Manoharam (2000)

చిత్రం: మనోహరం (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: పార్థసారధి, చిత్ర
నటీనటులు: జగపతిబాబు, లయ
దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాతలు: ముళ్ళపూడి బ్రహ్మానందం, సుంకర మధుమురళి
విడుదల తేది: 15.01.2000

పుచ్చా పూవుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలూ
అచ్చామీగడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు
వచ్చీనాయమ్మా విచ్చీనాయమ్మా
వచ్చీనాయమ్మా కలువలు విచ్చీనాయమ్మా

ముద్దా బంతులు ముని గోరింటలు మురిసే సంజెల్లో
పొద్దే ఎరుగని ముద్దే తరగని రస నారింజల్లో
వచ్చీనాయమ్మా విచ్చీనాయమ్మా
వచ్చీనాయమ్మా కలువలు విచ్చీనాయమ్మా

గువ్వ జంటలకు కువ కువ ఇటు కుర్ర గుండెలకు మెలకువ
వీణ మీటె సెలయేరూ చలి వేణువూదె చిరుగాలీ
కలువ కనులలోన కలవరింతలాయే
చలువ తనువులోన జలదరింతలాయే
ఓ..ఓ..ఓ..ఓ

పిండీ వెన్నెల వండీ వార్చిన వెండీ ఇసకల్లో
తెల్లా మబ్బులె వెల్లా వేసిన పిల్ల కాలువల్లో
వచ్చీనాయమ్మా వచ్చీనోయమ్మా
వచ్చీనాయమ్మా అలజడులొచ్చీనాయమ్మా

లేత పచ్చికల అణకువ నునులేత మచ్చికల కువకువ
నిండు అల్లికల నవనవ తలదిండు మల్లికల శివ శివ
పట్టపగటి ఎండా పండు వెన్నెలాయే
నిట్టనిలువు తపనే నిలువనీయదాయె
ఓ..ఓ..ఓ..ఓ

ఓరా వాకిలి తీసీ తీయని దోరా వయసుల్లో
మాఘా మాసపు మంచు బెబ్బులి పొంచే వేళల్లో
వచ్చీనోయమ్మా గిచ్చీనాయమ్మా
వచ్చీనాయమ్మా వలపులు గిచ్చీనాయమ్మా

పుచ్చా పూవుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలూ
అచ్చా మీగడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు
వచ్చీనాయమ్మా విచ్చీనాయమ్మా
వచ్చీనోయమ్మా కలువలు విచ్చీనాయమ్మా

error: Content is protected !!