ఆకాశ వీధిలో … అందాల జాబిలి … లిరిక్స్
సినిమా: మాంగల్య బలం (1958)
దర్శకుడు: ఆదుర్తి సుబ్బారావు
గానం: ఘంటసాల, పి.సుశీల
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: శ్రీశ్రీ
తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, రేలంగి, కన్నాంబ, రమణా రెడ్డి, సుకుమారి
ఒఓఒఓ… ఓఒఓఓఓఓఓఓఒఓఒఓఓఓ…
ఆకాశ వీధిలో … అందాల జాబిలి …
ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే.. సయ్యాటలాడెనే..
ఆకాశ వీధిలో … అందాల జాబిలి
ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే.. సయ్యాటలాడెనే..
ఆకాశ వీధిలో … అందాల జాబిలి
ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే.. సయ్యాటలాడెనే..
జలతారు మేలిమబ్బు పరదాలు నేసీ.. తెరచాటు చేసి …
పలుమారు దాగి దాగి పంతాలు పోయి.. పందాలు వేసి …
అందాల చందమామ దొంగాటలాడెనే … దోబూచులాడెనే …
ఆకాశ వీధిలో … అందాల జాబిలి
ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే.. సయ్యాటలాడెనే..
ఆఆఅ ఆఆఆఆ …ఓఓఒ ఓఓఓఒ…
ఆఆఅ ఆఆఆఆ …ఓఓఒ ఓఓఓఒ…
జడివాన హోరుగాలి సుడిరేగిరానీ జడిపించబోనీ …
కలకాలం నీవే నేనని పలుబాసలాడి చెలి చెంత చేరి
అందాల చందమామ అనురాగం చాటెనే.. నయగారం చేసెనే..
ఆకాశ వీధిలో అందాల జాబిలి …
ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే.. సయ్యాటలాడెనే …
ఆఆఅ ఆఆఆఆ …ఓఓఒ ఓఓఓఒ…
ఆఆఅ ఆఆఆఆ …ఓఓఒ ఓఓఓఒ…
ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగెనే …
జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే … కడగండ్లు కల్గెనే …
జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే … కడగండ్లు కల్గెనే …
ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగెనే మ్రోగెనే …
జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే … కడగండ్లు కల్గెనే…
old telugu songs lyrics
old telugu songs lyrics
Sure We will update. 🙂 Just comment one time, for user saftey and against bad comments we will review your comment.
నమస్???ారములు సార్ మ???రు ??????్???ిన లిరి???్స్ వా???్స్???ప్ ???ాన??? ???మ???యిల్ ???ాన??? ???్రాన్స్ఫర్ ???వ్వ???్ల???దు సార్
నమస్???ారములు సార్ మ???రు ??????్???ిన లిరి???్స్ వా???్స్???ప్ ???ాన??? ???మ???యిల్ ???ాన??? ???్రాన్స్ఫర్ ???వ్వ???్ల???దు సార్
సార్ మ???ము వర్???్ ??????స్తున్నాము. ??????త్త ???ప్డ??????్ల??? ???న్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ ??????స్తాము. ?????????????????? ????????? పడుతు???ది.
We Will solve all bug’s in soon. Thanks for your consult.