Mee Sreyobhilashi (2008)

చిత్రం: మీ శ్రేయోభిలాషి (2008)
సంగీతం: కోటి
సాహిత్యం: వెనిగళ్ల రాంబాబు
గానం: యస్.పి.బాలు
నటీనటులు: రాజేంద్రప్రసాద్, నరేష్
దర్శకత్వం: వి.ఈశ్వర్ రెడ్డి
నిర్మాత: డా౹౹ వై సోనియా రెడ్డి
విడుదల తేది: 28.12.2008

సాకీ : ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా
బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా

పల్లవి:
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ
అందరికోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి

చరణం: 1
బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో
కలతే లేని జీవితమంటే విలువే లేదులే
అలుపే లేక అవలీలగా ఏ గెలుపూ రాదులే
నింగినంటే ఎవరెస్టైనా
నేలనుండి మొదలౌతుంది
నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
మెరుపులే పిడుగులై ఉరుముతున్నా
ఉరకలు వేసే కిరణం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
చిరుదివ్వెలుగా వెలగాలి
చిరునవ్వులతో బ్రతకాలి
చిరుదివ్వెలుగా వెలగాలి
లోకం నిండిన శోకం తుడిచే
వేకువలా ఉదయించాలి
వెన్నెలనే కురిపించాలి

చరణం: 2
ఎదిగే పక్షిరెక్కకు సహజం ఎగిరే లక్షణం
వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
ఏదీ నీది కాదని అనుకో ఏదోనాటికి
అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి
కొమ్మలన్నీ చుక్కలవైపే కోరికోరి చూస్తున్నా
మట్టితోటి అనుబంధాన్ని
చెట్టు మరువగలదా
చీడలే నీడలై వీడకున్నా
అందరి బృందావనమే జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
శ్రీకారంలా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి
శ్రీకారంలా బ్రతకాలి
గతమంతా కనుమరుగవుతున్నా
నిన్నటి స్వప్నం నిలవాలి
నీ సంకల్పం గెలవాలి

చరణం: 3
ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
ఆశ వెంట ఆచరణుంటే
అద్భుతాలు నీ సొంతం
ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం
నిప్పులే గుండెలో నిండుతున్నా
ఉప్పొంగే జలపాతం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
చిగురాశలతో బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి
చిగురాశలతో బ్రతకాలి
అంతిమ విజయం అనివార్యమని
ఆశిస్తూ నువు బ్రతకాలి
ఆశయాన్ని బ్రతికించాలి

చరణం: 4
నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వె లుగుదా
నలుసే బాధపెడుతుంటే ఆ దోషం కంటిదా
నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే
సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే
పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి
జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి
వరదలా మృత్యువే తరుముతున్నా
ఆరని అగ్నిజ్వాలే జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
శిఖరంలా పెకైదగాలి
చిరునవ్వులతో బ్రతకాలి
శిఖరంలా పెకైదగాలి
చావుకు చూపే ఆ తెగింపుతో
జీవించాలనుకోవాలి
నువు జీవించే తీరాలి

చరణం: 5
విజయం తలుపు తెరచేవరకూ విసుగే చెందకు
విసుగే చెంది నిస్పృహతో నీ వెనుకే చూడకు
చిందే చెమటచుక్కకు సైతం ఉందీ ఫలితమే
అది అందేవరకు సహనంతో
సాగాలి పయనమే
అంతరాత్మ గొంతే నులిమి
శాంతి కోరుకుంటావా
అల్లుకున్న అనుబంధాలే తల్లిడిల్లిపోవా
అలజడే నిలువునా అలుముకున్నా
అలుపెరుగని చైతన్యం జీవితం

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Johnny (2003)
error: Content is protected !!