Marakkar (2021)
Marakkar (2021)

Marakkar (2021)

చిన్ని కుంజాలికి చిరునవ్వు లాలి… లిరిక్స్

చిత్రం: మ‌ర‌క్కార్ (2021)
సంగీతం: రోనీ రాఫెల్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: కె. ఎస్. చిత్ర
నటీనటులు: మోహన్‌లాల్, ప్రణవ్ మోహన్‌లాల్, అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, సుహాసిని, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్, ఫాజిల్, సిద్ధిఖి, నేదుముడి వేణు, ఇన్నోసెంట్, అశోక్ సెల్వన్
దర్శకత్వం: ప్రియదర్శన్
నిర్మాణం: ఆంటోనీ పెరుంబవూర్
విడుదల తేది: 26.03.2021

Chinni Kunjali Song Telugu Lyrics

చిన్ని కుంజాలికి చిరునవ్వు లాలి… లాలి జో లాలీ, లాలి జో లాలీ
ఊహల్లో తేలంగా ఊయలేయాలి… నా పాట వింటూ నిదురపోవాలి
పిల్లగాలి లాలించి పోవే… కొండెక్కి ఆ వెండి వెన్నెల్లు తేవే
జాజి పువ్వా జాబిలిని తేవే… చిరుముద్దు మరుముద్దు ఇచ్చి పొమ్మనవే
చిన్ని కుంజాలికి చిరునవ్వు లాలి… లాలి జో లాలీ, లాలి జో లాలీ

చిన్ని నా బాబంటే వెయ్యేళ్ళ వెలుగు… ఈ అమ్మ ఆశిస్సు నిను కాచగలుగు
ఉదయించే సూర్యుడై వెలిగిచ్చే రూపం… హృదయంలో ప్రేమే వెదజల్లే దీపం
మరుమల్లె కూన… ఆ ఆఆ, ఆ ఆఆ
మాణిక్య వీణ నా కంటి పాప… కనురెప్పై కలకాలం కాచేను కన్న
గుండెల్లో పదిలంగా దాచేను నాన్న
చిన్ని కుంజాలికి చిరునవ్వు లాలి… లాలి జో లాలీ, లాలి జో లాలీ

తారల్లే కనువిందై తారాడే కన్న… పలికే జాబిల్లై పారాడే చిన్న
నా నోము ఫలమంటే నువ్వేరా నాన్న… లోకాన సిరియే లేదు నీ కన్నా
నా ప్రాణమల్లే పెంచేను నిన్నే… బంగారుకొండై కలకాలం కుంజాలి
బతకాలి ఇలలో, కలకాలం కుంజాలి… బతకాలి ఇలలో
కలకాలం కుంజాలి… బతకాలి ఇలలో
కలకాలం కుంజాలి… బతకాలి ఇలలో

Marakkar Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****