Mantri Gari Viyyankudu (1983)

Advertisements

చిత్రం: మంత్రి గారి వియ్యంకుడు (1983)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: చిరంజీవి , పూర్ణిమా జయరాం
దర్శకత్వం: బాపు
నిర్మాత: జయకృష్ణ
విడుదల తేది: 04.11.1983

సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల
సాయంకాల సందేశాలు నాకే పంపనేల
ఓ మై లవ్ లల లల లల
సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల

L O V E అనే పల్లవి
K I S S అనుపల్లవి
నీ చలి గిలి సందేళ కొత్త సంధి చెయ్యగా
మల్లెలే ఇలా మన్నించి వచ్చి గంధమివ్వగా
నాకు నీవు నీకు నేను లోకమవ్వగా చిలిపిగా

సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల
సాయంకాల సందేశాలు నాకే పంపనేల
ఓ మై లవ్ లల లల లల

sweety beauty అనే పిలుపులు
మాటీ చోటీ అనే వలపులు
కౌగిళింతలే ఈ వేళ జంట కాపురాలుగా
పాడుకో చెలి ఈ నాటి ప్రేమ రాగమాలికా
కోకిలమ్మ తుమ్మెదయ్య వంత పాడగా చిలిపిగా

సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల
సాయంకాల సందేశాలు నాకే పంపనేల
ఓ మై లవ్ లల లల లల
సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల

*********   *********  ********

చిత్రం: మంత్రి గారి వియ్యంకుడు (1983)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి

అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమా
దానికదే దీనికదే అంటే నేరమా
సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా
గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా
అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమా
I love you I love you
I love you I love you

ఈ పడుచు కోపాలు తాటాకు మంట
అవి రేపు తాపాలై కలిపేను జంట
మెరిసింది కొసమెరుపు తెలిసిందిలే వలపు
రానివ్వు నా వైపు రవ్వంత నీ చూపు
వెంటబడ్డా వేడుకున్నా జంటరాను వెళ్ళు వెళ్ళుమంటే
ఏట్లోనొ తోట్లోనొ పడతాను చస్తానులే
నే సచ్చి నీ ప్రేమ సాధించుకుంటానులే

అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమా
దానికదే దీనికదే అంటే నేరమా
సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా
గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా
అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమా

సరసాలు విరసాలై వచ్చింది తంటా
రగిలింది గుండెల్లో పొగలేని మంట
ఈ వెక్కిరింతల్తో వేధించి చంపొద్దు
నీ ఎత్తిపొడుపుల్తో ప్రాణాలు తియ్యొద్దు
bye bye good bye good luck to you darling
ఇన్నాళ్ళ బంధాలు ఈనాడే తీరేనులే
కన్నీటి వీడ్కోలు కడసారి చెప్పాలిలే

అమ్మ కదే బుజ్జి కదే రావే తల్లిగా
దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా
I love you I love you
I love you I love you

*********   *********  ********

చిత్రం: మంత్రి గారి వియ్యంకుడు (1983)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

ఏమని నే చెలి పాడుదునో
తికమకలో ఈ మకతికలో
తోటలలో పొదమాటులలో తెరచాటులలో
ఏమని నే మరి పాడుదునో
తికమకలో ఈ మకతికలో

నవ్వు చిరునవ్వు విరబూసే పొన్నలా
ఆడు నడయాడు పొన్నల్లో నెమలిలా
పరువాలే పార్కుల్లో ప్రణయాలే పాటల్లో
నీ చూపులే నిట్టూర్పులై నా చూపులే ఓదార్పులై
నా ప్రాణమే నీ వేణువై నీ ఊపిరే నా ఆయువై
సాగే తీగ సాగే రేగిపోయే లేత ఆశల కౌగిట

Advertisements

ఏమని నే మరి పాడుదునో
తికమకలో ఈ మకతికలో

చిలక గోరింక కలబోసే కోరిక
పలికే వలపంతా మనదెలే ప్రేమికా
దడ పుట్టే పాటల్లో ఈ దాగుడుమూతల్లో
ఏ గోపికో దొరికిందని ఈ రాజుకే మరుపాయెనా
నవ్విందిలే బృందావని నా తోడుగా ఉన్నావని
ఊగే తనువులూగే వణకసాగె రాసలీలలు ఆడగ

ఏమని నే మరి పాడుదునో
తొలకరిలో తొలి అల్లరిలో మన అల్లికలో
ఏమని నే చెలి పాడుదునో
తికమకలో ఈ మకతికలో

*********   *********  ********

చిత్రం: మంత్రి గారి వియ్యంకుడు (1983)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమా భయ కంపనమో
శివశంకర వణికింపగ శరణని
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ

తాండవమాడే నటుడైనా ఆ ఆ ఆ
తలిచిన వేళ హితుడేలే
తాండవమాడే నటుడైనా
తలిచిన వేళ హితుడేలే
గిరిజనులే ఆ శివున్ని గురి విడక ధ్యానించు
ఆ శివ శంకర నామము చేసిన నీకిక చింతలు ఉండవులే
బెరుకుమాని ప్రేమించి ప్రేమ మీద లాలించె
యముడు చూపు తప్పించి తప్పులున్న మన్నించేయ్
ఇష్టదైవమతని మీద దృష్టిని నిలిపి
శివుని పిలవ వేళ

ఓ మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమా భయ కంపనమో
శివశంకర వణికింపగ శరణని
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ

సప్త మహర్షుల సన్నిధిలో
గరి రిస సని నిద దప
పగమ పదస పద సరిగమ గ
సప్త మహర్షుల సన్నిధిలో
సప్త మహర్షుల సన్నిధిలో
సప్త స్వరాల ప్రియ శృతిలో
గౌరి వలె ఆ శివుని గౌరవమే కాపాడు
ఆ నవజాతకు ఈ భువజాతకు కలిసిన జాతకమీ వరుడే
లంక చెరను విడిపించి శంకలన్నీ తొలగించి
ఈసులన్నీ కరిగించి నీ సుశీల మెరిగించె
లగ్నమైన మనసుతోడ పెళ్ళికి
లగ్నమిపుడు కుదురు వేళ

ఓ మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమా భయ కంపనమో
శివశంకర వణికింపగ శరణని
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ

*********   *********  ********

చిత్రం: మంత్రి గారి వియ్యంకుడు (1983)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా
జబరుదస్తీ చేస్తే శాస్తిరా
విడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావురా
దోస్తీ ఒకటే ఆస్తిరా
జబరుదస్తీ చేస్తే శాస్తిరా

కాదురా ఆటబొమ్మ ఆడదే నీకు అమ్మ
ఎత్తరా కొత్త జన్మ ప్రేమ నీ తాత సొమ్మా
తెలుసుకో తెలివిగా మసలుకో
ఉన్నదా నీకు దమ్ము దులుపుతా నీకు దుమ్ము
అలుసుగా ఆడకు మనసుతో
ఆ ప్రేమ ధనికుల విలువలు గని
నీ వంటి ధనికులు వెలవెలమని
ఆ ప్రేమ ధనికుల విలువలు గని
నీ వంటి ధనికులు వెలవెలమని
జీవిస్తే ఫలితమేఇటి
శ్రీరాగమున కీర్తనలు మానరా

దోస్తీ ఒకటే ఆస్తిరా
జబరుదస్తీ చేస్తే శాస్తిరా

ప్రేమకై నీవు పుట్టు ప్రేమకై నీవు బ్రతుకు
ప్రేమకై నీవు చచ్చి ప్రేమవై తిరిగి పుట్టు
మరణమే లేనిది మనసురా
క్షణికమే యవ్వనమ్ము కల్పనే జీవనమ్ము
నమ్ముకో దిక్కుగా ప్రేమనే
ఈ జనన మరణ వలయములనిక
ఛేదించి మమతను మతమనుకుని
ఈ జనన మరణ వలయములనిక
ఛేదించి మమతను మతమనుకుని
జీవించే మోక్షమార్గము
శ్రీరస్తనుచు దీవెనగ దొరికిన

దోస్తీ ఒకటే ఆస్తిరా
జబరుదస్తీ చేస్తే శాస్తిరా
విడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావురా
దోస్తీ ఒకటే ఆస్తిరా
జబరుదస్తీ చేస్తే శాస్తిరా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Kodi Ramakrishna
error: Content is protected !!