జగమంతా నీదే కదరా… లిరిక్స్
సంగీతం: చరణ్ అర్జున్
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: మంగ్లీ
దర్శకత్వం: దాము రెడ్డి
విడుదల తేది: 18.02.2020
జగమంతా నీదే కదరా జంగమా..
జనమందరు పూజించే శివలింగమా.
అర్థమవని ఆధిభిక్షు అవతారమా..
ఆచరించి తెలిపే జీవిత సారమా.
నాగు పాము నీ మేడలోన హారమా..
నరులనెపుడు గాచే చెడు సంహారమా..
తలన గంగ ఉన్నా తీరని దాహమా..
డోలె పట్టి తిరగడము నీకు అవసరమా…
నిండు నలుపు రూపమా..నిజాలేంటో చూపుమా.
జంతు చర్మ దేహమా.. అంతులేని సందేహమా..
అర్థమవని ఆధిభిక్షు అవతారమా..
ఆచరించి తెలిపే జీవిత సారమా.
జగమంతా నీదే కదరా జంగమా..
జనమందరు పూజించే శివలింగమా.
ఓం.. హరోమ్.. హర..
ఓం.. హరోమ్.. హర..
పార్వతి సగభాగమై… గణనాథుడి పునాది పుట్టుకవై..
వెలిగే నీకెందుకో.. ఆ స్మశాన సంచారం..
కుభేరునికే వరములు.. కుమ్మరించి అష్టసిద్ద నిధులు..
నువ్వేమో భిక్షాటన.. అసలేంటి ఈ మర్మం..
విశ్వమంత నీ భక్త జనమే.. వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే..
అయినా! నీకు ఇల్లు లేదట.. ఎంతటి హాస్యమే..
నీ మాట దాటి చిన చీమ కూడ కాటెయ్యదుగా… ఓ పరమేశ,
ఓ చిటికేసి తీర్చేయ్యరాద మా అందరి హరిగోస..
నిలకడ ఎటు లేని నిత్య ప్రయాణమా..
నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా..
అర్థమవని ఆధిభిక్షు అవతారమా..
ఆచరించి తెలిపే జీవిత సారమా.
ఓం.. హరోమ్.. హర..
ఓం.. హరోమ్.. హర..
నటరాజ స్వరూపమా.. పంచభూతములన్నీ నీ వశమా..
చావు పుట్టుకలనే మించినది నీ మహిమ…
కైలాసం వీడవా.. కాస్తైనా చూడు జనం గొడవ
అనుమానం తీర్చవా నువ్ మనిషా దేవుడివా..
నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా…
నీకు మాత్రం సిత్రంగా ఒళ్ళంతా బూడిదెలా…
ఒక యేడు కాదు రెండేళ్లు కాదు ప్రతి యేడు ఇంతే మా ప్రేమా..
నిను సుట్టవోలే ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేళ…
ఒక్క పొద్దు జాగారాలకు ధీటుగా…
సక్కదిద్దు మా బతుకులనే తేటగా…
కోటి పేర్లు నీకున్నా అలవాటుగా..
శంకరయ్య అంటే పలుకు ప్రేమగా..
జగమంతా నీదే కదరా జంగమా..
జనమందరు పూజించే శివలింగమా.
నాగు పాము నీ మేడలోన హారమా..
నరులనెపుడు గాచే చెడు సంహారమా..
అర్థమవని ఆధిభిక్షు అవతారమా..
ఆచరించి తెలిపే జీవిత సారమా.
తలన గంగ ఉన్నా తీరని దాహమా..
డోలె పట్టి తిరగడం నీకు అవసరమా…
ఓం.. హరోమ్.. హర..
ఓం.. హరోమ్.. హర..
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
super
super
nice
🙏🏻🕉️🙏🏻🌹👌🏻