Maska (2009)

చిత్రం: మస్కా (2009)
సంగీతం: చక్రి
సాహిత్యం: కండికొండ
గానం: జూబిన్ గర్గ్ , కౌశల్య
నటీనటులు: రామ్ పోతినేని, షీలా కౌర్, హన్సిక మోత్వాని
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: యమ్.యస్.రాజు
విడుదల తేది: 14.01.2009

గుండె గోదారిలా .. చిందులేస్తోందిలా
నీలిమేఘాలుగా .. తేలిపోతోందలా
నేను నే కానుగా .. ఇంకోలా మారిలా .. నిజమా !

I am in love .. I am in love ..
I am in love .. I am in love !

గుండె గోదారిలా .. చిందులేస్తోందిలా

నాలో చూసాను ఏ నాడో ఓ వింతా
ఎవరో ఆక్రమించారు మనసంతా

ఊహల్లో నువ్వై చెలీ నా ఎదురుగ నిలిచావే
అందంగా వలపువై నీ తలపులో ముంచావే
నేను శూన్యం లా అయ్యానికా ..

I am in love .. I am in love ..
I am in love .. I am in love !

ప్రవహించింది నీ నుంచి ఓ ప్రేమా
అది నను చేరి లయ పెంచే మదిలోనా

మౌనంగా మనసుతో యే మంతనం జరిపావే
చిత్రంగా అడుగునై నీ అడుగుతో కదిలానే
నీకే అయినానే ప్రియబానిసా !

I am in love .. I am in love ..
 I am in love .. I am in love !

గుండె గోదారిలా .. చిందులేస్తోందిలా
నీలిమేఘాలుగా .. తేలిపోతోందలా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Sneha Geetham (2010)
error: Content is protected !!