చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: పి. లీల, ఏ. యమ్. రాజా
నటీనటులు: యన్. టి. రామారావు, భానుమతి రామకృష్ణ, సావిత్రి, నాగేశ్వరరావు అక్కినేని, జమున
దర్శకత్వం: ఎల్. వి. ప్రసాద్
నిర్మాత: బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి
విడుదల తేది: 12.01.1955
రావోయి చందమామ మా వింత గాద వినుమా
రావోయి చందమామ మా వింత గాద వినుమా
చరణం: 1
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్
సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే
చరణం: 2
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా
చరణం: 3
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్
మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్
చరణం: 4
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటన గనుమా