చిత్రం: మన్మధుడు (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు
కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విజయభాస్కర్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
నిర్మాత: నాగార్జున అక్కినేని
విడుదల తేది: 20.12.2002
చిత్రం: మన్మధుడు (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భువన చంద్ర
గానం: దేవి శ్రీ ప్రసాద్
Oh baby just give me love
Oh baby I want it now
Oh baby just give me love
Oh baby I want it now
హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు
హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు
అరె సిల్కు చుడీదారులు కాంజీవరం చీరలు
రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
Oh baby just give me love
Oh baby just take it now
Oh baby just give me love
Oh baby just take it now
చరణం: 1
హే నువ్వేనా నా కల్లో కొచ్చింది
నా మనసంతా తెగ అల్లరి చేసింది
ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్ నా
నా కమ్మని కౌగిట్లో నిను బంధిచేసేయ్ నా
అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేయ్ నా
హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
అయ్యోరామా… ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు
Oh baby just give me love
Oh baby just take it now
Oh baby I want it now
Oh baby take it right now
చరణం: 2
హే కళ్యాణీ నచ్చిందే నీ ఓణీ నీ తోడే కోరిందే జవానీ
ఎర్రని బుగ్గలకి వేసెయ్ నా గాలాన్ని
నీ ఒంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని
అరె ఎన్నో ఎన్నో అందాలున్నా ఈ లోకంలో చిన్నారీ
అన్నిట్లోకి నువ్వేమిన్న కద సుకుమారి
అయ్యోరామ ఈ భామ తెగ ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు
హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు
అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
అయ్యోరామా… ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
******** ******** ********
చిత్రం: మన్మధుడు (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నా మనసునే మీటకే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా
సరదాల చిలిపి తనమా చిరునవ్వులోని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా
నా మనసునే మీటకే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా…
చరణం: 1
నా కెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి
నీ వెంటపడే ఆశలకి చూపవా పులదారి
చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగ
తడిజాడ లేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగ
లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా…
నీ కనులలో వెలగనీ ప్రియతమా…
నీ పెదవికే తెలుపనీ మధురిమా….
చరణం: 2
నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను….
నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను…
అలవాటుపడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా….
కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా…
నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమా….
నీ… కనులలో… వెలగనీ… ప్రియతమా…
నీ… పెదవికీ… తెలుపనీ… మధురిమా…
సరదాల చిలిపి తనమా చిరునవ్వులోని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా
******* ******** ********
చిత్రం: మన్మధుడు (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: వేణు, సుమంగళి
గుండెల్లో ఏముందో… కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం… నీపేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం… నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం… నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది!
గుండెల్లో ఏముందో… కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం… నీపేరే పిలుస్తోంది
మనసా మనసా మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా… ఓ మనసా…!
చరణం: 1
పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది
నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతోంది
కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో… ఇదంతా… నిజంగా కలలాగే ఉంది!
గుండెల్లో ఏముందో… కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం… నీపేరే పిలుస్తోంది
చరణం: 2
ఎందుకో తెలియని… కంగారు పుడుతున్నది
ఎక్కడా జరగని… వింతేమి కాదే ఇది
పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించీ పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది!
గుండెల్లో ఏముందో… కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం… నీపేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం…నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం… నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది!
మనసా మనసా మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా… ఓ మనసా…!
********* ********* *********
చిత్రం: మన్మధుడు (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: షాన్
చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే
సఖియా సఖియా… వంటరిని చెయ్యకే
నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా
ఎదమాటేబాటై రానానీదాకా
పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా
నినుతాకేదాకా ఆగదు నాకేకా
చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే
సఖియా సఖియా… వంటరిని చెయ్యకే
నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా
ఎదమాటేబాటై రానానీదాకా
చరణం: 1
కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమా
కలయికే కల అని మాయమైపోకుమా
గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా
చెరిపినా చెరగని గాయమైపోకుమా
మౌనమా అభిమానమా పలకవా అనురాగమా
ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా
అడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా
చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే
సఖియా సఖియా… వంటరిని చెయ్యకే
చరణం: 2
నిలిచిపో సమయమా తరమకే చెలిమి ఇకనైనా
చెలిమితో సమరమా ఇంతగా పంతమా
నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా
నమ్మవేం ప్రణయమా అంత సందేహమా
వేరుచేసే కాలమా చేరువైతే నేరమా
దాడి చేసే దూరమా దారి చూపుమా
విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా
చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే
సఖియా సఖియా… వంటరిని చెయ్యకే
నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా
ఎదమాటేబాటై రానానీదాకా
పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా
నినుతాకేదాకా ఆగదు నాకేకా
******* ******** *********
చిత్రం: మన్మధుడు (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: యస్.పి.బాలు
హా… శభాష్…
స గ మ పా నీ ప … మ ప గా … రీ స నీ పా… మ ప నీ సా…
రేయ్ వద్దురా…సోదరా… అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా…
ఆదరా… బాదరా… నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా రేయ్…
వద్దురా…
వద్దు, వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా
చెడిపోవద్దు బ్రహ్మచారీ పడిపోవద్దు కాలుజారీ
తాళికట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి
కళ్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా
నీకొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర
Don’t marry be happy (4)
వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా అ అ ఆ
శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్ళి చేసుకున్నాడు
కాలేజీలో వాడు గ్రీకు వీరుడు మ్యారేజీ కాకముందు రాకుమారుడు
అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కాలేదు
ఎంతమారిపోయాడో గుర్తుపట్టలేనట్టు
బక్క చిక్కిపోయి మంచి లుక్కు పోయి
ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటే
తను దేవిదాసు కావడం వల్ల అంటు
గుక్కపెట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందుకొట్టి ఫ్లాష్ బాక్ చెప్పాడు
పొద్దున్నలేస్తున్న లేస్తునే తన అందాన్ని పొగడాలి
మరి ఏపూటకాపూటే తనకైలవ్యూ చెప్పాలి
ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం
కత్తి సామైందిరా కాపురం పెళ్ళి క్షమించరాని నేరం
Don’t marry be happy (4)
వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా వద్దుర వద్దు
అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంతటోడు లేడు
మామూలుగానే వాడు దేశముదురు పెళ్ళితోటె పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పడ్లేక ఇంటిపోరు
చల్లారిపోయింది వాడినెత్తురు
ఒక్కపుట కూడా ఉండదనుకుంటా
కస్సుమనకుండా బుర్రతినకుండా
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి
తరుముతునే ఉంటదట వీధివెంట
కోడెనాగు లాంటి వాడ్ని వానపాము చేసింది
ఆలికాదురా అది అనకొండ
ఆ గయ్యాలి యమగోల కలిగించిందిభక్తి యోగం
ఆ ఇల్లాలి దయవల్ల కనిపించింది ముక్తి మార్గం
సంసారమే వేస్టని ఇక సన్యాసమే బెస్టని
కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా
Don’t marry be happy (4)
వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా
Don’t marry be happy (4)