చిత్రం: మీనా (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర
గానం: సుశీల
నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల
దర్శకత్వం: విజయ నిర్మల
నిర్మాత:
విడుదల తేది: 1973
పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ…
శ్రీరామ నామాలు శతకోటి…
ఒక్కొక్క పేరు బహుతీపి… బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి …..
చరణం: 1
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు…దశరధరామయ్య స్థవనీయుడు…
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు…దశరధరామయ్య స్థవనీయుడు..
కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణరామయ్య కమనీయుడు
కమనీయుడు…
శ్రీరామ నామాలు శతకోటి …..
ఒక్కొక్క పేరు బహుతీపి ….. బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి …..
చరణం: 2
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి…సుందరరామయ్య సుకుమారుడు
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి…సుందరరామయ్య సుకుమారుడు
కోతిమూకలతో ….. ఆ.. ఆ… ఆ…
కోతిమూకలతో లంకపై దండెత్తు…కోదండరామయ్య రణధీరుడు…రణధీరుడు
శ్రీరామ నామాలు శతకోటి
ఒక్కొక్క పేరు బహుతీపి …బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి
చరణం: 3
పవమానసుతుడు పాదాలు పట్టగా…పట్టాభిరామయ్య పరంధాముడు
పవమానసుతుడు పాదాలు పట్టగా…పట్టాభిరామయ్య పరంధాముడు
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు…అచ్యుతరామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు..
శ్రీరామ నామాలు శతకోటి …..
ఒక్కొక్క పేరు బహుతీపి ….. బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి
****** ****** ******
చిత్రం: మీనా (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర
గానం: సుశీల
పల్లవి:
మల్లెతీగ వంటిది మగువ జీవితం
మల్లెతీగ వంటిది మగువ జీవితం
చల్లని పందిరి వుంటే… ఏ ఏ…
అల్లుకుపోయేనూ.. అల్లుకుపోయేనూ
మల్లెతీగ వంటిది మగువ జీవితం
చరణం: 1
తల్లితండ్రుల ముద్దూమురిపెం చిన్నతనంలో కావాలి
తల్లితండ్రుల ముద్దూమురిపెం చిన్నతనంలో కావాలి
ఇల్లాలికి పతి అనురాగం ఎల్లకాలమూ నిలవాలి
ఇల్లాలికి పతి అనురాగం ఎల్లకాలమూ నిలవాలి
తల్లికి పిల్లల ఆదరణ ఆ ఆ పండువయసులో కావాలి
ఆడవారికి అన్నివేళలా తోడూ నీడా ఉండాలి తోడూ నీడా ఉండాలి
మల్లెతీగ వంటిది మగువ జీవితం
చల్లని పందిరి వుంటే ..ఏ ఏ..
అల్లుకుపోయేనూ.. అల్లుకుపోయేనూ
మల్లెతీగ వంటిది మగువ జీవితం
చరణం: 2
నుదుట కుంకుమ కళకళలాడే సుదతే ఇంటికి శోభ
నుదుట కుంకుమ కళకళలాడే సుదతే ఇంటికి శోభ
పిల్లలపాపల ప్రేమతో పెంచే తల్లే ఆరని జ్యోతి
పిల్లలపాపల ప్రేమతో పెంచే తల్లే ఆరని జ్యోతి
అనురాగంతో మనసును దోచే వనితే మమతల పంట
జన్మను ఇచ్చి జాతిని నిలిపే జననియే జగతికి ఆధారం… జననియే జగతికి ఆధారం…
మల్లెతీగ వంటిది మగువ జీవితం
చల్లని పందిరి వుంటే ..ఏ ఏ..
అల్లుకుపోయేనూ.. అల్లుకుపోయేనూ
మల్లెతీగ వంటిది మగువ జీవితం…
***** ****** ******
చిత్రం: మీనా (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: ఎస్.పి.బాలు
పల్లవి:
పెళ్ళంటే… నూరేళ్ల పంట
అది పండాలి.. కోరుకున్న వారి ఇంట పండాలి
బంధాలను తెంచుకొని.. బాధ్యతలను పెంచుకొని..
అడుగు ముందుకేశావమ్మా.. గడప దాటి కదిలావమ్మా
పెళ్ళంటే… నూరేళ్ల పంటా…
చరణం: 1
మనిషి విలువ పెరిగేది.. ధనం వల్ల కాదు
ప్రేమించే హృదయానికి.. పేదతనం లేదు
మనిషి విలువ పెరిగేది.. ధనం వల్ల కాదు
ప్రేమించే హృదయానికి.. పేదతనం లేదు
మనసులోని మమతలను.. తెలుసుకోరు పెద్దలు
మనసులోని మమతలను.. తెలుసుకోరు పెద్దలు
అందుకే.. తిరుగుబాటు చేసేరు పిల్లలు
పెళ్ళంటే… నూరేళ్ల పంట
అది పండాలి.. కోరుకున్న వారి ఇంట పండాలి
పెళ్ళంటే… నూరేళ్ల పంటా…
చరణం: 2
మంచి.. చెడు.. తెలిసి కూడా చెప్పలేని వారు
ఎవ్వరికీ.. పనికిరారు …ఏమి చేయలేరూ
మంచి.. చెడు.. తెలిసి కూడా చెప్పలేని వారు
ఎవ్వరికీ.. పనికిరారు… ఏమి చేయలేరూ
అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు
అపనిందలపాలవుతూ.. అలమటించుతారు
అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు
అపనిందలపాలవుతూ.. అలమటించుతారు
పెళ్ళంటే… నూరేళ్ల పంట …
అది పండాలి.. కోరుకున్న వారి ఇంట పండాలి
పెళ్ళంటే… నూరేళ్ల పంటా…
చరణం: 3
మనసు ఒకరిపైనా.. మనువు ఒకరితోనా…
మనసు ఒకరిపైనా.. మనువు ఒకరితోనా
ఎలా కుదురుతుంది.. ఇది ఎలా జరుగుతుందీ..
కలిమి కాదు మగువకు కావలసింది…
కలిమి కాదు మగువకు కావలసింది…
మనసిచ్చిన వానితో.. మనువు కోరుకుందీ
మనసిచ్చిన వానితో.. మనువు కోరుకుందీ.. మనువు కోరుకుంది..
పెళ్ళంటే… నూరేళ్ల పంట
అది పండాలి.. కోరుకున్న వారి ఇంట పండాలి
బంధాలని తెంచుకొని.. బాధ్యతలను పెంచుకొని..
అడుగు ముందుకేశావమ్మా.. అడుగు ముందుకేశావమ్మా
పెళ్ళంటే… నూరేళ్ల పంటా…