చిత్రం: మంచిమనిషి (1964)
సంగీతం: టి.చలపతి రావు & సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: దాశరధి
గానం: పి.బి.శ్రీనివాస్
నటీనటులు: యన్.టి.రామారావు, జమున
దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ
నిర్మాత: కె.సుబ్బరాజు
విడుదల తేది: 11.11.1964
ఓ ఓ ఓ… గులాబి…
ఓ ఓ ఓ… గులాబి
వలపు తోటలో విరిసిన దానా
లేత నవ్వుల… వెన్నెల సోన
ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
సొగసైన కనులదానా సొంపైన మనసుదానా
నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో
ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
కొంటె తుమ్మెదల వలచేవు…
జుంటి తేనెలందించేవు
మోసం చేసి మీసం దువ్వి
మోసకారులకు లొంగేవు లొంగేవు
ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
రూపం చూసి వస్తారు…
చూపుల గాలం వేస్తారు
రేకుల చిదిమీ సొగసులు నులిమీ
చివరకు ద్రోహం చేస్తారు
చివరకు… ద్రోహం… చేస్తారు…
ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
సొగసైన కనులదానా సొంపైన మనసుదానా
నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో”