చిత్రం: మంచి మనసులు
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
నటీనటులు: రజని, భాను చందర్
దర్శకత్వం: ఎ.మోహన గాంధీ
నిర్మాత: శ్రీనివాసన్
విడుదల తేది: 1986
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
నిను కానలేక మనసూరుకోక
పాడాను నేను పాటనై…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా…
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా…
ఈ పువ్వులనే నీ నవ్వులుగా…
ఈ చుక్కలనే నీ కన్నులుగా…
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా…
ఊహల్లో తేలి ఉర్రూతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా… దేవి
నీ పేరొక జపమైనది… నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది… ఎన్నళ్ళయినా
నీ పేరొక జపమైనది… నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది… ఎన్నళ్ళయినా
ఉండీ లేకా ఉన్నది నీవే…
ఉన్నా కూడా లేనిది నేనే…
నా రేపటి అడియాశల రూపం నీవే…
దూరాన ఉన్నా నా తోడు నీవే…
నీ దగ్గరున్నా నా నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే…
******** ******** *********
చిత్రం: మంచి మనసులు
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. జానకి
నటీనటులు: రజని, భాను చందర్
దర్శకత్వం: ఎ.మోహన గాంధీ
నిర్మాత: శ్రీనివాసన్
విడుదల తేది: 1986
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
రామయ్య ఎదలో రాగాలమాలై… పాడాలి నేను పాటనై…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా…
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా…
నీ ఊసులనే నా ఆశలుగా… నా ఊహలనే నీ బాసలుగా…
అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా…
నే కన్న కలలు నీ కళ్ళతోనే…
నాకున్న తావు నీ గుండెలోనె…
కాదన్ననాడు నేనే లేను…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
రామయ్య ఎదలో రాగాలమాలై… పాడాలి నేను పాటైనె…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో…
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో…
ఈ వెల్లువలో ఏమౌతానో… ఈ వేగంలో ఎటుపోతానో…
ఈ నావకు నీ చేరువ తావున్నదో…
తెరచాప నువ్వై నడిపించుతావో…
దరిచేర్చి నన్ను ఒడి చేర్చుతావో…
నట్టేటముంచి నవ్వేస్తావో…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటైనె…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
వేచాను నీ రాకకై…