చిత్రం: మూడు పువ్వులు-ఆరుకాయలు (1979)
సంగీతం: సత్యం
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల
నటీనటులు: కృష్ణ , విజయనిర్మల
కథ, మాటలు:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయనిర్మల
నిర్మాత: యమ్.చంద్ర కుమార్
సినిమాటోగ్రఫీ:
ఎడిటర్:
బ్యానర్: యస్. వి.యస్.ఫిలింస్
విడుదల తేది: 05.01.1979
పల్లవి:
రథమొస్తున్నది రాణొస్తున్నది… తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్… ఈ ఊరి రాదారి నాదేనండోయ్
రథమొస్తున్నది రాణొస్తున్నది… తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్… ఈ ఊరి రాదారి నాదేనండోయ్
ఛల్నీ… ఛల్నీ
చరణం: 1
నేన్ననది మాట… నేన్నున్నది కోట
నా పెన్నిధి ఒకటే… అది నవ్వుల మూట
నేన్ననది మాట… నేన్నున్నది కోట
నా పెన్నిధి ఒకటే… అది నవ్వుల మూట
నా నీడపడితే చాలు వేకువ ముందే వెలుగండోయ్
నా నీడపడితే చాలు వేకువ ముందే వెలుగండోయ్
ఈ నేల ఆ నీరు నాదండోయ్
ఈ నేల ఆ నీరు నాదేనండోయ్
రథమొస్తున్నది రాణొస్తున్నది… తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్… ఈ ఊరి రాదారి నాదేనండోయ్
ఛల్నీ… ఛల్నీ
చరణం: 2
నా చూపే వాడి… నా తీరే రౌడి
హే.. నన్నెదిరించే నాథుడు ఏడి?
నా చూపే వాడి… నా తీరే రౌడి
హే.. నన్నెదిరించే నాథుడు ఏడి?
నా పేరు చెబితే చాలు పోకిరిగాళ్ళకు హడలండోయ్
నా పేరు చెబితే చాలు పోకిరిగాళ్ళకు హడలండోయ్
ఉసి అయినా విసురైనా నాదండోయ్
ఉసి అయినా విసురైనా నాదేనండోయ్
రథమొస్తున్నది రాణొస్తున్నది.. తొలగండోయ్ పక్కకు తొలగండోయ్
ఈ ఊరి రాదారి నాదండోయ్… ఈ ఊరి రాదారి నాదేనండోయ్
ఛల్నీ… ఛల్నీ … ఛల్నీ… ఛల్నీ