Middle Class Melodies (2020)

Middle Class Melodies (2020)

సంధ్యా..! పదపద పదమని… లిరిక్స్

చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్‌ (2020)
సంగీతం: స్వీక‌ర్ అగ‌స్తి
సాహిత్యం: సనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: స్వీక‌ర్ అగ‌స్తి
నటీనటులు: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ
దర్శకత్వం: వినోద్ అనంతోజు
నిర్మాణం: వెనిగ‌ళ్ళ ఆనంద‌ప్ర‌సాద్
విడుదల తేది: 20200

Sandhya Song Telugu Lyrics

సంధ్యా..! పదపద పదమని… అంటే సిగ్గే ఆపిందా
బావా..! అని పిలిచేందుకు… మొహమాటంతో ఇబ్బందా

నువు వణక్క, తొనక్క, బెరక్క… సరిగ్గ ఉంటే చాలే
కథ వెనక్కి జరక్క… చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు… ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి… కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే

మధ్యలో ఉన్నది… దగ్గరో దూరమో, కాస్తయినా తెలిసిందా
ఎంతకీ తేలనీ ప్రేమలో తేలడం… ఏమైనా బాగుందా ఆఆ
మాటలని కుక్కేశావే… మనసు నిండా
వాటినిక పంపేదుందా… పెదవి గుండా
బిడియంతో సహవాసం… ఇక చాలు బాలిక
అది ఎంతో అపచారం… అని అనుకోవే చిలకా

సంధ్యా..! పదపద పదమని… అంటే సిగ్గే ఆపిందా
బావా..! అని పిలిచేందుకు… మొహమాటంతో ఇబ్బందా

ఏం సరిపొద్దే నువు చూపే ప్రేమా…
ఓ తెగ చూస్తే… పనులేవీ కావమ్మా
పైకలా అవుపిస్తాడే ఎవరికైనా…
వాడికీ ఇష్టం ఉందే తమరిపైనా…
విసిరావో గురిచూసి… వలపన్న బాణమే
పడిపోదా వలలోన… పిలగాడి ప్రాణమే

సంధ్యా..! పదపద పదమని… అంటే సిగ్గే ఆపిందా
ఔనే..! పొగరును ప్రేమతో… మనిషిని చేస్తే మీ బావే
నువు వణక్క, తొనక్క, బెరక్క… సరిగ్గ ఉంటే చాలే
కథ వెనక్కి జరక్క… చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు… ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి… కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

తెల్లారే ఊరంతా తయ్యారే… లిరిక్స్

చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్‌ (2020)
సంగీతం: స్వీక‌ర్ అగ‌స్తి
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ
దర్శకత్వం: వినోద్ అనంతోజు
నిర్మాణం: వెనిగ‌ళ్ళ ఆనంద‌ప్ర‌సాద్
విడుదల తేది: 2020

The Guntur Song Telugu Lyrics

తెల్లారే ఊరంతా తయ్యారే… ముస్తాబై పిలిచింది గుంటూరే
రద్దీలో యుద్ధాలే మొదలాయే… తగ్గేదే లేదంటే ప్రతివాడే

మరుపే రాని ఊరే గుంటూరే… అలుపంటూ లేదంటే సూరీడే
పగలంతా తడిసేలే సొక్కాలే… ఎన్నెన్నో సరదాలే కొలువుంటే
కారాలే నూరేది అంటారే…

బేరం సారం సాగే దారుల్లోన… నోరూరించే మిర్చి బజ్జి తగిలే
దారం నుంచి సారె సీరల దాక… గాలం ఏసి పట్నం బజారు పిలిసే

యే… పులిహోర దోశ – బ్రాడీపేట
బిర్యానికైతే – సుభాని మామ
వంకాయ బజ్జి – ఆరో లైను
గోంగూర చికెన్ – బృందావనం
మసాల ముంత – సంగడి గుంట
మాలు పూరి – కొత్తపేట
చిట్టి ఇడ్లీ – లక్ష్మి పురం
అరె… చెక్క పకోడీ – మూడొంతెనలూ

గుటకే పడక కడుపే తిడితే… సబ్జా గింజల సోడా బుస్సందే
పొడి కారం నెయ్యేసి పెడుతుంటే… పొగ చూరే దారుల్లో నోరూరే
అడిగిందే తడువంటా ఏదైనా… లేదన్నా మాటంటూ రాదంటా
సరదా పడితే పోదాం గుంటూరే…

Middle Class Melodies Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

error: Content is protected !!