చిత్రం: మొదటి సినిమా (2005)
సంగీతం: స్వరాజ్
సాహిత్యం: సిరివెన్నెల (All Songs)
గానం: యస్. పి.బి చరణ్, సునీత
నటీనటులు: నవదీప్, పూనమ్ బజ్వా
దర్శకత్వం: కూచిపూడి వెంకట్
నిర్మాత: కుందురు రమణారెడ్డి
విడుదల తేది: 21.10.2005
ఝల్లు మనదా హృదయం
తుళ్లి పడదా సమయం
నమ్మగలదా నయణం నయగారమా
నువ్వేనా నువ్వను కున్నానా
నిజమేనా ఊహలో ఉన్నానా
ఝల్లు మనదా హృదయం
తుళ్లి పడదా సమయం
నమ్మగలదా నయణం నయగారమా
నువ్వేనా నువ్వను కున్నానా
నిజమేనా ఊహలో ఉన్నానా
ఐతే నాకోసం నువ్వొక కవిత చెప్పు
ఏ కవిత చెప్పను
ఆ స్వరము నువ్వై – హ హ తరువాత
స్వరమున పదము నువ్వై – హ హ
రాగం గీతం కాదా
ఇది ఆకలి రాజ్యం కాదా హ హ
ఎన్నివేల కలవరింతలో విన్నవించు కున్నాక
నన్నివేళ పగటి కాంతిలో కలుసుకుంది శశిరేఖా
ఎన్నివేల కలవరింతలో విన్నవించు కున్నాక
నన్నివేళ పగటి కాంతిలో కలుసుకుంది శశిరేఖా
ఈ శబ్దం స్వప్నంలా కరిగేదాకా
మైమరుపే ఆపాల నెత్తురు రాక
స్నాదేహం పోతుందేమో నన్ను నేను గిల్లి చూసుకుంటే
ఝల్లు మనదా హృదయం
తుళ్లి పడదా సమయం
నమ్మగలదా నయణం నయగారమా
నువ్వేనా నువ్వను కున్నానా
నిజమేనా ఊహలో ఉన్నానా
ఆశలెపుడు హంసలేఖలై ఆమెదాక చేరాయో
కాంక్షలెపుడు కుంచె కుదుపులై ఆమె లాగ మారాయో
ఆశలెపుడు హంసలేఖలై ఆమెదాక చేరాయో
కాంక్షలెపుడు కుంచె కుదుపులై ఆమె లాగ మారాయో
చిరు చినుకై మలిచింది మనిషే ఐనా
ఇంతందం తెలిసిందా తనకెపుడైనా
తలపంతా తలవంచింది కళ్ళముందు ఆమె వచ్చి ఉంటే
ఝల్లు మనదా హృదయం
తుళ్లి పడదా సమయం
నమ్మగలదా నయణం నయగారమా
నువ్వేనా నువ్వను కున్నానా
నిజమేనా ఊహలో ఉన్నానా