Mirapakay (2011)

చిత్రం: మిరపకాయ్ (2011)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తీక్, రంజిత్, రాహుల్ నంబియర్
నటీనటులు: రవితేజ, రీచా గంగోపాధ్యాయ, దీక్షాసేత్
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: రమేష్ పుప్పల్ల
విడుదల తేది: 12.01.2011

అదిగోరా చూడు ఆకతాయిరో
గిరి గీస్తే చాలు గీటు రాయిరో
కర కర కరలాడే మిరపకాయిరో యారో…

ఐశ్వర్య రాయిని అడిగానా
దీపిక పదుకొనె అన్నానా
కత్రినా కైఫే అవసరమా
అరె గిల్లుని జిల్లని గిల్లే పిల్లే నాకే ఇప్పుడు కావాలే
ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
దిల్లంతా దున్నుకు పోయే కన్నులు ఉన్నది యాడుందో
ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
లైఫంతా లవ్వుని పంచి కెవ్వనిపించేదేడుందో

అదిగోరా చూడు ఆకతాయిరో
గిరి గీస్తే చాలు గీటు రాయిరో

కౌన్ రే కౌన్ రే ఎక్కడున్నావ్ ప్రియతమా
ఢూండ్‌నా ఢూండ్‌నా జాడ కాస్త చెప్పుమా
జిందగీ కీ రాహ్ మే జంటకట్టు లాత్తొనే
ప్యార్ తేరా చాహు మే కాస్త నాకు ప్యార్ దే
ప్యార్ దే..ప్యార్ దే..ప్యార్ దే..ప్యార్ దే..హేయ్

ఈ ప్రేమనేది పేడ లాంటిది
ఉండగా చుడితే గొబ్బెమ్మవుద్ది
నీళ్ళలో కలిపితే కల్లాపవుద్ది
గోడకేసి కొడితే పిడకవుద్ది
అంటే నా ఉద్దేశ్యం
ఎలా మొదలౌద్దో ఎప్పుడు ఫినిషౌద్దో తెలీదో…

బైకు బ్యాక్‌కి కళ పెంచేది ఇంటి ఫ్రంటులో వెలిగించేది
గంట గంటకీ విసిగించేది ఆ గుంట యాడుందో…
ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
దిల్లంతా దున్నుకుపోయే కన్నులు ఉన్నది యాడుందో
లైఫంతా లవ్వుని పంచి కెవ్వనిపించే దేడుందో

అదిగోరా చూడు ఆకతాయిరో
గిరి గీస్తే చాలు గీటు రాయిరో

హే హే హే హే రొంబా రొంబే
Right Now I am Feelin Alone
Girl Are You The One
Coz I Want Sombody Here With Me
Take Me Away
Girl Dont Make Me Wait
Come Away
Come Close To Me
You Are The One For Me

మనసిచ్చిందంటే మబ్బుల్లో స్టెప్పులేస్తా
ముద్దిచ్చిందంటే ముంగిట్లో ముగ్గులేస్తా
వాటేసిందంటే వండేసి వడ్డించేస్తా
దీనబ్బ యాడుందో…
ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
దిల్లంతా దున్నుకుపోయే కన్నులు ఉన్నది యాడుందో
లైఫంతా లవ్వుని పంచి కెవ్వనిపించేదేడుందో

అదిగోరా చూడు ఆకతాయిరో
గిరి గీస్తే చాలు గీటు రాయిరో
కర కర కరలాడే మిరపకాయిరో యారో…

***********   ***********   ***********

చిత్రం: మిరపకాయ్ (2011)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: సాహితి
గానం: నవీన్, రీటా, రంజిత్, వర్ధిని

చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే
వానల్లో ఒక్కో చినుకు ముత్యపు పువ్వై పూస్తే పూస్తే
చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే
వానల్లో దోస్తీకొచ్చే తోడే ఉంటే మస్తే మస్తే

హే గుంగురో అరె గుంగురో
అరె సూపరో అరె క్రాపురో
అరె అరె అరె గుంగురో అరె గుంగురో

అరె గుంగురో గుంగురో ఘల్లంటూ మొంగెరో గుంగురో
అయ్యయ్యాయ్ గంగురో గంగురో చింగంటూ గుంగెరో గుంగురో
అరె గింగరో గింగరో తిమ్మిరిగా సింగరో సాంగురో
రై రై రై రంగురో రంగురో లైఫంటే యెంగలో రంగురో

చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే
చినుకుల్లో సల్సా జల్సా చిందే వేస్తే మస్తే మస్తే
అరె చిందే వేస్తే మస్తే మస్తే
అరె చిందే వేస్తే అరె మస్తే మస్తే
చిందే వేస్తే మస్తే మస్తే..మస్టే మస్తే

అరె గుంగురో గుంగురో ఘల్లంటూ మొంగెరో గుంగురో
అయ్యయ్యాయ్ గంగురో గంగురో చింగంటూ గుంగెరో గుంగురో
అరె గింగరో గింగరో తిమ్మిరిగా సింగరో సాంగురో
రై రై రై రంగురో రంగురో లైఫంటే యెంగలో రంగురో

***********   ***********   ***********

చిత్రం: మిరపకాయ్ (2011)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్

శుమ శ్యామల కల కల కల
శుభ మంగళ గల గల గల హో
పలికెను ఇలా…

ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా
నిన్నే ప్యార్ కియా పాగల్ హో గయా
పిల్లా నీ వల్ల…
ధినక్ ధిన్ జియా దూకుడేందయ్యా
తాకిడేందయ్యా వేగలేనయ్యా
అబ్బో నీ వల్ల నీ వల్ల నీ వల్ల రే…
నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా
పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా
వయసే సయ్యందియ్యా వాద్యాలే మోగించొద్దయ్యా
మనసే కలిసిందయ్యా మకరం మిథునం చూడొద్దయ్యా
మాప మాప మాప రిమ గరిస

శుమ శ్యామల కల కల కల
శుభ మంగళ గల గల గల హో
పలికెను ఇలా…

ధినక్ ధిన్ జియా… జియా జియా జియా

నవ ఎవరది వదనా మది కదిపిన మదనా
నస పిలుపుల నిపుణా నవ్విస్తే కాదు అనగలనా
లయ తెలిసిన లలనా శృతి కలిపిన సుగుణా
శత మదగజ గమనా కవ్విస్తే కాలు నిలబడునా
మలుపులు తిరిగిన రచనా
మలుపులు తిరిగిన రచనా
వలపులకొక నిర్వచనా
తొలి వలపులకొక నిర్వచనా

నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా
పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా
వయసే సయ్యందియ్యా వేదాలే వల్లించొద్దయ్యా
మనసే కలిసిందయ్యా మేనాతో నీ పని లేదయ్యా
మాప మాప మాప రిమ గరిస

శుమ శ్యామల కల కల కల
శుభ మంగళ గల గల గల హో
పలికెను ఇలా…
ధినక్ ధిన్ జియా

అణువణువున తపనా అలుపెరుగని వెపనా
నిశి కిరికిరి కిరణా నీతోటి నేను పడగలనా
కసి మెరుపుల కరుణా సుఖ విరుపుల సృజనా
జగమెరుగని జగనా నీ పైకి నేను ఎగబడనా
మగసిరి గడసిరి ద్విగునా
సొగసరి గడసరి ద్విగునా
సరసపు సరసలు దిగనా
చెలి సరసపు సరసుల దిగనా

నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా
పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా
వయసే సయ్యందయ్యా వేలాది బంధువులొద్దయ్యా
మనసే కలిసిందయ్యా మమ జీవనమే మన దిన చర్య
మాప మాప మాప రిమ గరిస

ధినక్ ధిన్ జియా
నిన్నే ప్యార్ కియా పాగల్ హో గయా పిల్లా నీ వల్ల

***********   ***********   ***********

చిత్రం: మిరపకాయ్ (2011)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, గీతా మాధురి

గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో మహానుభావా
అది తెలిసిన బిడియము జడిసెను ఎందుకో
తలమునకల తలపుల అలజడి దేనికో గ్రహించలేవా
అరమరికల తెర విడు అలికిడి పోల్చుకో తేల్చుకో
ఉడికే ఈడుతో పడలేకున్నా
దయతో నన్నాదుకో దరికొస్తున్నా
కొరికే ఈ కోరికే వివరిస్తున్నా
నిను తాకే గాలితో వినిపిస్తున్నా
రమణి రహస్య యాతన చూశా
తగు సహాయమై వచ్చేశా
కనుక అదరక బెదరక నా జంటే కోరుకో చేరుకో

ఉడికే ఈడుతో పడలేకున్నా
దయతో నన్నాదుకో దరికొస్తున్నా

నువ్వెంత అవస్థ పడుతున్నా
అదంత సమస్య కాదన్నా
చిలకరో చిటికెలో తపన తగ్గించి పోలేనా

ఆశ గిల్లిందని ధ్యాస మళ్ళిందని
ఇంత గల్లంతు నీ వల్లనే లెమ్మని
వచ్చి నిందించనీ తెచ్చి అందించనీ
ఓర్చుకోలేని ఆపసోపాలని
ఆశ గిల్లిందని ధ్యాస మళ్ళిందని
ఇంత గల్లంతు నీ వల్లనే లెమ్మని
వచ్చి నిందించనీ తెచ్చి అందించనీ
ఓర్చుకోలేని ఆపసోపాలని
పడతి ప్రయాస గమనిస్తున్నా
నే తయారుగానే ఉన్నా
సొగసు విరివిగ విరిసిన
ప్రియ భారం దించుకో పంచుకో
ఇదిగో తీసుకో ఎదరే ఉన్నా
నిధులన్నీ దోచుకో ఎవరేమన్నా

అగ్గి రవ్వంటి నీ దగ్గరవ్వాలని
కెవ్వుమంటూ ఎటో సిగ్గు పోవాలని
చెప్పకుండా విని చెంతకొస్తావని
గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని
అగ్గి రవ్వంటి నీ దగ్గరవ్వాలని
కెవ్వుమంటూ ఎటో సిగ్గు పోవాలని
చెప్పకుండా విని చెంతకొస్తావని
గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని
తెలిసి మరెందుకీ ఆలస్యం
తక్షణం తథాస్తనుకుందాం
నివురు వదిలిన నిప్పులు
నిలువెల్లా మోజుతో రాజుకో
ఉరికే ఊహలో విహరిస్తున్నా
మతిపోయే మాయలో మునకేస్తున్నా

నువ్వెంత అవస్థ పడుతున్నా
అదంత సమస్య కాదన్నా
చిలకరో చిటికెలో తపన తగ్గించి పోలేన

***********   ***********   ***********

చిత్రం: మిరపకాయ్ (2011)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: చిత్ర, రాహుల్ నంబియర్

సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా
గుండెల్లో గోలి సోడ పేలుతున్నదే
ప్రేమ పిచ్చి ఒకటే కనక
కునుకే పడక ఒళ్ళంతే తీనుమారు ఆడుతున్నదే

బోలో హే సలాం బోలో హే సలాం
తన నన్నన నన్నన హే సలం
బోలో హే సలాం బోలో హే సలాం బోలో

ఓ మేరీ చెలియా సావరియా
ఈ ప్రపంచమంతే ధడధడలాడిద్దామా
ఇకపైన ఎకడైనా అరె ధడే ధడేల్ లవ్ పటాసు పేలుద్దామా
హే హే హే చరితలకే దిమ్మ తిరిగెలా
తుఫాను రేపాల సడెనుగా సునామి రావాల
ఏయ్ ఈల వేసి గోల చేసి ఇల్లు పీకి పందిరేసి
రచ్చ రచ్చ చెయ్యాలె

బోలో I am in love బోలో I am in love
మన బ్యానర్లు కడదం బస్టాండులో
బోలో I am in love బోలో I am in love
మన జెండాలు కడదం జంక్షన్లలో
బోలో I am in love బోలో I am in love
మరీ మైకెట్టి చెబుదాం మార్కుట్టులో
బోలో I am in love బోలో I am in love
మన హోర్దింగులెడదాం మెయిన్ రోడ్డులో

సిలకా రాయే సిలకా

నేను I love you నీకు చెప్పాలిలే
నువ్వు వద్దంటూ ఛీ ఛీ కొట్టాలిలే
నీ మావయ్య చెవిలో ఊదాలిలే
మరి వాడొచ్చి వార్నింగ్ ఇవ్వాలిలే
ఫేసు బుక్కుల్లో చాటింగ్ చెయ్యాలిలే
ఇంక ట్విట్టర్లో మీటింగు పెట్టాలిలే
అరె ఆర్కుట్లు మనమే నిండాలిలే
హే హే హే పైకెనక నా రావసిలక
నన్ను వాటేసుకోవాల
చూసినోళ్ళు కుళ్ళి కుళ్ళి సావాల
ఏయ్ పడి పడి ఎగబడి జనమిక
మతి చెడి పిచ్చెక్కి పోవాలే

బోలో I am in love బోలో I am in love
మన ఫోటోలు వేద్దాం పేపర్లలో
బోలో I am in love బోలో I am in love
చలో కచేర్లు చేద్దాం కాలేజిల్లో
బోలో I am in love బోలో I am in love
తెగ స్క్రోలింగులిద్దాం ఛానెల్సుల్లో
బోలో I am in love బోలో I am in love
full ఫోకస్సు అవుదాం పబ్లిక్కులో

సిలకా రాయే సిలకా

బనాది తుజ్ కో మేరీ జోడి
అదా పే ఛడ్ జా మేరీ గాడీ
బజావో దిల్ కీ హర్ ఘంటీ
దిఖావో ప్యార్ కీ ఏక్ చిట్టీ

ముద్దు మెసేజిలెన్నో పంపాలిలే
హద్దులెనున్న గానీ దాటాలిలే
అర్ధ రాత్రిల్లు ఫోనే మోగాలిలే
పొద్దు పొద్దున్నే మళ్ళీ చూడాలిలే
డైలి వెయిటింగులెన్నో చెయ్యాలిలే
సిల్లీ ఫైటింగులెన్నో అవ్వాలిలే
లవ్ మీటింగులెన్నో ఇవ్వాలిలే…
హే హే హే ఇది తెలిసి మీ బాబొచ్చి
బండ బూతుల్ని తిట్టాలా
ఊరంతా పంచాయితీ పెట్టాలే
మా ఇంటి ముందు టెంటు వేసి
లవ్వు దీక్ష నువ్వు చేసి నన్నెత్తుకెళ్ళాలే

బోలో I am in love బోలో I am in love
ఇక గలాట చేద్దాం గల్లీలలో
బోలో I am in love బోలో I am in love
తెగ భజనలు చేద్దాం బజారులో
బోలో I am in love బోలో I am in love
బోలో I am in love బోలో I am in love
ఫుల్లు ఫేమస్సు అవుదాం ఈ దెబ్బతో

సిలకా రాయే సిలకా
సిలకా రాయే సిలకా

***********   ***********   ***********

చిత్రం: మిరపకాయ్ (2011)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: ఎస్. ఎస్. థమన్

హే చూడొద్దే చూడొద్దే చూడొద్దే చూడొద్దే కోపంగా చూడొద్దే
అరె చంపొద్దే చంపొద్దే చంపొద్దే చంపొద్దే నన్నిట్టా చంపొద్దే
అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా ఓసేయ్
వైశాలి I’m ver very sorry అంటున్నా ఇంకోసారి I’m sorry
అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా
వైశాలి I’m very sorry మిస్టేకే
జరిగుంటే మళ్ళోసారి I’m very sorry
సరదాగా నవ్వేస్తే ఏం పోద్దే పిసినారి
నీ కోపం తగలెట్ట శాంతించే సుకుమారి
నీ ఫేసుకది సూటవ్వదు
అంత లేదో అంత లేదో అంత లేదో
అంతా లేదో అంతా లేదో
నీ అంతలేసి కళ్ళలోనే ఇంత కోపం
బాగా లేదు బాగా లేదు

అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా
నీ కాళ్ళే పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా
నీ మీద పడిపోనా
వైశాలే…

హే…తగువెపుడూ తెగే దాకా లాగావంటే లాసైపోతావే
అపుడపుడూ సరే అంటూ సర్దుకుపోతూ ఐసై పోవాలే
సిన్న సిన్న వాటికే శివాలెత్తేస్తే
సుఖపడే యోగం లేనే లేనట్టే
కోపంలో అమ్మాయి అందంగా ఉంటుందే
అని ఎవడో మీ చెవిలో క్యాబేజే పెట్టాడే
ఆ మాట పట్టుక్కూర్చోవద్దు

అంత లేదో అంత లేదో అంత లేదో
అంతా లేదో అంతా లేదో
ఈ గంతులేసే వయసులోనే పంతమంటే
వద్దే వద్దు రానీవద్దు

హే…యారారె రే…
తిట్టి తిట్టి పెదాలెలా కందాయొ చూడే
విను వినవే సున్నం లాగా మూతే పెట్టి సతాయించొద్దే
ఉన్నదొకటే కదా యెదవ జిందగీ
దాన్ని ఏడిపించకే మాటిమాటికీ
నలుగుర్లో కలవందే బరువేగా బతుకంతా
గిరి గీసి కూర్చొంటే వదిలేయరా జనమంతా
నువ్వు గింజుకున్నా లాభం లేదు

అంత లేదో అంత లేదో అంత లేదో
అంతా లేదో అంతా లేదో
గంతలేసి లోకమంతా చీకటంటే
ఎలా లెద్దూ ఓసేయ్ మొద్దు

అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా
అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా వైశాలే…

Previous
Eswar (2002)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Sahasam Swasaga Sagipo (2016)
error: Content is protected !!