చిత్రం: ఎం.ఎల్.ఎ. (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, జానకి
నటీనటులు: కొంగర జగ్గయ్య, సావిత్రి
నిర్మాత, దర్శకత్వం: కె.బి.తిలక్
విడుదల తేది: 1957
పల్లవి:
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం…
చరణం: 1
పాలించెను గోలుకొండ కులీకుతుబ్ షాహి…ఆ..ఆ..ఆ
పాలించెను గోలుకొండ కులీకుతుబ్ షాహి
భాగమతి అతని యొక్క ముద్దుల దేవి
ప్రేయసికై కట్టినాడు పెద్ద ఊరు…
ఆ ఊరే ఈనాడు హైదరబాదు…ఊ..ఊ…
ఇదేనండి ఇదేనండి….
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం
అలనాడు వచ్చెనిట మహంమారి ..ఈ…ఈ…
అలనాడు వచ్చెనిట మహంమారి
అల్లా దయవల్ల ఆ పీడ పోయినాది
ఆ గండం తప్పిందని గుర్తు నిలిపినారు
ఆ గండం తప్పిందని గుర్తు నిలిపినారు
ఆ గుర్తే అందమైన చార్మినారు
ఇదేనండి ఇదేనండి…
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం
చరణం: 2
ఇది పాడు పడిన గోలుకొండకోట
శ్రీరాముడు కనుపించే తానీషాదీ తోట
ఇది పాడు పడిన గోలుకొండకోట
శ్రీరాముడు కనుపించే తానీషాదీ తోట
భద్రాద్రి రామదాసు బందిఖానా
చూడండి యిదిగో ఈ కోటలోనా…
ఇదేనండి ఇదేనండి…
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం
అలనాడిది తెనుగుతల్లి అందమైన తోట
అలనాడిది తెనుగుతల్లి అందమైన తోట
ఆంధ్ర శౌర్య వాహినులే పారినవీచోట
ఔరంగజేబు అసూయచే దాడి వెడలినాడట
ఔరంగజేబు అసూయచే దాడి వెడలినాడట
కోట పట్టుకొనగ మరియేమో పట్టీనాడట
ఇదేనండి ఇదేనండి…
ఇదేనండి ఇదేనండి..భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం
చరణం: 3
వింత వస్తుశాలలు విశాలమగు వీధులు
వింత వస్తుశాలలు విశాలమగు వీధులు
విద్యాలయ భవనాలు.. ఉద్యాన వనాలు
కనుల కింపు చేసే కమ్మని నగరం
కనుల కింపు చేసే కమ్మని నగరం
భరత మాత జడలోనే పసిడి నాగరం
ఇదేనండి ఇదేనండి …
ఇదేనండి ఇదేనండి …భాగ్యనగరం
మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం ముఖ్యపట్టణం
****** ******* ******
చిత్రం: ఎం.ఎల్.ఎ. (1957)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, జానకి
పల్లవి:
నీ ఆశ… అడియాశ…చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస.. లంబాడోళ్ళ రాందాసా
నీ ఆశ అడియాశ చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా
చరణం: 1
ఓ… తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి
తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి
చితికినది నీ మనసు అతుకుటకూ లేరెవరు
నీ ఆశ అడియాశ చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా
చరణం: 2
గుండెలలో గునపాలు గుచ్చారే నీవాళ్ళు
గుండెలలో గునపాలు గుచ్చారే నీవాళ్ళు
కన్నులలో గోదారి కాలువలే కట్టింది
నీ ఆశ అడియాశ చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా..