అనగనగా ఒక చిన్నది… లిరిక్స్
చిత్రం: మంచివాడు (2011)
నటీనటులు: తనీష్, భామ
సంగీతం: శిర్పి
సాహిత్యం: ఈ.ఎస్.మూర్తి
గానం: ముఖేష్, శ్వేత మోహన్
దర్శకత్వం: పి.లక్ష్మీ నారాయణ
నిర్మాణం : ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్
విడుదల తేది: 08.04.2011
అనగనగా ఒక చిన్నది
వరసైనది మహా గడసరిదీ…
సన్న సన్నగా సన్న జాజిల
చందమామల ఎంత సొగసరిదీ…
అనగనగా ఒక చోరుడు
మగధీరుడు మది దోచాడు…
సంబరాల ఆ సంధ్యవేళలో
అందుకోమని చెంత నిలిచాడు…
కుకుకుకూ కుకుకూ(2)
అందమైన ఒళ్లు దోర జామ పళ్లు
దాచుతుంటే తీరదమ్మ సరదా…
ఇంతలేసి కళ్లు గుచ్చుతుంటే ముళ్లు
జివ్వుమంది గుండెలోన తెలుసా…
నా గొడవే వినవు కదా
ఏవేవో అడగవుగా
ముందరే షరతులా..
తొందరా సుందరా..
అనగనగా ఒక చిన్నది
వరసైనది మహా గడసరిదీ…
సంబరాల ఆ సంధ్యవేళలో
అందుకోమని చెంత నిలిచాడు…
ఉల్లెలేల్లె ఉల్లెలేల్లె ఉల్లెలేల్లె లేలేలే..(2)
చుక్కలన్ని అలిగి మల్లెపూలు నలిగి
తెల్లవారిపోయె నువ్వు రాకా…
చుప్పనాకి చుక్కలు విచ్చుకోని మల్లెలు
ఎందుకంట ముద్దులాడు వేళా…
రసికుడవే మన్మథుడా..
జానవులే నా చెలియా..
చాలులే అల్లరి
చెంతకే రామరి
అనగనగా ఒక చోరుడు
మగధీరుడు మది దోచాడు…
సన్న సన్నగా సన్న జాజిల
చందమామల ఎంత సొగసరిదీ…
అనగనగా ఒక చిన్నది
వరసైనది మహా గడసరిదీ…
సంబరాల ఆ సంధ్యవేళలో
అందుకోమని చెంత నిలిచాడు…
????????????????