చిత్రం: మైఖేల్ మధన కామరాజు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం:
గానం: సునిధి చౌహన్ , రంజిత్
నటీనటులు: శ్రీకాంత్ , ప్రభుదేవా, ఛార్మి
దర్శకత్వం: నిధి ప్రసాద్
నిర్మాత: రాజు ప్రవీణ్
విడుదల తేది: 18.04.2008
పల్లవి:
నా రాశి కన్యారాశి
నిన్ను చూసి వచ్చా ముచ్చటేసి
కావాలి మిథునం రాశి నీలాంటి రసికుని దోస్తీ
ఆ మంచి శకునము చూసి సుఖపెడతా దరువును వేసి
వస్తా ప్యారి చేస్తా చోరి హద్దేమీరి కుడతా నారి కన్నెలేడి
గుండె జారి నిన్నే కోరి చెయ్యంటుంది నీతోచేరి రసకేళి
నా రాశి కన్యారాశి
నిన్ను చూసి వచ్చా ముచ్చటేసి
చరణం: 1
నా ఒంటిలోన అగ్గివుంది
నీ రూపు చూసి భగ్గుమంది
చెయ్యి వేస్తే హీట్ తగ్గుతుంది
నా లేత ప్రాయం త్వరపెడుతుంది
రసిక రాజుల మారి అరె మధన యాగమే చేసి
మరి ముద్దు ముచ్చటే తీర్చేస్తాను రావే
దూకుడెక్కేవే గానీ నా సోకు చిత్తడై పోనీ
చిరు చెమట ఒంటికే పట్టించే మధనా
కానిస్తా మదిలో రోజా సరసంగా మన్మధ పూజా
పడివన్నెలు ఉన్నవి నీకే తాజాగా
నా రాశి కన్యారాశి
చరణం: 2
నా ఈడు గోలపెడుతుంది
నీ పైనే జారి పడుతుంది
నాలోనె తేనె పుడుతుంది
తుమ్మెద నువ్వై రమ్మంటుంది
నీ వయసు తాపమే చూసి
నా తనువు విల్లులా వంచి
మగసిరితో రంకెలువేసి రెచ్చిపోతా
పెదవి ముద్దరే వేసి తొలిరేయి నిద్దరే కాసి
ఎండ సోకని సోకులు దాటి రా
టచ్చేస్తా ఎందుకు భాద తనువుల్నే కలిపే రాధ
గుబులెందుకు ఇంకా రాత్రిక మనదేగా
నా రాశి కన్యారాశి
నిన్ను చూసి వచ్చా ముచ్చటేసి