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు
నటీనటులు: శోభన్ బాబు, శారద , కృష్ణకుమారి
దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి
నిర్మాత: పి.చిన్నప రెడ్డి
విడుదల తేది: 1972
అణువు అణువున వెలసిన దేవా
గనువేలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా
మనిషిని మనిషె కరిచేవేళ
ద్వేషము విషమయి కురిసేవేళ
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిల్చి
అమరజీవులై వెలిగిన మూర్తులు
అమ్రుతం గుణం మాకందించరావా
జాతికి గ్రుహణల పట్టిన వేల
మాత్రు భూమి మురు పెట్టిన వేల
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మాకందించరావా
వ్యధులు బాధలు ముసిరేవేళ
మ్రుత్యువు కోరలు చాచేవేల
గుండెకు బందులుగా గుండెను పోదిగి
కొన ఊపిరులకు వూపిరిలూది
జీవన దాతవై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించరావా
****** ******* *******
చిత్రం: మానవుడు-దానవుడు (1972)
సంగీతం: అశ్వద్దామ
సాహిత్యం: ఉషశ్రీ
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి, మాదవపెద్ది సత్యం
పల్లవి:
కొప్పు చూడు కొప్పందం చూడు
కొప్పున వున్న పూలను చూడు
కొప్పు చూడు కొప్పందం చూడు
కొప్పున వున్న పూలను చూడు
మగడా నే మునుపటి వలెనే లేనా?
అహా! అలాగా!
కొప్పులో పూలెక్కడివే?..
నీ కొప్పులో పూలెక్కడివే?
అవా?
కట్టెల కోసమెళితే.. నే కట్టెల కోసమెళితే
కొమ్మ తగిలి కొప్పు నిండింది మావా
కొమ్మతగిలి కొప్పు నిండింది మావా
చరణం: 1
ముక్కు చూడు ముక్కందం చూడు.. ముక్కున వున్న ముక్కెర చూడు
ముక్కు చూడు ముక్కందం చూడు.. ముక్కున వున్న ముక్కెర చూడు
మగడా.. నే మునుపటివలెనే లేనా?
మగడా.. నే మునుపటివలెనే లేనా?
ఆ!ఆహా!
బుగ్గమీద గాటెక్కడిదే?.. నీ బుగ్గమీద గాటెక్కదిదే?
కోమటింటికెళితే నే బెల్లం తూయమంటే..
కోమటింటికెళితే నే బెల్లం తూయమంటే
తక్కెట్లో రాయొచ్చి తగిలింది మావా..
తక్కెట్లో రాయొచ్చి తగిలింది మావా
చరణం: 2
నడుము చూడు నడుమందం చూడు.. నడుమునవున్న బిగువును చూడు
నడుము చూడు నడుమందం చూడు.. నడుమునవున్న బిగువును చూడు
మగడా.. నే మునుపటివలెనే లేనా?
మగడా.. నే మునుపటివలెనే లేనా?
ఆ.. అది సరే..
గంపకింద వాడెవడే?
ఈ గంపకింద వాడెవడే?
ఆహా! వాడా
పక్కింటి పోరగాడు.. పెట్టాను పట్టబోయి
కోడిపెట్టాను పట్టబోయి
గంపకింద నక్కి నక్కి కూకున్నాడు మావా
గంపకింద నక్కి నక్కి కూకున్నాడు మావా
****** ******* *******
చిత్రం: మానవుడు-దానవుడు (1972)
సంగీతం: అశ్వద్దామ
సాహిత్యం: సినారె
గానం: సుశీల
పల్లవి:
పచ్చని మన కాపురం
పాలవెలుగై.. మణిదీపాలవెలుగై…
కలకాలం నిలవాలీ… కళకళలాడాలీ.. ఈ…
పచ్చని మన కాపురం…
చరణం: 1
నీ గుండెల సవ్వడిలోన.. నా గుండెల గుసగుసలుంటే
నీ కంటిపాపలలోనా.. నా కలల రూపాలుంటే..
మన బ్రతుకే అనురాగానికి.. ప్రతిరూపమౌనులే
మన బ్రతుకే అనురాగానికి….
ప్రతిరూపమౌనులే.. ప్రతిరూపమౌనులే…
పచ్చని మన కాపురం…
పాలవెలుగై.. మణిదీపాలవెలుగై…
కలకాలం నిలవాలీ… కళకళలాడాలీ.. ఈ…
పచ్చని మన కాపురం…
చరణం: 2
నీవు లేని క్షణమైనా.. నా కనులకు ఒకయుగమై
మన ఇరువురి కలయికలో.. ఇరుమేనులు చెరిసగమై
ప్రాణంలో ప్రాణంగా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
పరవశించిపోవాలి.. పరవశించిపోవాలీ….
పచ్చని మన కాపురం..
పాలవెలుగై.. మణిదీపాలవెలుగై…
కలకాలం నిలవాలీ… కళకళలాడాలీ.. ఈ…
పచ్చని మన కాపురం.. .
****** ******* *******
చిత్రం: మానవుడు-దానవుడు (1972)
సంగీతం: అశ్వద్దామ
సాహిత్యం: సినారె
గానం: సుశీల
పల్లవి:
అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే
ఆకలి ఆ లోకంలో.. లేనే లేదులే.. లేనే లేదులే
అమ్మలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే
చరణం: 1
మమతలే.. తేనెలుగా
ప్రేమలే.. వెన్నెలగా
చెలిమి .. కలిమి .. కరుణా..
కలబోసిన లోకమది.. కలబోసిన లోకమది
అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే
చరణం: 2
పిడికెడు మెతుకులకై.. దౌర్జన్యం దోపిడీలు
కలతలూ.. కన్నీళ్ళూ..
కనరాని లోకమది.. కనరాని లోకమది
అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే
చరణం: 3
ఆకలితో నిదురపో.. నిదురలో కలలు కను
కలలో ఆ లోకాన్ని… కడుపునిండ నింపుకో
కలలో ఆ లోకాన్ని…
కడుపునిండ నింపుకో.. కడుపునిండ నింపుకో
అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే
ఆకలి ఆ లోకంలో లేనే లేదులే… లేనే లేదులే
అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే