మరిచేపోయావా.. మనస మారిపోయావా.. లిరిక్స్
లేబుల్ : లలిత ఆడియో అండ్ వీడియోస్
మరిచేపోయావా.. మనస మారిపోయావా..
మన ప్రేమను మరిచావా.. మనస దూరమె చేశావా..
ఎంతగా.. నిను ప్రేమించానో నీకు తెలియదా
నిజమైనా.. ప్రేమనీదని నేను నమ్మలేదా..
ఇంతలోన నీకు ఏమైందో.. మనసునే మార్చుకున్నావా..
మరిచేపోయావా.. మనస మారిపోయావా..
మన ప్రేమను మరిచావా.. మనస దూరమె చేశావా..
ఓహొహో.. ఓహొ ఓహొహో..
ఓహొహో.. ఓహొ ఓహొహో..
ప్రేమగ నిన్న మాట్లాడావు మాటే నేడు వద్దన్నావు
ప్రేమే కావాలన్నావు ఆ ప్రేమను బలిగా కోరావు
నీ వెంటపడి నే వేదిస్తూ మాటలంటినా..
అయినవాళ్ళు నాకెందరు ఉన్నా నీ ప్రేమే చాలంటినా..
మరిచేపోయావా.. మనస మారిపోయావా..
మన ప్రేమను మరిచావా.. మనస దూరమె చేశావా..
నువ్వే జీవితం అన్నావు నా జీవితం ఒంటరి చేశావు
మనసును ఇచ్చానన్నావు నా మనసుకు మచ్చే చేశావు
నన్ను కాపాడెదైవంలా.. నిన్ను కొలువలేదా..
పసిపాపవోలే.. నా ప్రాణంగా నేను చూడలేదా..
మరిచేపోయావా.. మనస మారిపోయావా..
నా ప్రేమను మరిచావా.. మనస దూరమె చేశావా..
కమ్మని కలలను కన్నావు ఆ కలల రాజ్యాన్ని కూల్చావు
నా చూపునే చూడకు అన్నావు కనుపాపకు కన్నీరెట్టావు
నేనెపుడైనా మన స్నేహాన్నే కాదంటినా
జగతిలొలేని బాధను నేను అనుభవిస్తిని
మరిచేపోయావా.. మనస మారిపోయావా..
మన ప్రేమను మరిచావా.. మనస దూరమె చేశావా..
నా మదిలో ఆశలు రేపావు శిలగా నన్ను మార్చావు
నా ప్రేమను చేదనుకున్నావు సెగలా నీవు మారావు
చావైనా బ్రతుకైనా నీతో అనూకుంటిని
ఈ ఊపిరి ఉన్నది నీకోసమే నా దరి చేరవే మనసా..