Merupu Kalalu (1997)

చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్, సాధనాసర్గమ్
నటీనటులు: అరవింద్ స్వామి, ప్రభుదేవా, కాజోల్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాణం: ఏవియం ప్రొడక్షన్స్
విడుదల తేది: 14.01.1997

వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే ! హేయ్..
వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే ! హేయ్..హే..

వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే !
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా …

ఇది సరాసాలా తొలిపరువాలా
జత సాయంత్రం సయ్యన్న మందారం
ఇది సరాసాలా తొలిపరువాలా
జత సాయంత్రం సయ్యన్న మందారం
చెలి అందాలా చెలి ముద్దాడే
చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం

పిల్లా .. పిల్లా ..
భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా ..
పాడేను కుసుమాలు పచ్చాగడ్డి మీనా
ఏ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా !

వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే !
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా …

ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా
ఇది గిల్లీ గిల్లీ వసంతమే ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ

పిల్లా .. పిల్లా ..
పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా
ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు !

వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే !
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగాపంపిస్తా

********  ********  ********

చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం: వేటూరి
గానం: అనూరాధ శ్రీరామ్

పల్లవి:
అపరంజి మదనుడి అనువైన సఖుడులే అతడేమి అందగాడే
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే
వినువీదిలోవుంటే సూర్యుదేవోడునే ఇలమీద వోదిగినాడే
కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు సిశుపాలుడొచ్చినాడే
అపరంజి మదనుడే అనువైన సఖుదులే అతడేమి అందగాడే
పోరాట భూమినే పూదోట కోనగా పులకింప జేసినాడే

చరణం:1
కల్యారి మలనేలు కలికి ముత్యపు రాయి కన్న దిక్కతడులేవే
నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే
ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇల బాలుడొచ్చినాడే
ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై

చరణం:2
అపరంజి మదనుడి అనువైన సఖుడులే అతడేమి అందగాడే
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే
అపరంజి మదనుడి అనువైన సఖుడులే అతడేమి అందగాడే
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే

********  ********  ********

చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, శ్రీనివాస్

ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మెట్టదారి ఇదే బండికి వాలు ఇదే ఓ పోకాల పోరి ఒకతి
కోరి కట్టుకున్న చీర పొగరు చూశా వాన విల్లు వర్ణం ఆహా..
మనసున మల్లె వాన చింది చింది సుధ చిలికే నయగారం
మరి ఎద వాలి గిల్లి కొత్త తాళమడిగినదే చెలగాటం
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా

చరణం: 1
తందానా తందానా తాకి మరి తందానా
ఏ తాళం వాయించాడే
తందానా తందానా పాట వరస తందానా
ఏ రాగం పాడిస్తాడే
సిరి వలపో మతిమరుపో అది హాయిలే
సిరి పెదవో విరి మధువో ప్రియమేనులే
తందానా తందానా కన్నె ప్రేమ తందానా
వచ్చిపోయె వసంతాలే
మనసిజ మల్లెవీణ సిగ్గు సిగ్గు లయలొలికే వ్యవహారం
అది అలవాటుకొచ్చి గుచ్చి చూసి మనసడిగే చెలగాటం
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా

మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి

చరణం: 2
తందానా తందానా ఊసుకనుల తందానా
ఊరించే తెట్టు తేవె
తందానా తందానా పాటకొక తందానా
చెవి నిండా గుమ్మత్తేలే
వయసులలో వరసలలో తెలియందిదే
మనసుపడే మౌన సుఖమే విరహానిదే
తందానా తందానా మేఘరాగం తందానా
వచ్చె వచ్చె వానజల్లే
మధురస మాఘ వేళ కన్నుగీటి కథ నడిపే సాయంత్రం
తొలిచెలి గాలి సోలి కొత్త తోడు కలిసినదే చెలగాటం
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మా చిలక మా చిలక మా చిలక…
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా

********  ********  ********

చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం: వేటూరి
గానం: సుజాత, మలేసియా వాసుదేవన్

ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
కోయిలకే కుక్కూక్కు ఎదహోరే కాంభోజి సంగీతమంటేనే హాయి హాయి
నదిలోన లెహరీ లాలి పసిమువ్వల్లో సన్నాయి
గీతాలు వింటుంటేనే పుట్టే హాయి
జగమంతా సాగే గీతాలే పడుచు కవ్వాలి
సాగింది నాలో స స రి గ మ ప ద ని స రి
ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి

చరణం: 1
రాతిరొచ్చిందో రాగాలే తెచ్చిందో టిక్ టిక్ అంటాది గోడల్లో
దూరపయనంలో రైలు పరుగుల్లో చుక్ చుక్ గీతాలే చలో
సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక మధుర సంగీత సుధ
పాపల్ని తానే పెంచి పాడే తల్లి లాలే హాయి మమతరాగాలు కదా
ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి

చరణం: 2
నీలారం అడుగుల్లో అల్లార్చే రెక్కల్లో ఫట్ ఫట్ సంగీతాలే విను
గోవుల్ల చిందులలో కొలువున్న మాలచ్చి ఎట్టా పాడిందో విను
సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక జీవన సంగీత సుధ
వర్షించే వానజల్లు వర్ణాలన్నీ గానాలేలే ధరణి చిటికేసే విను
ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
కోయిలకే కుహూ కుహూ ఎదహోరే కాంభోజి సంగీతమంటేనే హాయి హాయి
నదిలోన లెహరీ లాలి పసిమువ్వల్లో సన్నాయి
గీతాలు వింటుంటేనే పుట్టే హాయి
జగమంతా సాగే గీతాలే పడుచు కవ్వాలి
సాగింది నాలో స స రి గ మ ప ని స రి
ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి

********  ********  ********

చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం: వేటూరి
గానం: మనో, స్వర్ణలత

పల్లవి:
స్ట్రాబెర్రి కన్నె…. ఊర్వశి వాన్నే…
సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టినదాన
ఫ్రిడ్జ్ లోన ఆపిల్ లా నవ నవ కన్నా
వెండి కంచం జోడు
బెంజ్ AC కారు
ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేల
తనువు విడిపోయింద చనువు కరువయ్యిందా
ఉడుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేల

ఏంట్రా రియాక్షనే లేదు
volume పెంచాలేమో
స్ట్రాబెర్రి కన్నె…. ఊర్వశి వాన్నే…
సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టినదాన
ఫ్రిడ్జ్ లోన ఆపిల్ లా నవ నవ కన్నా
వెండి కంచం జోడు
బెంజ్ AC కారు
ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేల
తనువు విడిపోయింద చనువు కరువయ్యిందా
ఉడుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేల

చరణం: 1
నీ ఆడతనం వేలతనం ఇప్పుడు మరుగై
నీ కల్పనలే అద్భుతమై నిప్పులు చెరిగే
ముగించావే… పైత్యం…
ఫలించనీ … వైద్యం
పాత పైత్యం పిచితనం రెండు చెల్లి
నీది వైద్యం వెర్రితనం నాడే చెల్లి
ముందు తరతరాలెవ్వరు మూడలు కాదే
నాలోన గొడవేదింక
అతని సేవలో ఎప్పుడు లాభం లేదు
మనిషి సేవలే చేసినా తప్పేం లేదు
నేను ఎన్నడు భూమికి భారం కాను
నా బాటలో నరకం లేదు
నిన్న కలలే కన్నా
నేడు కలిసే కన్నా
నాడు తాళితో చితికైన జత కాలేను
ముందు మాల యోగం వెనక సంకెల బంధం
ఇంకా గజిబిజి కళ్యాణం దోవే రద్దు
అయ్యో పెళ్లొద్దంట రూట్ మార్చు

చరణం: 2
కన్నె కళ్ళు ఎన్నో కలలు
ఈ చెక్కిళ్ళు ఎంత ఇష్టం
తల్లో పోసిన తామర నేత్రం
ఏం పెదవి అది ఏం పెదవి
చెర్రి పండు వంటి చిన్ని పెదవి

నోసే కొంచెం ఓవర్ సైజు
ఇట్స్ ఓకే ప్లాస్టిక్ సర్జరీ చేయిద్దాం

ఎవరి ముక్కు ఎవరి పాలు చేసి పెట్టినదెవరో
ఉన్న మెదడు తమకు నిండు సున్నా చేసినదేవరో
ఎవరివో… పురుషుడో…
మంకీయా… మనిషియా

********  ********  ********

చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, శుభ

తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్టిట్టాయను వనమే ఓ తళుకా
వేల్లువ మన్మధవేగం చేలి ఒడిలో కాగేను హృదయం
ఇది చిత్రం పిల్ల నీ వల్లే
తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్టిట్టాయను వనమే ఓ తళుకా
వేల్లువ మన్మధవేగం చేలి ఒడిలో కాగేను హృదయం
ఇది చిత్రం పిల్ల నీ వల్లే
తల్లో తామర మడిచే ఓ చిలకా
తల్లో తామర మడిచే అహ మడిచే ఓ చిలకా1

చరణం: 1
చలాకి చిలకా చిరాకు సోకూ తేనేలె
నా కంఠం వరకు ఆశలు వచ్చే వేళాయె
వెర్రెక్కి నీ కనుచూపులు కావా ప్రేమంటే
నీ నల్లని కురులా నట్టడవుల్లో మాయం నేనైపోయానే
ఉదయంలో ఊహ ఉడుకు పట్టే కోత్తగా
ఎదను మూత పేట్టుకున్న ఆశలింక మాసేనా
జోడించవా ఒళ్ళేంచక్కా

తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్టిట్టాయను వనమే ఓ తళుకా

చరణం: 2
పరువం వచ్చినపోటు తుమ్మేదల వైశాఖం
గలప కప్పలు జతకే చేరే ఆషాఢం
ఎడారి కోయిల పేంటిని వేతికే గంధారం
విరాలిగీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కాలం
మతం తోలిగిన పిల్లా అదెంతదో నీ ఆశ
నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ
ఇదేసుమా కౌగిళి భాష

తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్టిట్టాయను వనమే ఓ తళుకా
వేల్లువ మన్మధవేగం చేలి ఒడిలో కాగేను హృదయం
ఇది చిత్రం పిల్ల నీ వల్లే
తల్లో తామర మడిచే
అట్టిట్టాయను వనమే
తల్లో తామర మడిచే
అట్టిట్టాయను వనమే రా

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Swagatam (2008)
error: Content is protected !!