చిత్రం: మాయలోడు (1993)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్, సౌందర్య
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: కె.అచ్చిరెడ్డి
విడుదల తేది: 1993
చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో
నీలిమొబ్బు కురుల ముడిని జారవిడిచి వల్లు మరిచి
వాన జాన ఆడింది వయ్యారంగా నీల్ల పూలు జల్లింది సింగారంగా

నింగి నేల ఈవేల చలికి వనికి పోతుంటే బిగికౌగిలి పొదరింటికి
పద పద మంది ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండకాసె ఏలో
అరెయ్ పైన మొబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వలవేయక
సెలయేరై పెనవేసింది అరెయ్ చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటుకేసే బుగ్గమీద ఏలో తలపు తొలివలపూ ఇక తకజమ్ తకజమ్
వయసూ తడి సొగసూ అరె విరిసే సమయమ్ ఆహ ఊహూ ఓహొ హొ హొ
చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో
నీలిమొబ్బు కురుల ముడిని జారవిడిచి వల్లు మరిచి
వాన జాన ఆడింది వయ్యారంగా నీల్ల పూలు జల్లింది సింగారంగా
మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది యదలోపల చలిగాలుల
సుడిరేగింది వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసొచ్చే ఏలో
నేలచూపు పోయింది వాలుచూపుసై అంది చలికోరిక అల ఓకగ తల ఊపింది
అరెయ్ సరసాల సింధులోన ఏలో సరిగంగ తానాలు ఏలో వడిలో ఇక ఒకటై
తక తకతై అంటే సరసానికి దొరసానికి ముడిపెడుతుంటే ఆహా ఊహూ
ఓహో హొ హో చినుకు చినుకు అందెలతో చిట పట చిరు సవ్వడితో