చిత్రం: మైకేల్ మదన కామ రాజు (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: కమల్ హాసన్, కీర్తన , కుష్బూ , ఊర్వశి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత:
విడుదల తేది: 1991
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
మాటలకందని రూపం వర్ణించదే ఈ కావ్యం
పూచిన నీలో అందం నాకది మంగళ బందం
నీ నవ్వులన్నీ చంద్రోదయాలే
నీ చూపులన్నీ అరుణోదయాలే..ఆ..ఆ
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
ఆమని పండుగ చేసి స్వప్నాల లోకము విరిసె
ప్రేమ సరాగము పిలిచె స్వర్గం ఎదురుగా నిలిచె
ఈ అనురాగం మన్మథ యాగం
భువిని వెలిసె మనకొక లోకం ..ఆ..ఆ
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం