చిత్రం: మాయాబజార్ (1957)
సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
నటీనటులు: యన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, యస్.వి.రంగారావు
దర్శకత్వం: కదిరి వెంకట రెడ్డి
నిర్మాతలు: బి.నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి
విడుదల తేది: 27.03.1957
చిత్రం: మాయాబజార్ (1957)
సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: యస్. జానకి
పల్లవి:
అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట
అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం
అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట
అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం
చరణం: 1
వీరాధి వీరులంట ధరణీ కుభేరులంట
బోరు బోరుమంటు మా పెళ్ళివారు వచ్చెరంట
వీరాధి వీరులంట ధరణీ కుభేరులంట
బోరు బోరుమంటు మా పెళ్ళివారు వచ్చెరంట
హబ్బి బ్బొ బ్బొ బ్బొ బ్బొ బ్బొ హ హహహహ
అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట
అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం
చరణం: 2
బాలా కుమారినంట చాలా సుకుమారినంట
బాలా కుమారినంట చాలా సుకుమారినంట
పెళ్ళికొడుకు నన్ను చూసి మురిసి మూర్చపోవునంట
అయ్యయ్యయ్యయ్యయ్యొ హ హహహ
అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట
అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం
చరణం: 3
తాళి కట్టవచ్చునంట ఛీ
తాళి కట్టవచ్చునంట తగని సిగ్గు నా కంట
తాళి కట్టవచ్చునంట
పాద నిగ మమ మాప గప మగ
తాళి కట్టవచ్చునంట
పప పద మమ మప గగ గమ రిగ మప
తాళి కట్టవచ్చునంట ఛీ
తధోం తోతో త తధీం ధీం ధీం త
తధోం త తధీం త తత్తత్తాం తిత్తత్తాం
తతాం తతాం తాం సరిగమ పదనిస
తాళి కట్టవచ్చునంట ఆ తాళి కట్టవచ్చునంట
తాళి కట్టవచ్చునంట తగని సిగ్గు నాకంట
మేలిముసుగు చాటు తీసి దాగుడుమూతలాడునంట
హహహహ హహహహ హాహహహ హహహ
చిత్రం: మాయాబజార్ (1957)
సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: జిక్కి, పి.సుశీల
లల్లిలలా లల్లిలలా
లల్లిలలా లల్లిలలా లల్లి లల్లి లల్లిలలా
లల్లిలలా లల్లిలలా లల్లి లల్లి లల్లిలలా
అల్లీబిల్లీ ఆటలే లల్లిలలా పాటలే
అల్లీబిల్లీ ఆటలే లల్లిలలా పాటలే
ఎవరెవరో కోయిలలూ
కుహూ కుహూ కుహూ కుహూ
ఎవరెవరే నెమిళలూ
కెకే కెకే కెకే కెకే
ఎవరెవరే ఎవరెవరే వన్నెలేడి పిల్లలూ
ఎవరెవరే ఎవరెవరే వన్నెలేడి పిల్లలూ
లల్లిలలా లల్లిలలా లల్లి లల్లి లల్లిలలా
లల్లిలలా లల్లిలలా లల్లి లల్లి లల్లిలలా
అల్లీబిల్లీ అమ్మాయికి
చల చల చల్లని జోస్యం చెపుతామూ
చక్క చక్కని జోస్యం చెపుతామూ
అల్లీబిల్లీ అమ్మాయికి
చల చల చల్లని జోస్యం చెపుతామూ
చక్క చక్కని జోస్యం చెపుతామూ
యవ్వన శోబుల పరామే
ఇది బావను తలచుట గర్వమే
యవ్వన శోబుల పరవమే
ఇది బావను తలచుట గర్వమే
ఆ బావే తనకిక సర్వమే
అల్లీబిల్లీ అమ్మాయికి
చల చల చల్లని జోస్యం చెపుతామూ
చక్క చక్కని జోస్యం చెపుతామూ
ఉన్న మాటకు ఉలుకెందుకు మరి ఉన్నదె చెబుతాము
ఉన్న మాటకు ఉలుకెందుకు మరి ఉన్నదె చెబుతాము
వలదన్నా చెబుతాము
నూతన విద్యల ప్రవీణుడే
బల్ ప్రతిభావంతుడె నీ బావా
నూతన విద్యల ప్రవీణుడే
బల్ ప్రతిభావంతుడె నీ బావా
అతి చతుర వీరుడె నీ బావా
అల్లీబిల్లీ అమ్మాయికి
చల చల చల్లని జోస్యం చెపుతామూ
చక్క చక్కని జోస్యం చెపుతామూ
మల్లీ జాజీ మాలతి సంపెంగ
పూలబాణములు వేసేనూ
మల్లీ జాజీ మాలతి సంపెంగ
పూలబాణములు వేసేనూ
బాలామణితో మురిసేను
మన బాలామణితో మురిసేను
తన పెళ్ళికి బావను పిలిచేను
అల్లీబిల్లీ అమ్మాయికి
చల చల చల్లని జోస్యం చెపుతామూ
చక్క చక్కని జోస్యం చెపుతామూ
చిత్రం: మాయాబజార్ (1957)
సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి. లీల
పల్లవి:
చూపులు కలిసిన శుభవేళా
ఎందుకు నీకీ కలవరము
ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన
అందమె నీలో చిందెనునులే
చూపులు కలిసిన శుభవేళా
ఎందుకు నీకీ కలవరము
చూపులు కలిసిన శుభవేళా
ఎందుకు నీకీ పరవశము
ఎందుకు నీకీ పరవశము
ఏకాంతంలో ఆనందించిన
నా కలలే నిజమాయెనులే
చూపులు కలిసిన శుభవేళా
ఎందుకు నీకీ పరవశము
చరణం: 1
ఆలాపనలు సల్లాపములు
కలకల కోకిల గీతములే…
ఆలాపనలు సల్లాపములు
కలకల కోకిల గీతములే…
చెలువములన్నీ చిత్రరచనలే…
చెలువములన్నీ చిత్రరచనలే…
చలనములోహో నాట్యములే
చూపులు కలిసిన శుభవేళా
ఎందుకు నీకీ కలవరము
చరణం: 2
శరముల వలెనే చతురోక్తులను
చురుకుగ విసిరే నైజములే…
శరముల వలెనే చతురోక్తులను
చురుకుగ విసిరే నైజములే…
శరము ఉద్యానమున వీర విహారమే…
శరము ఉద్యానమున వీర విహారమే…
చెలి కడనోహో శౌర్యములే…
చూపులు కలిసిన శుభవేళా
ఎందుకు నీకీ కలవరము
ఎందుకు నీకీ కలవరము
చిత్రం: మాయాబజార్ (1957)
సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: మాధవ పెద్ది సత్యం
పల్లవి:
దయచేయండీ దయచేయండీ
తమంత వారికలేరండీ! తమంత వారిక లేరండీ!
అతి ధర్మాత్ములు అతి పుణ్యాత్ములు
అతి ధీమంతులు మీరండీ
తగు కైవారం తగు సత్కారం
తగు మాత్రంగా గైకొండి
తమంత వారిక తమరండీ
తతంగమంతా తమకండి
హై హై వైవై కైకై గైగై జియ్యా…
చరణం: 1
పెండ్లి కుమారా, రావయ్యా
మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా
పెండ్లి కుమారా, రావయ్యా
మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా
ముల్లోకాలను వెతికి తెచ్చిన అల్లుడవంటే నీవయ్యా
ముల్లోకాలను గాలించి తెచ్చిన ల్లుడవంటే నీవయ్యా
పల్లకి దిగి రావయ్యా తతంగమంతా నీదయ్య
తతంగమంతా నీదయ్య
కిరీటాలు! కిరీటాలు!
వజ్రాలు కిరీటాలు!
ధగ ధగ కిరీటాలు!
ధరించినంతనె తలలో మెరయును
బలె యోచనలు బ్రహ్మాండముగా
బలె యోచనలు బ్రహ్మాండముగా
శిరస్త్రాణములు శిరోధార్యములు శిరోజ రక్షలు కిరీటాలివె
అందుకోండయ్యా దొరలు ముందుకు రండయ్యా
అందుకోండయ్యా దొరలు ముందుకు రండయ్యా
చరణం: 2
హారాలు మణిహారాలు
హారాలు మణిహారాలు పతకాలు నవపతకాలు
హారాలు మణిహారాలు పతకాలు నవపతకాలు
మణిబంధాలు బుజబంధాలు
అందాలకు అనుబంధాలు
అందాలకు అనుబంధాలు
వింత చీరలు వింత ముసుగులు
వింత చీరలు వింత ముసుగులు
బ్రహ్మాండాలకు సంబంధాలు
అందుకొండమ్మా తల్లులు ముందుకు రండమ్మా
అందుకొండమ్మా తల్లులు ముందుకు రండమ్మా
చరణం: 3
రక్షలు రక్షలు పాదరక్షలు
నాట్య శిక్షణలో బాలశిక్షలు
రక్షలు రక్షలు పాదరక్షలు
నాట్య శిక్షణలో బాలశిక్షలు
తొడిగన తోడనె తోధిమి తోధిమి
అడుగు వేయగనే తైతక్కతైతక్క
తొడిగన తోడనె తోధమి తోధమి
అడుగువేయగనే తైతక్క తైతక్క
నేలమీదనిక నిలువనీయక
కులాసగ మిము నటింపజేసే
రక్షలు రక్షలు పాదరక్షలు
నాట్య శిక్షణలో బాలశిక్షలు
రక్షలు రక్షలు పాదరక్షలు
నాట్య శిక్షణలో బాలశిక్షలు
చరణం: 4
ఒకటే మా వయసూ
ఓ రాజా ఒకటే మా సొగసూ
ఒకటే మా వయసూ
ఓ రాజా ఒకటే మా సొగసూ
నయగారము నా కళరా
వయ్యారము నా వలరా
నయగారము నా కళరా
వయ్యారము నా వలరా హోయ్
నేనే నీ జోడురా నేనే నీ ఈడురా
వన్నె చిన్నె లెన్నరా ఓ రాజా
వన్నె చిన్నె లెన్నరా ఓ రాజా
ఒకటే మా వయసూ
ఓ రాజా ఒకటే మా సొగసూ
చరణం: 5
సరసతలో ఇది జాణరా
రసికతలో ఇది రాణిరా
సరసతలో ఇది జాణరా
రసికతలో ఇది రాణిరా హోయ్
నిన్నే కోరితిరా నిన్నే చేరితిరా
వన్నె చిన్నెలెన్నరా ఓ రాజా
వన్నె చిన్నెలెన్నరా ఓ రాజా
ఒకటే మా వయసూ
ఓ రాజా ఒకటే మా సొగసూ
చిత్రం: మాయాబజార్ (1957)
సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి.లీల
పల్లవి:
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ
చరణం: 1
తారాచంద్రుల విలాసములతో
విరిసే వెన్నెల పరవడిలో – ఉరవడిలో
తారాచంద్రుల విలాసములతో
విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే
పిల్లవాయువుల లాలనలో
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ
చరణం: 2
అలల ఊపులో తియ్యని తలపులూ…
చెలరేగే ఈ కలయికలో – మిలమిలలో
అలల ఊపులో తియ్యని తలపులూ…
చెలరేగే ఈ కలయికలో
మైమరిపించే ప్రేమ నౌకలో
హాయిగ చేసే విహరనలో
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ
చిత్రం: మాయాబజార్ (1957)
సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి.లీల
పల్లవి:
నీకోసమే నే జీవించునది
ఈ విరహములో ఈ నిరాశలో
నీకోసమే నే జీవించునది
ఈ విరహములో ఈ నిరాశలో
వెన్నెల కూడా చీకటిఐనా
మనసున వెలుగే లేకపోయినా
నీకోసమే నే జీవించునది
చరణం: 1
విరహము కూడా సుఖమే కాదా
నిరతము చింతన మధురము కాదా
విరహము కూడా సుఖమే కాదా
నిరతము చింతన మధురము కాదా
వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా
నీ రూపమునే ధ్యానించునది
నా హృదయములో నా మనస్సులో
నీ రూపమునే ధ్యానించునది
చరణం: 2
హృదయము నీతో వెడలి పోయినా
మదిలో ఆశలు మాసిపోయిన
మన ప్రేమలనే మరి మరి తలచి
ప్రాణము నిలుపుకొనీ
నీకోసమే నే జీవించునది
చరణం: 3
మెలుకువనైనా కలలోనైనా
కొలుతును నిన్నే ప్రణయ దేవిగా
లోకములన్నీ ఏకమె అయినా ఇది నాదానవేగా
నీ రూపమునే ధ్యానించునది
ఈ విరహములో ఈ నిరాశలో
నీకోసమే నే జీవించునది
చిత్రం: మాయాబజార్ (1957)
సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి.లీల
నీవేనా…
నీవేనా నను తలిచినది
నీవేనా నను పిలిచినది
నీవేనా నా మదిలో నిలచి
హృదయం కలవరపరిచినది నీవేనా…
నీవేలే నను తలచినది
నీవేలే నను పిలిచినది
నీవేలే నా మదిలో నిలచి
హృదయము కలవరపరిచినది….నీవేలే
కలలోనే ఒక మెలకువగా
ఆ మెలుకువలోనే ఒక కలగా
కలలోనే ఒక మెలకువగా
ఆ మెలుకువలోనే ఒక కలగా
కలయో నిజమో వైష్ణవమాయయో
తెలిసి తెలియని అయోమయంలో
నీవేనా నను తలిచినది
నీవేనా నను పిలిచినది
నీవేనా నా మదిలో నిలచి
హృదయం కలవరపరిచినది నీవేనా…
కన్నుల వెన్నెల కాయించి
నా మనసున మల్లెలు పూయించి
కన్నుల వెన్నెల కాయించి
నా మనసున మల్లెలు పూయించి
కనులను మనసును కరగించి
మైమరపించి నన్నలరించి
నీవేలే నను తలచినది
నీవేలే నను పిలిచినది
నీవేలే నా మదిలో నిలచి
హృదయము కలవరపరిచినది….నీవేలే
నీవేలే
చిత్రం: మాయాబజార్ (1957)
సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: యమ్.ఎల్.వసంత కుమారి & కోరస్
పల్లవి:
శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా
చిన్నారి శశిరేఖ వర్దిల్లవమ్మా
వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా
చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా
సకల సౌభాగ్యవతి రేవతీదేవి
తల్లిఅయి దయలెల్ల వెల్లివిరియగను
సకల సౌభాగ్యవతి రేవతీదేవి
తల్లిఅయి దయలెల్ల వెల్లివిరియగను
అడుగకే వరములిడు బలరామదేవులే
జనకులై కోరిన వరము లీయగను
వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా
చిన్నరి శశిరేఖ వర్ధిల్లవమ్మా
చరణం: 1
శ్రీకళల విలసిల్లు రుక్మిణీదేవి
పినతల్లియై నిన్ను గారాము శాయ
శ్రీకళల విలసిల్లు రుక్మిణీదేవి
పినతల్లియై నిన్ను గారాము శాయ
అఖిల మహిమలు కలుగు కృష్ణపరమాత్ములే
పినతండ్రియై సకల రక్షణలు శాయ
వర్ధిల్లు మాతల్లి వర్ధిల్లవమ్మా
చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా
చరణం: 2
ఘన వీరమాతయగు శ్రీ సుభద్రాదేవి
మేనత్తయై నిన్ను ముద్దు శాయగను
ఘన వీరమాతయగు శ్రీ సుభద్రాదేవి
మేనత్తయై నిన్ను ముద్దు శాయగను
పాండవ యువరాజు బాలుడభిమన్యుడే
బావయై నీ రతన లోకమై మురియా
వర్ధిల్లుమా తల్లి వర్ధిల్లవమ్మా
చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా
చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా
చిత్రం: మాయాబజార్ (1957)
సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల
(ఈ పాట లక్ష్మణ కుమారుడు మాయాశశి మీద చిత్రీకరణ జరిగింది)
సుందరి నీవంటి దివ్య స్వరూపంబు
ఎందెందు వెదకిన లేదుకదా
ఎందెందు వెదకిన లేదుకదా
నీ అందచందాలింక నావే కదా
సుందరి ఓహో సుందరి అహ సుందరి
నీవంటి దివ్య స్వరూపంబు
ఎందెందు వెదకిన లేదుకదా
దూరం దూరం – ఆఁ
దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన
ఆర్యపుత్రుడనింక నేనెకదా
దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన
ఆర్యపుత్రుడనింక నేనెకదా
మన పెళ్ళివేడుకలింక రేపేగదా – అయ్యో
అహ సుందరి నీవంటి దివ్య స్వరూపంబు
ఎందెందు వెదకిన లేదుకదా
మన పెళ్ళివేడుకలింక రేపేగదా
సుందరి ఓహో సుందరి
రేపటిదాకా ఆగాలి – ఆఁ
ఆగుమంచు సఖియ అరమరలెందుకే
సొగుసులన్నీ నాకు నచ్చేగదా
ఆగుమంచు సఖియ అరమరలెందుకే
సొగుసులన్నీ నాకు నచ్చేగదా
నీ వగల నా విరహము హెచ్చేగదా
సుందరి ఓహో సుందరి అహ సుందరి
నీవంటి దివ్య స్వరూపంబు
ఎందెందు వెదకిన లేదుకదా
నీ వగల నా విరహము హెచ్చేగదా
సుందరి ఓహో సుందరి అహ సుందరి
హెచ్చితే ఎలా? పెద్దలున్నారు
పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి
ఊఁ…. – ఆఁ
పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి
వద్దకు చేరిన పతినే కదా
పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి
వద్దకు చేరిన పతినే కదా
నీ ముద్దు ముచ్చటలింక నావేకదా
సుందరి నీవంటి దివ్య స్వరూపంబు
ఎందెందు వెదకిన లేదుకదా
నీ ముద్దు ముచ్చటలింక నావేకదా
సుందరి అహ సుందరి ఓహో సుందరి
అహ సుందరి ఓహో సుందరి
ఓహో సుందరి ఓహో సుందరి
ఓహో సుందరి…
చిత్రం: మాయాబజార్ (1957)
సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.సుశీల, పి.లీల, స్వర్ణలత
(గోపికలు యశోధమ్మ కృష్ణుడు మరియు ద్రౌపది మధ్య జరిగే పాట)
విన్నావ యశోదమ్మా! విన్నావ యశోదమ్మా!
మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి అల్లరి చిల్లరి పనులు
విన్నావ యశోదమ్మా
అన్నెం పున్నెం ఎరుగని పాపడు
మన్నుతినే నా చిన్నితనయుడు
ఏమి చేసెనమ్మా ఎందుకు రవ్వ చేతురమ్మా
ఆ… మన్ను తినేవాడా? వెన్న తినేవాడా?
కాలిగజ్జెల సందడి చేయక
పిల్లివలె మా ఇంట్లో దూరి
కాలిగజ్జెల సందడి చేయక
పిల్లివలె మా ఇంట్లో దూరి
ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని
దుత్తలన్నీ క్రింద దించుకుని
ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని
దుత్తలన్నీ క్రింద దించుకుని
పాలన్నీ తాగేశనమ్మా
పెరుగంతా జారేశనమ్మా,
వెన్నంతా మొక్కేశనమ్మా
ఒక్కడే ఎట్లా తినేశనమ్మా?
ఇది ఎక్కడనైనా కలదమ్మా
ఇది ఎక్కడనైనా కలదమ్మా?
విన్నావటమ్మా…. విన్నావటమ్మ
ఓ యశోదా! గోపిక రమణుల కల్లలూ
ఈ గోపిక రమణుల కల్లలూ…
ఆ… ఎలా బూకరిస్తున్నాడో!
పోనీ పట్టిద్దామంటే చిక్కుతాడా!
భామలందరొక యుక్తిని పన్ని
గమ్మము నొకరుగ కాచియుండగా
భామలందరొక యుక్తిని పన్ని
గమ్మము నొకరుగ కాచియుండగా
ఒకరింట్లో విని గజ్జెల గలగల
ఒకరింట్లో విని వేణుగానమూ
ఒకరింట్లో విని గజ్జెల గలగల
ఒకరింట్లో విని వేణుగానమూ
ఆహా ఇంకేం
దొంగ దొరికెనని పోయిచూడగా
ఛంగున నెటకో దాటిపోయే
ఎలా వచ్చెనో ఎలా పోయెనో
చిలిపి కృష్ణుడనే అడుగవమ్మా…
ఎలా వచ్చెనో ఎలా పోయెనో
చిలిపి కృష్ణుడనే అడుగవమ్మా…
నాకేం తెలుసు నేనిక్కడ లేందే!
మరి ఎక్కడున్నావు?
కాళింది మడుగున విషమును కలిపె
కాళియ తలపై తాండవమాడి
కాళింది మడుగున విషమును కలిపె
కాళియ తలపై తాండవమాడి
ఆ విషసర్పము నంతము జేసి
గోవుల చల్లగ కాచానే…
గోవుల చల్లగ కాచానే…
గోవుల చల్లగ కాచానే…
హే కృష్ణా… హే కృష్ణా….
ముకుందా మొరవినవా
నీవు వినా దిక్కెవరు దీనురాలి గనవా కృష్ణా
నా హీన గతిని గనవా….కృష్ణా కృష్ణా కృష్ణా….
చిత్రం: మాయాబజార్ (1957)
సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: మాధవ పెద్ది సత్యం
ఘటోత్కచుడు పాట
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
అహహ్హ హహ్హ హహ్హ (3)
ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల
ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల
ఓహ్హోరె అరిసెలెల్ల ఇవెల్ల నాకె చెల్ల
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
అహహ్హ హహ్హ హహ్హ (3)
భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు
భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు
భలె జిలేబి ముందు ఇవెల్ల నాకె విందు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
అహహ్హ హహ్హ హహ్హ (3)
మఝూరె అప్పలాలు పులిహోర దప్పళాలు
మఝూరె అప్పలాలు పులిహోర దప్పళాలు
వహ్వారె పాయసాలు ఇవెల్ల నాకె చాలు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
అహహ్హ హహ్హ హహ్హ (3)