చిత్రం: మేలుకొలుపు (1978)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: సినారె
గానం: జానకి
నటీనటులు: యన్.టి.రామారావు
మాటలు: గొల్లపూడి మారుతీరావు
దర్శకత్వం: బి.వి.ప్రసాద్
నిర్మాత: ఎ. పుండరికాక్షయ్య
విడుదల తేది: 13.01.1978
పల్లవి:
దారి తప్పిన బాలల్లారా… దగా పడిన యువకుల్లారా
చెడు అనవద్దు… చెడు వినవద్దు… చెడు కనవద్దు
ఇది బాపూజీ పిలుపు… ఇదే మేలుకొలుపు… ఇదే మేలుకొలుపు
చెడు అనవద్దు… చెడు వినవద్దు… చెడు కనవద్దు
ఇది బాపూజీ పిలుపు… ఇదే మేలుకొలుపు… ఇదే మేలుకొలుపు
చరణం: 1
ఇంటిని కాల్చే మంటల్లాగా ఎందుకు బ్రతకాలి?
ఆ ఇంటికి చల్లని జ్యోతుల్లాగా ఎపుడూ వెలగాలి
ఇంటిని కాల్చే మంటల్లాగా ఎందుకు బ్రతకాలి
ఆ ఇంటికి చల్లని జ్యోతుల్లాగా ఎపుడూ వెలగాలి
మానవతయే మన దైవం… మంచితనమే మన ధర్మం
మానవతయే మన దైవం… మంచితనమే మన ధర్మం
చెడు అనవద్దు… చెడు వినవద్దు… చెడు కనవద్దు
ఇది బాపూజీ పిలుపు… ఇదే మేలుకొలుపు… ఇదే మేలుకొలుపు
చరణం: 2
చక్కని తెలివి విషమించిందా రక్కసులౌతారు
చక్కని తెలివి విషమించిందా రక్కసులౌతారు
అది మంచిదారిలో మలచుకొంటిరా మహాత్ములౌతారు
మహాత్ములౌతారు..
పరోపకారం పరమగుణం… పరమగుణం
సహనం మన ఆభరణం… ఆభరణం..
చెడు అనవద్దు… చెడు వినవద్దు… చెడు కనవద్దు
ఇది బాపూజీ పిలుపు… ఇదే మేలుకొలుపు… ఇదే మేలుకొలుపు
****** ****** ******
చిత్రం: మేలుకొలుపు (1978)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: దాశరథి
గానం: ఎస్.పి. బాలు, సుశీల
పల్లవి:
కనరాని నీవే కనిపించినావే…
అనురాగ వీణ పలికించినావే
కనరాని నీవే..అహా..
కనిపించినావే…ఆహా..
అనురాగ వీణ..ఆ..
పలికించినావే…. ఆ
చరణం: 1
కలలన్ని నేడు నిజమాయె చూడు….
కలలన్ని నేడు నిజమాయె చూడు
ఏనాటికైనా విడిపోదు తోడూ….
ఇన్నాళ్ళు నీకై వేచాను నేను…
ఇనాళ్ళు నీకై వేచాను నేను…
ఎడబాటు దాటి చేరాను నిన్ను.. చేరాను నిన్ను
ఉందాము మనము… ఒక గూటిలోనే
నడిచేము మనము… ఒక బాటలోనే
చరణం: 2
మ్రోగింది అందె..నా రాజు కోసం
వేసింది చిందు.. నా మూగ హృదయం
హృదయాలు రెండు ఉయ్యాలలూగే
హృదయాలు రెండు ఉయ్యాలలూగే
జత చేరి నేడు సైయ్యాటలాడే
కనుపాపలాగా… నిను చూసుకోనా
పసిపాపలాగా… నిను దాచుకోనా
కనరాని నీవే కనిపించినావే… అనురాగ వీణ పలికించినావే