చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: యమ్. యమ్. కీరవాణి, గీతా మాధురి
నటీనటులు: సునీల్ , సలోని
దర్శకత్వం: యస్.యస్. రాజమౌళి
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
విడుదల తేది: 23.07.2010
రాయలసీమ మురిసిపడేలా…
రాగలవాడి జన్మ తరించేలా…
ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది
మూడు ముళ్ళు వేయమంది
తెలుగమ్మాయి… తెలుగమ్మాయి…
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి… తెలుగమ్మాయి…
అందుకోమన్నది నిన్ను తన చేయి
పలికే పలుకుల్లో ఒలికే తొలకరి
ఇంట్లో కురిసిందో సిరులే మరి
నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి
జంటై కలిసిందో కలతే హరి
హంసల నడకల వయారి అయినా ఏడడుగులు నీ వెనకే
ఆశల వధువుగ ఇలాగ ఇలపై జారిన జాబిలి తునకే….
తెలుగమ్మాయి… తెలుగమ్మాయి…
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి… తెలుగమ్మాయి…
అందుకోమన్నది నిన్ను తన చేయి
గీతలే అని చిన్న చూపెందుకు
వాటి లోతులు చూడలేరెందుకు
నదిలో పడవలా వానలో గొడుగులా
గువ్వపై గూడులా కంటిపై రెప్పలా
జతపడే జన్మకి తోడు ఉంటానని
మనసులో మాటనే మనకు చెప్పకనే చెబుతుంది
తెలుగమ్మాయి… తెలుగమ్మాయి…
గుండెనే కుంచెగా మలచిందోయి
తెలుగమ్మాయి… తెలుగమ్మాయి…
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి… తెలుగమ్మాయి…
అందుకోమన్నది నిన్ను తన చేయి
******** ********* ********
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
పరుగులుతీయ్ బిర బిర బిర బిర
ఉరకలువేయ్ చర చర చర చర చర చర చర చర
పరుగులుతీయ్ బిర బిర బిర బిర
ఉరకలువేయ్ చర చర చర చర
దడ దడ దడ దడలాడే ఎదసడి ఢమరుకమై
వడి వడి వడి వడిదూకే పదగతి తాండవమై
పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై
ముంచుకువచ్చు మౄత్యువుకందని మార్కండేయుడవై
పరుగులుతీయ్ ఉరకలువేయ్
పరుగులుతీయ్ బిర బిర బిర బిర
ఉరకలువేయ్ చర చర చర చర
బిరబిర బిరబిర బిరబిర బిరబిర
చరచర చరచర చరచర చరచర
బిరబిర చరచర బిరబిర చరచర
గుత్తుకకోసే కత్తికొనలు కత్తికొనలు
గుత్తుకకోసే కత్తికొనలు దరిదాపుకుచేరని దూకుడువై
ఆయువుతీసే ఆపద కూడా అలసటతో ఆగేలాచేయ్
మట్టిలో తనగిట్టలతో నిను తొక్కేయ్యాలని వచ్చే కాలాశ్వముపై శ్వారీచేయ్
పరుగులుతీయ్ బిర బిర బిర బిర
ఉరకలువేయ్ చర చర చర చర
పరుగులుతీయ్ బిర బిర బిర బిర
ఉరకలువేయ్ చర చర చర చర
ఎడారిదారుల తడారిపోయిన ఆశకు చెమటలధారలుపోయ్
నిస్సత్తువతో నిలబడనీయ్యక
ఒక్కోఅడుగు ముందుకువేయ్
వందయేళ్ళ నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై
శతకోటి సమస్యల ఎదుర్కొనేందుకు బతికివుండగల సాహసానివై
పరుగులుతీయ్ పరుగులుతీయ్
ఉరకలువేయ్ ఉరకలువేయ్
పరుగులు పరుగులు పరుగులుతీయ్
ఉరకలు ఉరకలు ఉరకలువేయ్
బిరబిర చరచర బిరబిర చరచర
బిరబిర చరచర బిరబిర చరచర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
********* ********* **********
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కారుణ్య, చిత్ర
అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి
అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి
అక్కడ చూడు తాడి చెట్టుంది
ఆకులు ఊపి టాటా చెబుతుంది
జాబిలి ఎందుకు వెంటే వస్తుంది
నీ పైన మనసై ఉంటుంది
పైకి కిందికి ఊగే నేల ఏమంది
నువ్వు ఊ అంటేనే ఊయలవుతానంది
మీదెకి వచ్చే గాలేమనుకుంటుంది
నీ ఉసులు మోయాలంటుందీ
ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ
అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది
గుమ్మంలోంచెం కనబడుతుంది
గంటక్కి ఎనభై మైళ్ళ వేగంతోటి
ఏవేవో ఆలోచిస్తుంది
ఊహించని మజిలీ వచ్చింది
నాలో ఊహల్ని మలుపులు తిప్పింది
ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని
ఇట్టేనా ముందర ఉంచింది
చల్లని చీకటి చుట్టు కమ్ముకు వస్తుందీ
వెచ్చని చలిమంటకి ఆ చీకటి కరిగిందీ
నిదురలోనె కవ్వించె కల కన్నా
నిజమెంతో అందంగా ఉందీ
ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ
అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటకి తొంబై మైళ్ళ వేగంతోటి
కునుకొచ్చి వాలిపోయింది
******** ********* ********
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్
ఉద్యోగం ఊడిపోయింది..
పోయిందా…పొ పొ పొ పోయిందా..
సద్యోగం సంతకెళ్ళింది
గోవిందా.. గొ గొ గొ గోవిందా..
గోదారి ఈదాలంటే.. కుక్కతోకైనా లేదండీ..
ఏ దేవుడి నడగాలన్నా.. హుండికి చిల్లర లేదు..
పెదవి ఎండిపోతుంది.. కడుపు మండిపోతుంది..
పులుసు కారిపోతుంది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..
ఎవడండీ బాబూ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు..?
కృషి ఉంది.. దుర్భిక్షం కూడా ఉంది..!!
చెమటోడ్చే మనుషులకి ఏలోటూ రానే రాదంటారు..?
ఏమైందీ.. ఆ చెమటేగా మిగిలింది..!
ఛీ అంది.. చేతిలో గీత
నలిగింది.. నుదిటిపై రాత..
టోటల్ గా చీకటయ్యిందీ లైఫంతా..
పెదవి ఎండిపోయింది..
పులుసు కారిపోతుంది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..
శని బాబాయ్ షాడోలా వెంటాడుతున్నాడేమో నన్ను..
పనిలేదు.. పాకెట్లో పైసాలేదు..
దురదృష్టం అయస్కాంతంలా లాగుతున్నాదనుకుంటాను..
ఏం చేయను.. నే ఐరెన్ లెగ్గయ్యాను..
భిచ్చమెత్తరా..! (సిగ్గుపడతాను)
జేబు కత్తెర..! (వెయ్యనే లేను)
చచ్చిపోమరి.. అంతపని చచ్చినా బాబోయ్ నే చేయలేను…
లక్కు లాగి తన్నింది.. తుక్కు లేచిపోయింది..
తిక్క తీరిపోయింది
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.